నేటి నుంచి అమల్లోకి 5 కీలక మార్పులు, మీ పర్స్‌పై ప్రభావం చూపుతాయి

సాధారణంగా నెల మారిన ప్రతిసారీ కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. ఆ మార్పులు మీ డబ్బుపై ప్రభావం చూపుతాయి.

కేంద్రం సుకన్య సమృద్ధి యోజన (SSY), 3 ఏళ్ల టర్మ్‌ డిపాజిట్ పథకంపై వడ్డీ రేట్లు పెంచింది. కొత్త వడ్డీ రేట్లు 2024 జనవరి 1 - మార్చి 31 కాలానికి వర్తిస్తాయి

సుకన్య సమృద్ధి యోజన వడ్డీ రేటు ‍‌8.20 శాతానికి, 3ఏళ్ల కాల వ్యవధి డిపాజిట్లపై వడ్డీ రేటు 7.10 శాతానికి పెరిగింది

కొత్త సిమ్‌ కార్డ్‌ కోసం జిరాక్స్‌ కాపీలు ఇవ్వాల్సిన పనిలేదు. కొత్త SIM కోసం KYC ధృవీకరణ పూర్తిగా డిజిటల్‌లోకి మారుతుంది

ఇన్సూరెన్స్ పాలసీలోని అన్ని నిబంధనల్ని ప్రజలు అర్థం చేసుకోగలిగేలా సాధారణ భాషలో రాసి, CISలో అందించాలని బీమా కంపెనీలకు IRDAI సూచించింది.

మారుతి సుజుకి, టాటా మోటార్స్, మహీంద్ర, మెర్సిడెస్-బెంజ్, ఆడి సహా చాలా కార్ కంపెనీలు రేట్లు పెంచుతున్నాయి.

గత ఏడాది కాలంగా ఉపయోగించని UPI IDలను రద్దు చేశారు

డిజిటల్ బ్యాంకింగ్ పెరగడంతో సైబర్ క్రైమ్ ను అరికట్టేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది