ఆధార్ అనేది 12 అంకెల గుర్తింపు సంఖ్య ఇందులో దేశ పౌరుడి బయోమెట్రిక్, చిరునామాగా ఉంటుంది. ఆధార్ లేకుంటే ఇప్పుడు చాలా పనులు ఆగిపోయే పరిస్థితి ఉంది. ఆధార్‌ను పీవీసీ కార్డు రూపంలో కూడా పొంద వచ్చు ఆధార్ పీవీసీ కార్డు కోసం యూఐడీఏఐ వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి ఇప్పుడు మై ఆధార్ సెక్షన్‌లోని ఆర్డర్ పీవీసీ కార్డుపై క్లిక్ చేయాలి ఇప్పుడు ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ ఎంటర్ చేయాలి ఓటీపీ వెరిఫై చేసిన తర్వాత పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఇలా అప్లై చేసిన తర్వాత ఆధార్ పీవీసీ కార్డు పోస్టాఫీస్ ద్వారా వస్తుంది.