నిఫ్టీ 121 పాయింట్లు పెరిగి 19,811 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 393 పాయింట్లు పెరిగి 66,473 వద్ద క్లోజైంది. నిఫ్టీ బ్యాంక్ 156 పాయింట్లు ఎగిసి 44,516 వద్ద ముగిసింది. హీరో మోటో (4.04%), గ్రాసిమ్ (3.31%), విప్రో (3.27%), అల్ట్రాటెక్ సెమ్ (2.10%), రిలయన్స్ ఇండస్ట్రీస్ (1.62%) షేర్లు లాభపడ్డాయి. హెచ్‌సీఎల్ టెక్ (1.65%), కోల్ ఇండియా (0.64%), ఎల్‌టీఐ మైండ్‌ట్రీ (0.58%), ఎస్బీఐ (0.46%), టీసీఎస్ (0.44%) నష్టపోయాయి. డాలర్‌తో పోలిస్తే 6 పైసలు బలపడి 83.19 వద్ద స్థిరపడింది. బంగారం 10 గ్రాముల ధర రూ.58,530 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి రూ.500 తగ్గి రూ.72,100 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.180 తగ్గి రూ.23,580 వద్ద ఉంది. బిట్ కాయిన్ ₹ 22,68,388 వద్ద ఉంది.