ఈపీఎఫ్ ఖాతాలో నామినీ పేరు చేర్చకపోతే చాలా బెనిఫిట్స్ కోల్పోతారు. ఇలా స్టెప్ బై స్టెప్ నామినేషన్ చేసుకోవచ్చు

EPFO అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి. ఫర్‌ ఎంప్లాయీ ఆప్షన్‌ ఎంచుకోవాలి

UAN, పాస్‌వర్డ్, క్యాప్చాను నమోదు చేయాలి. తర్వాత sign in బటన్ పై క్లిక్ చేయండి.

మేనేజ్ ట్యాబ్‌లో ఇ-నామినేషన్ ఆప్షన్‌ కనిపిస్తుంది, దానిపై క్లిక్ చేయాలి

'ఫ్యామిలీ డిక్లరేషన్' సెక్షన్‌పై క్లిక్ చేసి నామినీ పూర్తి వివరాలను నమోదు చేయాలి. తర్వాత అప్లై బటన్‌పై క్లిక్ చేయండి

నామినీ సమాచారాన్ని సేవ్ చేయడానికి YES ఆప్షన్‌ మీద క్లిక్ చేయండి.

ఒకరి కంటే ఎక్కువ మంది నామినీలను చేర్చాలనుకుంటే.. యాడ్‌ బటన్‌ నొక్కి, వివరాలతో మిగిలిన పేర్లను సేవ్ చేయాలి. నామినీలకు ఎవరికి ఎంత వాటా ఇవ్వాలో శాతం పేర్కొవాలి

OTP కోసం 'e-sign' ఆప్షన్‌ మీద క్లిక్ చేయండి. EPFO ఖాతాకు లింక్ అయిన మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది

మీ మొబైల్ కు వచ్చిన ఆ ఓటీపీని ఎంటర్ చేసి, ఆ తర్వాత సబ్మిట్ బటన్ క్లిక్ చేయాలి

మీ EPF ఖాతాలో ఈ-నామినేషన్ ప్రాసెస్‌ పూర్తవుతుంది. భవిష్యత్తులో నామినీలకు ఏ సమస్యా ఉండదు