కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం. అయితే 2024కు ముందే చేయాల్సిన కొన్ని ముఖ్యమైన పనులు ఇవి.

Image Source: PTI

డిసెంబర్ 31, 2023తో కొన్ని ఆర్థిక సంబంధ పనుల తుది గడువు ముగియనుంది

డీమ్యాట్ ఖాతాలో నామినేషన్ గడువు 2023 డిసెంబర్ 31తో ముగుస్తుంది. తరువాత డీమ్యాట్ ఖాతా డీయాక్టివేట్ అవుతుంది

కొత్త లాకర్ ఒప్పందంపై సంతకం చేయడానికి ఖాతాదారులకు ఆర్బీఐ డిసెంబర్ 31 తుది గడువు విధించింది.

Image Source: Freepik

2022-23 ఆర్థిక సంవత్సరానికి జరిమానాతో ITR ఫైల్ చేయడానికి గడువు డిసెంబర్ 31తో ముగుస్తుంది. లేకపోతే మీకు ఆదాయపు పన్ను నోటీసులు వస్తాయి

SBI ప్రత్యేక హోమ్ లోన్ ఆఫర్‌ తో కస్టమర్లకు ప్రాసెసింగ్ ఫీజు మీద 0.17 శాతం తగ్గింపు లభిస్తుంది. ఏడాదికి 8.40 శాతం వడ్డీకే గృహ రుణం తీసుకోవచ్చు.

ఏడాది కాలంగా ఉపయోగించని UPI ID డిసెంబర్ 31 తర్వాత డీయాక్టివేట్‌ అవుతాయి. కనుక ఆ ఐడీతో ఏదైనా చిన్న ట్రాన్జాక్షన్‌ అయినా చేయండి

ఇండియన్ బ్యాంక్ అధిక వడ్డీ రేటు అందించే ఇండ్ సూపర్ 400 ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్ డిసెంబర్ 31తో ముగియనుంది. ఎంతో కొత డిపాజిట్ చేసుకుంటే బెటర్.

Image Source: Getty

ఐడీబీఐ బ్యాంక్ అధిక వడ్డీ రేట్లు అందిస్తున్న అమృత్ మహోత్సవ్ FD 375 డేస్, అమృత్ మహోత్సవ్ FD 444 రోజుల స్కీమ్స్ FD గడువు ఈ 31తో ముగుస్తుంది