2023 దసరా డే 7- కాళరాత్రి దుర్గ అలంకారంలో శ్రీశైల భ్రమరాంబిక కాళరాత్రి శరీరవర్ణం గాఢాంధకారంలా నల్లగా ఉంటుంది తలపై కేశాలు చెల్లాచెదురుగా ఉంటాయి, ఈమె త్రినేత్రాలు బ్రహ్మాండంలా గుండ్రంగా ఉంటాయి నాశికా శ్వాస ప్రశ్వాసలు భయంకరమైన అగ్నిజ్వాలలు కక్కుతూ ఉంటుంది కాళరాత్రి వాహనం గార్ధభం. కుడిచేతిలో వరముద్ర, అభయముద్ర,ఎడమ చేతిలో ఇనపముళ్ల ఆయుధం, ఖడ్గం ధరించి ఉంటుంది కాళరాత్రి స్వరూపం చూసేందుకు భయంకరంగా ఉన్నప్పటికీ ఈ అమ్మ ఎప్పుడూ శుభాలే ప్రసాదిస్తుంది అందుకే శుభంకరీ అని అంటారు. కాళరాత్రి దుర్గను స్మరిస్తే శత్రుభయం ఉండదని చెబుతారు శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఏడో రోజు కాళరాత్రి దుర్గగా దర్శనమిస్తోంది శ్రీశైల భ్రమరాంబిక Images Credit: Pinterest