ఈ వారం థియేటర్‌, ఓటీటీలో అలరించే చిత్రాలివే!

శాకుంతలం- సమంత ప్రధాన పాత్రలో గుణశేఖర్ తెరకెక్కించిన ఈ చిత్రం ఏప్రిల్‌ 14న థియేటర్లలో విడుదల కానుంది.

రుద్రుడు- రాఘవ లారెన్స్‌ హీరోగా కతిరేశన్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏప్రిల్ 14వ థియేటర్లలో రిలీజ్ కానుంది.

విడుదల- విజయ్‌ సేతుపతి హీరోగా వెట్రిమారన్‌ రూపొందించిన ఈ సినిమా ఏప్రిల్‌ 15న విడుదల కానుంది.

ఓ కల-గౌరీష్ యేలేటి, రోషిణి కలిసి నటించిన ఈ చిత్రం ఏప్రిల్‌ 13న నేరుగా డిస్నీ+హాట్‌స్టార్‌ లో రిలీజ్ కానుంది.

దాస్ కా ధమ్కీ- విశ్వక్ సేన్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆహాలో ఏప్రిల్ 14 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

మిస్సెస్‌ అండర్‌ కవర్‌- ఈ హిందీ చిత్రం ఏప్రిల్‌ 14 నుంచి జీ5లో స్ట్రీమింగ్ అవుతుంది.

Image Source: Carnival Film & Television Ltd

ది లాస్ట్‌ కింగ్‌డమ్‌- ఈ హాలీవుడ్ మూవీ ఏప్రిల్‌ 14న నెట్‌ఫ్లిక్స్‌ లో స్ట్రీమింగ్ కు రానుంది.