మీ ఫోన్ బ్యాటరీ లైఫ్ పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఈ టిప్స్ ఫాలోకండి!

బ్యాటరీ బాగా పని చేయాలి అంటే 80% వరకు ఛార్జ్ చేయాలి. 30% కంటే తక్కువగా పడిపోకుండా చూసుకోవాలి.

బ్యాటరీని నెమ్మదిగా ఛార్జ్ చేయడం మంచిది. మీ కంప్యూటర్, ల్యాప్‌టాప్ ద్వారా ఛార్జ్ చేయండి

రాత్రి పూట ఫోన్ ను ఛార్జింగ్ పెట్టి మర్చిపోకండి. అలా చేస్తే అధిక వోల్టేజ్ నుంచి అధిక ఒత్తిడికి లోనై లైఫ్ తగ్గుతుంది.

స్క్రీన్ బ్రైట్‌నెస్ బ్యాటరీని బాగా దెబ్బతీస్తుంది. అవసరం లేని సమయంలో బ్రైట్ నెస్ తగ్గించాలి.

మీ ఫోన్ WiFi, బ్లూటూత్ వాడనప్పుడు ఆఫ్ చేయడం మంచిది.

మీరు లేటెస్ట్ ఫోన్లు కలిగి ఉంటే డార్క్ మోడ్‌కి మారడం ద్వారా మీ బ్యాటరీ డ్రెయిన్‌ను తగ్గించుకోవచ్చు.

అవసరం లేని సమయంలో లొకేషన్ ఆఫ్ చేయాలి.

Google Assistant, Siri బ్యాటరీని ఎక్కువగా తీసుకుంటాయి. వీటిని డిజేబుల్ చేయడం ఉత్తమం.