BJP Gudivada Tour: ఉద్రిక్తంగా మారిన బీజేపీ నాయకుల గుడివాడ పర్యటన
ABP Desam
Updated at:
26 Jan 2022 12:02 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppAP BJP నాయకుల గుడివాడ పర్యటన ఉద్రిక్తతలకు తావిచ్చింది. తమ పార్టీ నిర్వహిస్తున్న సంక్రాంతి సంబరాల్లో పాల్గొనేందుకు వెళ్తున్నవారిని పోలీసులు అడుగడుగునా అడ్డుకున్నారు. కంకిపాడు వద్ద తొలుత పోలీసులు అడ్డుకోగా.... కాసేపటికి అక్కడి నుంచి నాయకులు బయల్దేరారు. ఆ తర్వాత కలవపాముల వద్ద మరోసారి అడ్డుకున్నారు. పలువురిని అదుపులోకి తీసుకున్నారు. గుడివాడలో కేసినో వ్యవహారంపై బీజేపీ నాయకులు ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ముందుజాగ్రత్తగా పోలీసులు ఈ చర్య తీసుకున్నారు. అరెస్ట్ చేసినవారిని తొట్లవల్లూరు స్టేషన్ కు తరలించారు. పోలీసులకు, వైసీపీ కార్యకర్తలకు పెద్దా తేడా లేదంటూ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి విమర్శించారు.