Surya Kumar Yadav Catch Controversy | T20 World Cup 2024| సూర్య స్టన్నింగ్ క్యాచ్ పై కొత్త అనుమానాలు
Surya Kumar Yadav Catch Controversy |
ఇలా బౌండరీ దగ్గర సూర్య కుమార్ యాదవ్ పట్టిన క్యాచ్ టీ20 వరల్డ్ కప్ ఇండియాకు దక్కేలా చేసింది. ఐతే.. ఇది క్యాచ్ కాదంటూ సిక్స్ అంటూ కొత్త వాదన మొదలైంది.ఫైనల్ లో మిల్లర్ క్యాచ్ ను బౌండరీ లైన్ వద్ద సూర్య కుమార్ యావద్ అద్భుతంగా పట్టాడు. అది అంపైర్ రివ్యూలోనూ అవుట్ అని తేలింది. ఐతే..దీనిపై ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ వర్గం కొత్త అనుమానాలు వ్యక్తం చేస్తోంది. వేరే యాంగిల్ లో ఉన్న వీడియోలను పోస్ట్ చేస్తూ.. చూడండి అక్కడ సూర్య కుమార్ యాదవ్ లెగ్ లైట్ గా బౌండరీని టచ్ చేసిందంటూ పోస్టులు పెడుతున్నారు. అదే నిజమైతే..టీం ఇండియా వరల్డ్ కప్ నెగ్గడం ఒక ఫేక్ అంటూ ట్విట్టర్ లో హల్ చల్ చేస్తున్నారు. ఇలా... సూర్య కుమార్ యాదవ్ స్టన్నింగ్ క్యాచ్ పై సరికొత్త వివాదం మొదలైంది. ఐతే.. దీనిపై క్లారిటీ ఇండియా వాళ్లు కాదు...సౌతాఫ్రికా వాళ్లు ఇస్తేనే బాగుంటుంది కదా..! ఆ కోవలోనే... సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ షాన్ పుల్లక్ ను ఈ క్యాచ్ గురించి రిపోర్టర్లు ప్రశ్నించగా.. ఆయన క్లారిటీ ఇచ్చారు. సూర్య కుమార్ యాదవ్ పట్టిన క్యాచ్ అద్భుతం. బౌండరీ లైన్ ను టచ్ కాలేదు. అది సిక్స్ కాదు..క్యాచ్ . ఇందులో ఎలాంటి అనుమానం అవసరం లేదని చెప్పారు. సో.. ఫైనల్ లో ఓడిపోయిన సౌతాఫ్రికా టీమ్ కు చెందిన మాజీ ప్లేయర్ ఇలా సూర్య క్యాచ్ ను మెచ్చుకోవడంతో అంతా సెలైంట్ అయ్యారు. అంతే కదా.. సూర్య పట్టిన క్యాచ్ లో డౌట్ లేదు. మరి..మీకేమైనా డౌట్స్ ఉన్నాయా..? ఉంటే అవేంటో కామెంట్ చేయండి..!