Rahul Dravid About Team India Victory | T20 World Cup 2024 | కోచ్ పదవి పోయిందంటూ ద్రవిడ్ కామెంట్స్
Download ABP Live App and Watch All Latest Videos
View In AppRahul Dravid About Team India Victory | T20 World Cup 2024 | చూశారు కదా..! వచ్చే వారం తరువాత తాను నిరుద్యోగిని అని... ఏమైనా ఆఫర్స్ ఉంటే చెప్పండని రాహుల్ ద్రవిడ్ అన్నారు. టీం ఇండియా వరల్డ్ కప్ గెలిచిన తరువాత రాహుల్ ద్రావిడ్ మీడియాతో తొలిసారిగా మాట్లాడారు. అప్పుడు ఇలాంటి కామెంట్స్ చేశారు. ఒక ప్లేయర్ గా నేనేప్పుడు వరల్డ్ కప్ గెలవలేదు. ఆటగాడిగా నేను దురదృష్టవంతున్ని. కానీ, కోచ్ గా మాత్రం అదృష్ణవంతున్నే అని చెప్పుకోవాలి. రోహిత్ సారథ్యంలోని టీమ్ అద్భుతంగా ఆడి..తమ కలను నెరవేర్చిందని రాహుల్ ద్రావిడ్ చెప్పారు.
టీ20 వరల్డ్ కప్ గెలిచిన మధుర క్షణాల్ని ఇంకా ఆస్వాదిస్తున్న సమయంలోనే బీసీసీఐ ఓ సంచలన ప్రకటన చేసింది. అదేటంటే.. ఉత్తమ ప్రదర్శన కనబర్చి ఒక్క ఓటమి చూడకుండానే టీ20 వరల్డ్ కప్ ను కైవసం చేసుకుంది రోహిత్ సేన. 13 ఏళ్లుగా ఏ ఐసీసీ ట్రోఫీ అందుకోని బీసీసీఐకు ఈ విజయం సగర్వంగా తల ఎత్తుకునేలా చేసింది. అందుకే.. కప్పు గెలిచిన టీం ఇండియాకు 125 కోట్ల రూపాయల ప్రైజ్ మనీ ప్రకటిస్తున్నట్లు బీసీసీఐ సెక్రటరీ జై షా ఆదివారం రాత్రి ప్రకటించారు.