Viral Video: 


ఇన్‌స్టా టైమ్‌లైన్‌ అంతా అవే రీల్స్..


మన తెలుగు పాటలకు ఫారిన్‌ వాళ్లు స్పెప్పులేస్తూ ఆ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేయటం చాలా కామన్ అయిపోయింది. కొందరు కేవలం తెలుగు పాటలకే డ్యాన్స్ చేస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తుంటారు. ఈ తరహాలోనే అమెరికాకు చెందిన ఒమాలా..భాంగ్రా పాటలకు డ్యాన్స్ చేస్తూ రెగ్యులర్‌గా ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తున్నారు. బాలీవుడ్ సహా, పంజాబీ ఛార్ట్‌బస్టర్స్‌కి ఆమె స్టెప్పులేస్తున్నారు. ఇన్‌స్టా టైమ్‌లైన్‌లో మొత్తం ఈ పాటలతోనే నిండిపోయింది. ఆమె తన ఇన్‌స్టా బయోలోనూ "Self-taught Bhangra dancer"అని రాసి ఉంది. ఆమెకు భాంగ్రా అంటే ఎంత ఇష్టమో ఈ బయోనే చెబుతోంది. ఆమె చేసే ప్రతి పోస్ట్‌ క్షణాల్లో వైరల్ అయిపోతుంది. ఆ మూవ్‌మెంట్స్‌కి అంతా ఫిదా అవుతున్నారు. ఇటీవలే ఆమె పోస్ట్ చేసిన రీల్‌ మోస్ట్ వ్యూడ్‌గా మారిపోయింది. చిడి బ్లౌరి అనే పాటకు ఆమె చేసిన డ్యాన్స్‌కు అంతా మెస్మరైజ్ అవుతున్నారు. టీ షర్ట్, లెగ్గింగ్‌తోనే ఎంతో కష్టమైన స్టెప్పులనూ  సింపుల్‌గా వేసింది ఒమాలా. ఆమె చేసిన ఓ రీల్‌కు వన్ మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఓ పంజాబీ పాటకు ఆమె లిప్‌ సింక్ చేస్తూ, చేసిన రీల్‌కి నెటిజన్లు "వావ్" అని కామెంట్లు పెడుతున్నారు. కుర్తా పైజామా, దుపట్టా వేసుకుని ఇండియన్ జ్యూలరీతో ఆమె ఇంప్రెస్ చేశారు. ఇలా వరుసగా బాలీవుడ్, పంజాబీ సాంగ్స్‌ రీల్స్ చేస్తూ ఫేమస్ అయింది అమెరికాకు చెందిన ఒమాలా. 










Also Read: TN Governor RN Ravi: గన్ వాడేవాళ్లకు గన్‌తోనే ఆన్సర్- గవర్నర్ సంచలన వ్యాఖ్యలు


Also Read: ‘కట్నం తీసుకురా లేదా నా ఫ్రెండ్‌‌తో ఎంజాయ్ చెయ్!’ భార్య నగ్న వీడియోలు వాట్సప్ చేసిన పైశాచిక భర్త