ఈ వారం బాగాహైలెట్ అయిన వీడియో కచ్చా బాదం పాటకు ఓ యోగా ఇన్‌స్ట్రక్టర్ వేసిన డాన్స్. కారు రోడ్ పక్కన ఆపి ఆమె వేసిన డాన్స్ ను వీడియో  తీసి ట్విట్టర్‌లో పెట్టారు. అంతే ఆ వీడియో సోషల్ మీడియానూ ఊపేసింది. కచ్చాబాదం పాట సోషల్ మీడియాలో ఎంత ట్రెండ్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆ పాటపేరుతో కొన్ని వేల వీడియోలను సెలబ్రిటీలు కూడా చేశారు. కానీ.. ఎవరికీ రానంత ట్రెండింగ్.. ఈ భారతీ హెగ్డె డాన్స్‌కు వచ్చింది. 




రెండో వీడియో... ఉక్రెయిన్ నుంచి చిన్న పిల్లలు యుద్ధం కారణంగా పక్క దేశాలకు వలస వెళ్లారు. ఇలా ఇటలీకి వెళ్లిన వాళ్లు అక్కడి స్థానిక స్కూళ్లలో చేరారు. ఈ పిల్లల్ని అక్కడి విద్యార్థులు ఆహ్వానిస్తున్న వీడియో అందరి మనసుల్ని హత్తుకుంది. 





ఫ్రాన్స్‌లోని ఈఫిల్ టవర్ ముందు భారతీయ యువతులు చేసిన సంప్రదాయ డాన్స్ వైరల్‌గా మారిన మూడో వీడియో 


 






ఇక తమిళ స్టార్ విజయ్  కొత్త సినిమాలో అరబిక్ కుతుకు ఫ్యాన్ మేడ్ వీడియో కూడా విపరీతంగా వైరల్ అయింది.


 






ఈ వారం వైరల్ అయిన ఐదో వీడియో... మరోసారి కచ్చాబాదం పాటే. ఈ సారి ఈ వీడియో చేసింది ఓ చిన్నారి.