ఫ్యాషన్ కొత్త పుంతలు తొక్కుతోంది. టెక్నాలజీతో జతకట్టి పర్యావరణ హిత ఉత్పత్తులను అందించేందుకు ముందడుగు వేస్తోంది. పర్యావరణ అనుకూల ఉత్పత్తులపై ఇప్పటికే ఫ్యాషన్ రంగంలో ఎన్నో ఆవిష్కరణలు జరిగాయి. ఇప్పుడందులో మరీ వింతైన మార్పు జరిగింది. ఇలాంటి మార్పును అందరూ ఆహ్వానించలేరేమో. రకరకాల దారాలతో స్వెట్టర్లను తయారు చేస్తారు. అధికంగా అయితే ఊలుతోనే అల్లుతారు. కానీ డచ్ డిజైనర్ మాత్రం మానవ వెంట్రుకలతో ఓ స్వెట్టర్ ను తయారు చేసింది. అతని పేరు జ్సోఫియా కొల్లార్. ఆమ్‌స్టర్‌డామ్లో నివాసం ఉంటోది. ఆమె చెప్పిన ప్రకారం మనిషి వెంట్రుకలు కూడా ఊలు లాంటివే. ఇందులో కెరాటిన్ ప్రొటీన్ ఫైబర్ ఉంటుంది. ఊలుతో నేసినట్టే దీనితో కూడా రకరకాల వస్త్రాలు అల్లుకోవచ్చని చెబుతోంది డిజైనర్.
ఈ స్వెట్టర్ తయారీలో ఎలాంటి రసాయనాలను వాడలేదని చెబుతోంది జ్సోఫియా. ఇది వందశాతం బయోడిగ్రేడబుల్ అని వివరిస్తోంది. ఈమె మనిషి వెంట్రుకలతో వివిధ రకాల వస్త్రాలను తయారుచేస్తోంది. 72 మిలియన్ కిలోల మానవ వెంట్రుకలను సేకరించేందుకు ఈమె టీమ్ యూరోప్ లోనిక కొన్ని ప్రాంతాలకు వెళ్లింది. ఆ జుట్టునంతా ఒక చోటకి చేర్చి వాటితో మరిన్ని స్వెట్టర్లు, జాకెట్లు, షాల్స్ అల్లి పెడుతుందట ఈ కుర్ర డిజైనర్. కానీ మనిషి వెంట్రుకలతో చేసిన వస్త్రాలను ఎంత మంది వేసుకునేందుకు ఇష్టపడతారు అన్నది సందేహమే. చాలా మంది ఈ స్వెట్టర్ ను చూసి ముఖం ముడుచుకుంటున్నారు.
Also Read: మహాభారతంలో ప్రస్తావించిన ఈ వంటకాలు, ఇప్పటికీ మనం ఇష్టపడుతున్నాం
Also Read: వారానికోసారి సముద్రపు చేపలు తినాల్సిందే, ఈ సమస్యలున్న వారికి మరీ మంచిది