రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ప్రతి మంగళవారం వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నిరుద్యోగుల కోసం నిరాహారదీక్ష చేస్తున్నారు. అందులో భాగంగా హన్మకొండ జిల్లాలో షర్మిల నిరుద్యోగ నిరాహార దీక్ష చేపట్టారు. ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి నివాళులర్పించారు. దీక్ష ప్రారంభించారు.


నిరుద్యోగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ షర్మిల  ప్రతి మంగళవారం నిరుద్యోగ దీక్ష చేపడుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా హన్మకొండలోని హయగ్రీవచారి మైదానంలో వ‌ద్ద దీక్ష చేపట్టారు. సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది. 


తెలంగాణలో 2 లక్షల ఉద్యోగ ఖాళీలున్నా... ప్రభుత్వం వాటిని భర్తీ చేయట్లేదని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. నిరుద్యోగుల పట్ల ప్రభుత్వ వైఖరి తప్పని వ్యాఖ్యానించారు. నిరుద్యోగి సునీల్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవడం లేదని షర్మిల ఆరోపించారు. ఎంతమంది నిరుద్యోగులు చనిపోతే ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందిస్తారని ఈ సందర్భంగా షర్మిల ప్రశ్నించారు. నిరాహార దీక్షలు చేస్తున్నా.. ప్రభుత్వంలో స్పందన రావడంలేదని షర్మిల అన్నారు. 


తెలంగాణలో వేర్వేరు శాఖలు, విభాగాల్లో ఖాళీగా ఉన్న లక్షా 90 వేల ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నియామక ప్రక్రియను చేపట్టడం, ముఖ్యమంత్రి కేసీఆర్ ఇదివరకు ప్రకటించిన 50 వేల ఖాళీలను భర్తీ చేయడానికి ఉద్దేశించిన నోటిఫికేషన్‌ను వెంటనే విడుదల చేయాలనేది వైఎస్ షర్మిల ప్రధాన డిమాండ్. ఈ నిరుద్యోగ నిరాహార దీక్ష ప్రధాన ఉద్దేశం అదే. వనపర్తి జిల్లాలో నిరుద్యోగ నిరాహార దీక్షను చేపట్టిన తరువాత వైఎస్ షర్మిల క‌రీంన‌గ‌ర్, ఖమ్మం, మహబూబాబాద్, సిద్ధిపేట్, మహబూబ్‌నగర్ వంటి జిల్లాల్లో నిరాహార దీక్ష చేపట్టారు.


ఈ మంగళవారం ఆమె హన్మకొండ హయగ్రీవాచారి గ్రౌండ్‌లో నిరుద్యోగ నిరాహార దీక్షలో కూర్చోనున్నారు. 12 గంటల పాటు ఈ దీక్ష కొనసాగుతుంది.


Also Read: TS Congress : టీ కాంగ్రెస్‌లో మళ్లీ జూలు విదిలిస్తున్న గ్రూపులు ! ఐక్యత ఎండ మావేనా ?


Also Read: KTR Gadwal Tour: గద్వాలలో కేటీఆర్ పర్యటన.. అభివృద్ధి పనులకు శంకుస్థాపన.. విపక్ష నేతల ముందస్తు అరెస్టు


Also Read: AP Vs TS : తెలుగు రాష్ట్రాల మధ్య విద్యుత్ బకాయిల గొడవ ! ఇంతకీ ఎవరికి ఎవరు బాకీ ఉన్నారు !?


Also Read: Tollywood: టాలీవుడ్ పెద్దలకు సీఎం జగన్ నుంచి పిలుపు... ఈ నెల 20న చిరంజీవి బృందం భేటీ... చిత్ర పరిశ్రమ సమస్యలపై చర్చ