కరోనా కారణంగా ఐటీ ఉద్యోగులంతా వర్క్ ఫ్రమ్ హోమ్ కు పరిమితమయ్యారు. దాదాపు ఏడాదిన్నర నుంచి చాలామంది ఇంటి నుంచే చేస్తున్నారు. కొంతమంది  సిటీలో ఉండి చేస్తుంటే.. మరికొంతమంది.. సొంత ఊళ్లకు వెళ్లి చేస్తున్నారు. హైదరాబాద్ ఐటీ కంపెనీల్లో సుమారు 6.30 లక్షల మంది ఉద్యోగం చేస్తున్నారు. 2020–21లో 13 శాతం వృద్ధిరేటుతో 1.45 లక్షల కోట్ల ఐటీ ఎగుమతులు జరిగాయి. వచ్చే ఏడాది కూడా రెండంకెల వృద్ధిరేటు సాధించే అవకాశం ఉంది.  అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న వారిని ఆఫీసుకు తిరిగి తీసుకురావాలని తెలంగాణ ప్రభుత్వం కోరుకుంటోంది. ఐటీ కంపెనీలకు ఇదే మాట చెప్పింది. ఈ మేరకు తెలంగాణ ఐటీ శాఖ 280 మంది ప్రతినిధులో మాట్లాడింది.



ఐటీ కంపెనీలు ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వడంతో.. చాలామంది జీవితాలపై ప్రభావం పడింది. ఈ విషయంపైనే ప్రభుత్వం అసంతృప్తిగా ఉంది. ఐటీ ఎంప్లాయిస్ అంతా.. కరోనాకు ముందు చేసిన ఖర్చులు.. తర్వాత చేయడం లేదు. వర్క్ ఫ్రమ్ హోమ్  చేయడమో.. మరేదే కారణమో.. గానీ ఈ ప్రభావం చాలా రంగాలపై పడుతుంది.


ఐటీ రంగంపై పరోక్షంగా ఆధారపడిన అనేక మందికి తిరిగి ఉపాధి దొరుకుతుందని తెలంగాణ భావిస్తోంది. కొవిడ్‌  థర్డ్‌వేవ్‌ను కారణంగా చూపిస్తూ... ఐటీ ఉద్యోగులు ఆఫీసుల నుంచి పనిచేసేందుకు విముఖత చూపుతున్నారు. మరోవైపు పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు వారానికి ఐదు రోజుల పని విధానం కాకుండా పరిమిత సంఖ్యలో కార్యాలయాలకు ఉద్యోగులు హాజరయ్యే హైబ్రిడ్‌ వర్క్‌ప్లేస్‌-కొద్దిరోజులు ఇంటి నుంచి, మరికొద్ది రోజులు ఆఫీసు నుంచి పనిచేయడమనే విధానం గురించి ఆలోచిస్తున్నాయి. కొవిడ్‌తో ఆధారం కోల్పోయిన రవాణా, హౌస్‌ కీపింగ్, సెక్యూరిటీ తదితర ఉద్యోగులు మాత్రం ఐటీ ఆఫీసులు తిరిగి కళకళలాడే రోజుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు.


సుమారు 36,000 క్యాబ్స్ ఐటీ హబ్ లో కరోనాకు ముందు పనిచేసేవి. ప్రస్తుతం అన్నీ.. ఖాళీగా ఉండే పరిస్థితి ఏర్పడింది. లాక్ డౌన్ సడలించినా.. క్యాబ్ డ్రైవర్ల పరిస్థితి అలాగే ఉంది. 


వ్యాక్సినేషన్‌ వేగం పెరగడంతోపాటు రాష్ట్రంలో కొవిడ్‌ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. ఐటీ రంగంలో వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ విధానంతో ఆ రంగంపై ఆధారపడిన ట్యాక్సీ డ్రైవర్లు, క్యాంటీన్లు, హౌజ్‌ కీపింగ్, సెక్యూరిటీ, ఇతర సర్వీసు ప్రొవైడింగ్‌ సంస్థల్లో పనిచేస్తున్న వారు ఉపాధి కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సమావేశం తర్వాత కొన్ని కంపెనీలు ఉద్యోగులను ఆఫీసులకు పిలిచేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిసింది.  
                                                                           – జయేశ్‌ రంజన్, ముఖ్య కార్యదర్శి, ఐటీ, పరిశ్రమల శాఖ