కోడలితో పెట్టుకున్న వివాహేతర సంబంధం ఓ హత్యకు దారితీసింది. అడ్డుగా ఉన్నాడని పక్కా ప్లాన్ వేశారు. కోడలితో కలిసి కొడుకును కడతేర్చారు. ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలంలో దుశ్చర్య జరిగింది. అద్దంకి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఏల్చూరు ఎస్సీ కాలనీలో నివాసం ఉంటున్న కరుణయ్య, మరియమ్మ భార్యాభర్తలు. వీరి కుమారుడు లక్ష్మయ్య (35)కు గుంటూరు జిల్లా వినుకొండకు చెందిన సునీతతో పద్దెనిమిదేళ్ల క్రితం పెళ్లైంది. వీరికి ఇద్దరు మగ పిల్లలు ఉన్నారు. మరియమ్మ 30 ఏళ్ల క్రితమే చనిపోయింది. 


అప్పటి నుంచి లక్ష్మయ్య మద్యానికి బానిసై పోయాడు. ఈ క్రమంలో మామ కరుణయ్య, కోడలు సునీతతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. వారి రహస్య బంధానికి అడ్డుగా ఉంటున్నాడని కొడుకు లక్ష్మయ్యను హత్య చేసేందుకు మామ, కోడలు కుట్ర పన్నారు. పథకం ప్రకారం ఆదివారం రాత్రి నిద్రలో ఉన్న లక్ష్మయ్యపై ఆయుధాలతో దాడి చేసి హత్యచేశారు. ఈ దారుణాన్ని ప్రత్యక్షంగా చూసిన మృతుడి పెద్ద కుమారుడు పోలీసులకు విషయాన్ని చెప్పడంతో అసలు కథ బయటపడింది. పోలీసులు నిందితులు ఇద్దరినీ అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. 


Also Read: YS Viveka Murder Case: వివేకా హత్య కేసులో కీలక మలుపు... గోవాలో సునీల్ అరెస్టు... విచారణలో వేగం పెంచిన సీబీఐ


ప్రస్తుత తరుణంలో వివాహేతర సంబంధాలు ఎంతకైనా దారితీస్తున్నాయి.  క్షణిక సుఖాలకు ఆశపడి అత్యంత అమానవీయ చర్యలకు పాల్పడుతున్నారు. మానవ సంబంధాలు మరిచి తాత్కాలిక సుఖాల కోసం వెంపర్లాడుతున్నారు. ఇలాంటి బంధాల్లో కూరుకుపోయి బయటకి రాలేక కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే..మరికొందరు హత్యలకు పాల్పడుతున్నారు. అలాంటి ఘటన ప్రకాశం జిల్లాలో సంతమాగులూరులో చోటుచేసుకుంది. ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది.  కోడలితో వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని కన్న కొడుకునే హత్య చేశాడు ఓ తండ్రి. 


వివాహేతర సంబంధాల వల్ల ఇటీవల ఇలాంటి దారుణ ఘటనలు చోటుచేసుకుంటున్నారు. ఇలాంటి ఘటనే ఇటీవల తూర్పుగోదావరి జిల్లాలోనూ జరిగింది. ఉపాధి కోసం భర్త గల్ఫ్ కి వెళ్లాడు. ఆ యువతి వేరే వ్యక్తితో సంబంధం పెట్టుకుంది.  ఈ విషయం తెలిసిన మామ వారిని హెచ్చరించాడు. ఇంతలో ఆ యువతి, యువకుడితో కలిసి పరారయ్యింది. పోలీసులకు మామ ఫిర్యాదు చేయడంతో వారిని తిరిగి ఇంటికి తీసుకువచ్చారు. కోడలు పరువు తక్కువ పనిచేసింది కోపంలో ఆ మామ కోడలిని హత్య చేశాడు. 


Also Read: Godavari River Management Board: గోదావరి నదీ యాజమాన్య బోర్డు మీటింగ్...గెజిట్ అమలు, కార్యాచరణపై చర్చ...తెలంగాణ అధికారులు గైర్హాజరు