ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో పదేళ్ల తర్వాత వస్తున్న సినిమా 'పుష్ప'. పాన్ ఇండియన్ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్ రికార్డులను తిరగరాశాయి. తెలుగు ఇండస్ట్రీలో మరే హీరోకు సాధ్యం కాని స్థాయిలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప టీజర్ తో సరికొత్త చరిత్ర సృష్టించారు. 


'పుష్ప' సినిమా షూటింగ్ ప్రస్తుతం వేగంగా జరుగుతుంది. రెండు భాగాలుగా రానున్న ఈ సినిమా మొదటి భాగం విడుదల తేదీని ఇప్పుడు దర్శక నిర్మాతలు ఖరారు చేశారు. క్రిస్మస్ కానుకగా 'పుష్ప' ఐదు భాషల్లో ఒకే రోజు విడుదల కానుంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో క్రిస్మస్ పండుగ సందర్భంగా పుష్ప థియేటర్లలో విడుదల కానున్నట్లు దర్శక నిర్మాతలు తెలిపారు.  


Also Read : Pushpa Movie Updates: తగ్గేదేలే.. 'పుష్ప' లేటెస్ట్ అప్డేట్.. ఐదు భాషల్లో ఫస్ట్ సింగిల్


ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ కార్యక్రమాలు కూడా మొదలయ్యాయి. ఆగస్టు 13న ఐదు భాషల్లో పుష్ప తొలి సింగిల్ విడుదల కానుంది. దీనికి సంబంధించిన టీజర్ విడుదల చేశారు దర్శక నిర్మాతలు. ఐదు భాషల్లో ఐదుగురు లీడింగ్ సింగర్స్ (శివమ్, బెన్నీ డయల్, విజయ్ ప్రకాష్, రాహుల్ నంబియార్, విశాల్ దద్లాని) ఈ పాట పాడబోతున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ కు జోడీగా రష్మిక మందన నటిస్తున్నారు. మిరోస్లా క్యూబా బ్రోజెక్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే తెలియజేయనున్నారు మేకర్స్.



బన్నీ తెలివైన ప్లాన్.. 


నిజానికి 'పుష్ప' ఫస్ట్ పార్ట్ కి సంబంధించిన షూటింగ్ మొత్తం ఎప్పుడో పూర్తయింది. ముందుగా దసరా సీజన్ లో విడుదల చేయాలనుకున్నారు. కానీ 'ఆర్ఆర్ఆర్' డేట్ ఫిక్స్ చేసుకోవడంతో బన్నీ వెనక్కి తగ్గాడు. మరోపక్క సంక్రాంతికి వరుస సినిమాలు క్యూ కడుతున్నాయి. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ప్రభాస్ లాంటి హీరోలు ఇప్పటికే సంక్రాంతి సీజన్ కు వస్తున్నట్లు అఫీషియల్ గా అనౌన్స్ చేశాయి. ఆ సమయంలో బన్నీ తన సినిమాను రిలీజ్ చేస్తే కలెక్షన్స్ ను షేర్ చేసుకోవాల్సి వస్తుంది. అందుకే ఆయన తెలివిగా క్రిస్మస్ డేట్ ను లాక్ చేసుకున్నాడు.


Also Read : Upcoming Telugu Films List : సంక్రాంతి బరిలో స్టార్ హీరోలు.. రచ్చ మాములుగా ఉండదేమో!