జాతీయ స్థాయిలో రాజకీయం వేడెక్కుతుంది. ఎన్ సీపీ అధినేత శరద్ పవార్..  కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో నేడు భేటీ కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే 2024 పార్లమెంట్ ఎన్నికల్లో భాజపాను ఓడించడమే లక్ష్యంగా ప్రతిపక్షాలను ఏకం చేయడానికి కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తుంది. ఇలాంటి సందర్భంలో శరద్ పవార్.. భాజపా అగ్రనేత అమిత్ షాను కలవడం పలు ప్రశ్నలు లేవనెత్తుతోంది.


అయితే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో పవార్ కూతురు భేటీ అయిన కొన్ని గంటలకే ఈ వార్త బయటకు రావడం మరో కీలక పరిణామం. భాజపా కీలక నేతలతో శరద్ పవార్ ఇటీవల వరుసగా భేటీ అవుతున్నారు.


ఈ పరిణామాలు చూస్తే జాతీయ స్థాయి రాజకీయంలో ఎలాంటి మార్పులు రానున్నాయోనని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.


మోదీతో భేటీ..


జులై 17న ప్రధాని నరేంద్ర మోదీతో శరద్ పవార్ భేటీ అయ్యారు. అయితే మోదీని కేవలం గౌరవ సూచకంగానే కలిసానని పవార్ అన్నారు. ఆ మీటింగ్ జరిగిన 17 రోజుల తర్వాత నేడు అమిత్ షా తో భేటీ కానున్నారు. ఈ రోజు ఉదయం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో కలిసి బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ లో పవార్ కుమార్తె సుప్రియా సూలే పాల్గొన్నారు. 


మహారాష్ట్ర సర్కార్ లో టెన్షన్..






 

అయితే తరచుగా ఎన్ సీపీ అధినేత భాజపా నేతలను కలవడంతో మాహా వికాస్ అగాదీ సర్కార్ లో ఏమైనా మార్పులు జరిగే అవకాశం ఉందని కొన్ని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మరి ఈ పరిణామాలు ఠాక్రే సర్కార్ మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుందోనని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మహారాష్ట్రలో కూటమి సర్కార్ ఏర్పాటు చేయడంలో పవార్ కీలకపాత్ర పోషించారు. ప్రస్తుతం ఠాక్రే సర్కార్ నిలకడగా ఉంది.

 

ALSO READ: