CBSE 10th Result 2021 LIVE Updates: సీబీఎస్ఈ 10వ తరగతి ఫలితాలు విడుదల..
ఈరోజు సీబీఎస్ఈ 10వ తరగతి ఫలితాలు విడుదల అయ్యాయి. ఫలితాలను బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లు cbseresults.nic.in, cbse.gov.in లలో చెక్ చేసుకోవచ్చు.
ABP Desam Last Updated: 03 Aug 2021 12:07 PM
Background
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) 10వ తరగతి ఫలితాలు కాసేపటి క్రితం విడుదల అయ్యాయి. ఫలితాలను బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లు cbseresults.nic.in, cbse.gov.in లలో చెక్ చేసుకోవచ్చు. దీంతో పాటు డిజిలాకర్ (DigiLocker) యాప్, ఉమాంగ్ (UMANG) యాప్...More
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) 10వ తరగతి ఫలితాలు కాసేపటి క్రితం విడుదల అయ్యాయి. ఫలితాలను బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లు cbseresults.nic.in, cbse.gov.in లలో చెక్ చేసుకోవచ్చు. దీంతో పాటు డిజిలాకర్ (DigiLocker) యాప్, ఉమాంగ్ (UMANG) యాప్ లతో పాటు digilocker.gov.inలలో కూడా ఫలితాలను చూసుకోవచ్చు. ఫలితాలను చెక్ చేసుకునేందుకు విద్యార్థులు వారి రోల్ నంబర్, స్కూల్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్ వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. కరోనా సెకండ్ వేవ్ తీవ్రత ఎక్కువవుతోన్న నేపథ్యంలో ఈ ఏడాది సీబీఎస్‌ఈ 10, 12 తరగతి పరీక్షలను రద్దు చేసిన విషయం తెలిసిందే. గత వారం సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు కాగా.. ఈ ఏడాది మొత్తం 99.37 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు బోర్డు వెల్లడించింది. గతేడాది 88.78 శాతంగా ఉన్న ఉత్తీర్ణతా శాతం.. ఈసారి పెరిగింది. ఈ ఫలితాల్లో బాలికలే ముందంజలో నిలిచారు. బాలుర కంటే 0.54 శాతం ఎక్కువ ఉత్తీర్ణత సాధించారు. బాలుర ఉత్తీర్ణతా శాతం 99.13గా ఉండగా.. బాలికలది 99.67 శాతంగా నమోదైంది.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
ఫలితాలు చెక్ చేసుకోండిలా..
1. cbseresults.nic.in. వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయండి.
2. అందులో 'Class X Result' పై క్లిక్ చేయండి.
3. మీ రోల్ నంబర్, స్కూల్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్ వివరాలు ఎంటర్ చేయండి.
4. స్కోర్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోండి. భవిష్యత్ అవసరాల కోసం దీనిని ప్రింటవుట్ తీసుకోండి.