Griha Jyoti Scheme: తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ప్రధాన కారణమైన ఆరు గ్యారంటీల్లో నాలుగింటిని అమలు చేస్తున్నారు. వాటిలో ముఖ్యమైంది 200 యూనిట్ల ఉచిత విద్యుత్. మంగళవారం నుంచి అమలులోకి వచ్చిన ఈ పథకం లబ్ధిదారులు ఇప్పటికే ఎంపిక చేశారు. ఈ పథకం లబ్ధిదారుల ఎంపిక విషయంలో ఇంకా చాలా మందికి అనుమానాలు ఉన్నాయి. అసలు ఎంపిక ఎలా చేస్తారు. ఏ ఏ పత్రాలు జత చేయాలి. ఇంకా అర్హత ఉండి ఎంపిక కాకపోతే ఏం చేయాలనే సందేహాలు చాలా మందిలో కనిపిస్తోంది. అందుకే ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి పేరు మీద ఈ అనుమానాలు నివృత్తి చేస్తూ ఓ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. 


ఆ పోస్టర్ ప్రకారం ఈ క్రింది వాళ్లు ఉచిత విద్యుత్‌కు అర్హులు 


గృహజ్యోతి పథకం మార్గదర్శకాలు ఇవే 



  • ప్రజాపాలన కార్యక్రమంలో గృహజ్యోతి పథకానికి దరఖాస్తు చేసుకున్న వారికి ఈ పథకం వర్తిస్తుంది.

  • దరఖాస్తుదారులకు ఆధార్‌ లింక్ చేసిన తెల్ల రేషన్ కార్డు ఉండాలి. వాళ్లు నివాసం ఉండే ఇంటి విద్యుత్‌ కనెక్షన్ నెంబర్ ఉండాలి.

  • అద్దెకున్న కుటుంబాలు కూడా ఈ పథకానికి అర్హులు. వాళ్లు కూడా అప్లై చేసుకోవచ్చు.

  • ఈ పథకం ద్వారా గృహ విద్యుత్‌ కనెక్షన్‌పై నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ సదుపాయం అమలు అవుతుంది.

  • 200 యూనిట్ల వరకు విద్యుత్ వినియోగించే అర్హత కలిగిన కుటుంబం ఆ నెలలో జీరో బిల్లు అందుకుంటుంది.

  • ఈ పథకం ద్వారా ప్రస్తుతం రాష్ట్రంలో 39.9 లక్షల కుటుంబాలు లబ్ధి పొందుతాయి.

  • ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారిలో తెల్లరేషన్ కార్డు, ఆధార్‌ కార్డుతోపాటు విద్యుత్‌ కనెక్షన్ నెంబర్‌ వంటి పూర్తి వివరాలు సమర్పించిన కుటుంబాలన్నీ ఈ ప్రయోజనాన్ని అందుకుంటాయి.

  • 2024 మార్చి నుంచి లబ్ధిదారులకు జీరో బిల్లులు జారీ చేస్తారు. 


అర్హత ఉండి పథకం ప్రయోజనం రాని వారు ఏం చేయాలి


అర్హతలు ఉండీ జీరో బిల్లు రాని కుటుంబాలు అనుసరించాల్సిన పద్దతులు 



  • అర్హతలు ఉన్నప్పటికీ జీరో బిల్లు పొందని గృహ వినియోగదారులు తిరిగి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 

  • మండల ఆఫీస్‌ లేదా మున్సిపల్ కార్యాలయంలో గృహజ్యోతి కోసం దరఖాస్తు చేసుకోవాలి. 

  • ఆధార్‌తో లింక్ చేసిన తెల్ల రేషన్ కార్డు, గృహ విద్యుత్ కనెక్షన్ నెంబర్లు సమర్పించాలి 

  • అర్హులని గుర్తించినట్టైతే వారకి సవరించన బిల్లు జారీ చేస్తారు. ఈ పథక లబ్ధిదారుల జాబితాలో పేరు నమోదు చేస్తారు. 

  • అర్హతలున్న వినియోగదారులు దరఖాస్తులను ధ్రువీకరించుకునే అవకాశం కల్పించినదుకు వారి నుంచి బిల్లు రికవరీ చేయడానికి ఎటువంటి బలవంతపు చర్యలు తీసుకోరు 


ఆధార్ తప్పనిసరి
తెలంగాణలో (Telangana) ఆధార్‌ కార్డు ఉన్నవారికే గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు అందుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు ఇంధన శాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది బయోమెట్రిక్ విధానంలో ఈ వ్యాలిడెషన్ పూర్తిచేస్తేనే ఉచిత విద్యుత్ పథకానికి అర్హులవుతారని తేల్చి చెప్పింది.ఈ ప్రక్రియ మొత్తం డిస్కంల ప్రతినిధులే చేపడతారని తెలిపింది. లబ్ధిదారులు ఈ పథకంలో చేరేందుకు ఇంటి కరెంట్ మీటర్ ఎవరి పేరిట ఉందో వారి ఆధార్(Aadhaar) సిబ్బందికి చూపాలని నిబంధనల్లో పేర్కొంది.ఎవరికైనా ఆధార్ లేకపోతే వెంటనే అప్లయి చేసుకుని ఆ ఫ్రూప్ చూపిస్తే సరిపోతుందని..ఆధార్ వచ్చే వరకు ఇతర గుర్తింపు కార్డులు చూపి పథకంలో చేరొచ్చని తెలిపింది. బయోమెట్రిక్ వ్యాలిడేషన్ లో భాగంగా వేలిముద్రలు లేకుంటే కనురెప్పలను స్కాన్ చేయాలని విద్యుత్ శాఖ సిబ్బందికి అధికారులు సూచించారు. విద్యుత్ శాఖ వద్ద ఉన్న పరికరాలు పనిచేయకపోతే..ఆధార్ నెంబర్ నమోదు చేయగానే యజమాని ఫోన్ నెంబర్ కు వచ్చే ఓటీపీ(OTP) ద్వారా ధ్రువీకరించుకోవాలని, ఆదీకాకపోతే ఆధార్ కార్డుపై ఉండే క్యూఆర్ కోడ్ స్కానే చేసి వివరాలు సరిచూసుకోవాలని సూచించింది.