‘‘ఈ రోజు ద్రోణి జార్ఖండ్ & పరిసరాల్లో ఉన్న అల్పపీడన ప్రదేశం నుంచి ఛత్తీస్ గడ్, విదర్భ మీదుగా తెలంగాణ వరకు సగటు సముద్ర మట్టం నుంచి 1.5 కిలో మీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉంది. ఈరోజు కింది స్థాయిలోని గాలులు పశ్చిమ దిశ నుంచి తెలంగాణ రాష్ట్రం వైపునకు వీస్తున్నాయి’’ అని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.


రాగల 3 రోజులకు వాతావరణ సూచన (Weather Forecast): 
ఈ రోజు, రేపు తెలంగాణ రాష్ట్రంలో  తేలికపాటి నుండి మోస్తరు  వర్షాలు చాలా చోట్ల, ఎల్లుండి కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈరోజు భారీ వర్షాలు, ఈ రోజు, రేపు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు రాష్ట్రంలో కొన్ని (ఉత్తర, తూర్పు) జిల్లాల్లో అక్కడక్కడ వచ్చే అవకాశం ఉంది.


హైదరాబాద్‌లో వాతావరణం


హైదరాబాద్ లో ఆకాశం మేఘావృతం అయి కనిపించనుంది. నగరంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 28 డిగ్రీలు, 23 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఉపరితల గాలులు గంటకు 6 నుంచి 10 కిలో మీటర్ల వేగంతో పశ్చిమ దిశగా వీచే అవకాశం ఉంది. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 29 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 22.1 డిగ్రీలుగా నమోదైంది. గాలిలో తేమ 93 శాతంగా నమోదైంది.


ఏపీలో ఇలా
ఈరోజు తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు వీయవచ్చు. దక్షిణ కోస్తాలో తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 30 నుండి 40 కిలో మీటర్ల వేగముతో వీయవచ్చని వాతావరణ అధికారులు తెలిపారు.


‘‘బలహీనమైన రుతుపవనాల వలన నేడు సాయంకాలం తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు పడ్డాయి. ప్రస్తుతం అవి అన్నమయ్య జిల్లాలోని కోడూరు - తిరుపతి జిల్లా గూడూరు మీదుగా బలపడుతూ విస్తరిస్తున్నాయి. మరో రెండు గంటల వరకు ఈ వర్షాలు భారీగా కొనసాగనున్నాయి. ముఖ్యమైన విషయం ఏమిటంటే బలహీనమైన రుతుపవనాలల్లో గాలులు బలహీనంగా ఉంటుంది, కాబట్టి వర్షాలు ఎక్కువసేపు పడతాయి. గాలులు అంటే మేఘాలు కదిలే ఎత్తులో ఉన్న గాలులు అని అర్థం’’ అని ఏపీ వెదర్ మ్యాన్ తెలిపారు.