Weather Latest News: నిన్నటి తూర్పు గాలుల లోని కొమరెన్ ప్రాంతం నుంచి ఆంధ్రప్రదేశ్ తీరంలోని పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు సగటు సముద్ర మట్టం నుంచి 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉన్న ద్రోణి ఈరోజు బలహీన పడిందని హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఈ రోజు కింది స్థాయిలోని గాలులు తూర్పు, ఈశాన్య దిశ నుంచి తెలంగాణ రాష్ట్రం వైపుకి వీస్తున్నాయని అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో ఈ రోజు, రేపు తెలంగాణా రాష్ట్రంలో తెలికపాటి నుండి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి రాష్ట్రంలో తెలికపాటి నుండి మోస్తారు వర్షాలు కొన్ని చొట్ల కురిసే అవకాశం ఉంది. వాతావరణ హెచ్చరికలు ఏమీ జారీ చేయలేదు.
హైదరాబాద్లో వాతావరణం
హైదరాబాద్ లో ఆకాశం పాక్షికంగా మేఘావృతం అయి కనిపించనుంది. ఉదయం వేళల్లో హైదరాబాద్ నగరంలో పొగ మంచు ఏర్పడే అవకాశం ఉంటుంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 30 డిగ్రీలు, 21 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఉపరితల గాలులు గంటకు 8 నుంచి 10 కిలో మీటర్ల వేగంతో తూర్పు దిశలో వీచే అవకాశం ఉంది. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 29 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 21.1 డిగ్రీలుగా నమోదైంది. గాలిలో తేమ 79 శాతంగా నమోదైంది.
ఆంధ్రప్రదేశ్లో వాతావరణం
అంతర్గత తమిళనాడు, సరిహద్దు ప్రాంతమైన కేరళలో ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 3.1 కిలో మీటర్ల ఎత్తులో విస్తరించింది. నవంబర్ 25 కల్లా దక్షిణ అండమాన్ సముద్రం, పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉంది. దీనిప్రభావంతో నవంబర్ 26 కల్లా అల్పపీడనం ఇదే ప్రాంతంలో ఏర్పడుతుంది. ఈ అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి నవంబర్ 27న ఆగ్నేయ బంగాళాఖాతం, సరిహద్దు ప్రాంతమైన అండమాన్ సముద్రంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది.
సగటు సముద్ర మట్టం వద్ద తూర్పు గాలులలో ఏర్పడిన ద్రోణి ఇప్పుడు కొమరిన్ ప్రాంతం నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం అనగా ఆంధ్రప్రదేశ్ తీరం వరకు సగటు సముద్ర మట్టానికి 3.1 కిలో మీటర్ల ఎత్తు వరకూ విస్తరించి తక్కువగా ప్రభావం ఉందని అమరావతిలోని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
వీటి ప్రభావం ఏపీపై కాస్త ఉండనుంది. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములు మెరుపులు రెండు మూడు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఎలాంటి హెచ్చరికలు జారీ చేయలేదు.
దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములు మెరుపులు రెండు మూడు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఎలాంటి హెచ్చరికలు జారీ చేయలేదు.
రాయలసీమలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములు మెరుపులు రెండు మూడు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఎలాంటి హెచ్చరికలు జారీ చేయలేదు.