Horoscope Today  23rd November 2023


మేష రాశి (Aries Horoscope in Telugu)
ఈ రోజు మీరు చేపట్టే పనుల్లో ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంది. మీ జీవిత భాగస్వామితో ఏదో ఒక విషయంలో గొడవలు రావచ్చు. ఆకస్మిక ఉద్యోగ మార్పు వల్ల మీరు ఇబ్బంది పడతారు. చిన్న విషయాలకు కూడా దూకుడుగా ప్రవర్తించకండి.మీ చుట్టూ ఉన్నవారి చేతిలో మోసపోయే అవకాశం ఉంది అప్రమత్తంగా ఉండాలి


వృషభ రాశి  (Taurus Horoscope in Telugu)
ఈ రోజు మీ సలహా ఇతరులకు ఎంతో మేలు చేస్తుంది. ప్రేమ సంబంధాలకు కుటుంబం నుంచి ఆమోదం లభించవచ్చు.  పాత వ్యాధి నుంచి ఉపశమనం పొందే అవకాశం ఉంది. ఈ రోజు మీకు అద్భుతమైన రోజు అవుతుంది. రిస్క్ తీసుకోకండి. మీరు మీ కెరీర్‌లో పెద్ద అవకాశాలను పొందుతారు.  ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అన్ని పనులు సకాలంలో పూర్తవుతాయి. 


Also Read: శ్రీ మహావిష్ణువు దశావతారాలకు క్షీరాబ్ధి ద్వాదశికి ఏంటి సంబంధం, తులసి ఉసిరికి ఎందుకు పెళ్లిచేస్తారు!


మిథున రాశి (Gemini Horoscope in Telugu)
ఈ రోజంతా మీరు చాలా బిజీగా ఉంటారు. ఆరోగ్యం క్షీణించవచ్చు. విదేశాలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ప్రణాళికలను అమలు చేయడం సులభం అవుతుంది. మీరు చెప్పేది అందరూ శ్రద్ధగా వింటారు. కొన్ని తీవ్రమైన సమస్యలను తండ్రి లేదా ఉపాధ్యాయులతో చర్చించవచ్చు. 


కర్కాటక రాశి  (Cancer Horoscope in Telugu)
ఈ రాశివారు ఖర్చులుఅదుపులో ఉంచుకోవాలి. పనుల్లో ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంది. పెద్దల ప్రవర్తన వల్ల మీరు ఇబ్బంది పడతారు. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. విద్యార్థులు చదువులో చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఉద్యోగులు, వ్యాపారులు కష్టానికి తగిన ఫలితం పొందుతారు.


Also Read: ఈ 5 రాశులవారికి ఫ్రస్ట్రేషన్ చాలా ఎక్కువ, మీరున్నారా ఇందులో!


సింహ రాశి ( Leo Horoscope in Telugu)
ఈ రోజు మీరు మీ ప్రియమైన వారి మధ్య ప్రశాంతంగా గడిపితే మంచిది. అసాంఘిక కార్యకలాపాల వైపు దృష్టి మళ్లుతుంది..జాగ్రత్తపడండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం కన్నా మీ శ్రేయోభిలాషుల సలహాలు స్వీకరించడం మంచిది. ఆర్థిక సంబంధిత నిర్ణయాలు ఆలోచించి తీసుకోండి. కొన్ని ముఖ్యమైన పనులు ఈరోజు ఆగిపోవచ్చు.


కన్యా రాశి (Virgo Horoscope in Telugu)
ఈ రాశివారి ప్రణాళికలు విజయవంతమవుతాయి. అనుకోని అతిథులను కలుస్తారు.వివాదాస్పద విషయాలు పరిష్కారం అవుతాయి. నిరుద్యోగులు కెరీర్ కి సంబంధించి మంచి అవకాశం దక్కించుకుంటారు. ఉద్యోగులకు కార్యాలయంలో సానుకూల ఫలితాలుంటాయి. మీరు మీ జీవిత భాగస్వామినుంచి పూర్తి మద్దతు పొందుతారు.


Also Read: కార్తీకమాసంలో పాటించే ఈ నియమం శారీరక, మానసిక ఔషధం!


తులా రాశి (Libra Horoscope in Telugu)
ఈ రాశివారు ఉద్యోగం మారాలి అనుకుంటారు. మీ ప్రణాళికలను ఎవ్వరితోనూ పంచుకోవద్దు. ఇంట్లో వాతావరణం క్రమశిక్షణతో ఉంటుంది. ప్రతికూల అలవాట్లను వదులుకోవడానికి ప్రయత్నించండి. మీరు ఇతరులకు సహాయం చేయడానికి మీ వంతు ప్రయత్నం చేస్తారు.


వృశ్చిక రాశి (Scorpio Horoscope in Telugu)
వృశ్చిక రాశి  వ్యాపారులకు కొన్ని సమస్యలుంటాయి. ప్రేమ సంబంధాల విషయంలో కాస్త సీరియస్‌గా ఉండండి. దగ్గు, జలుబు కారణంగా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. రుణ లావాదేవీలకు సంబంధించి కొంత సమస్య ఉంటుంది. సోమరితనం దరిచేరనియవద్దు. మీ శక్తి  సామర్థ్యాలను తక్కువ అంచనా వేయొద్దు.


Also Read: అయ్యప్ప మండల దీక్ష తర్వాత మాలధారుల్లో రావాల్సిన మార్పులివే!


ధనుస్సు రాశి (Sagittarius Horoscope in Telugu)
ఈ రోజు మీరు చాలా కష్టపడతారు. ఆస్తులు అమ్మాలి అనుకున్న ప్రయత్నం ఈ రోజు విజయవంతం అవుతుంది.కొంతమంది మీ మానసిక స్థితిని చెడగొట్టడానికి ప్రయత్నిస్తారు జాగ్రత్త. కుటుంబానికి సమయం కేటాయించాలి. ఒత్తిడి నుంచి ఉపశమనం పొందవచ్చు. 


మకర రాశి (Capricorn Horoscope in Telugu)
మీరు మీ సమస్యలకు పరిష్కారాలను పొందుతారు. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. ఈ రోజంతా మీరు చాలా ఉత్సాహంగా ఉంటారు. ఓ గుడ్ న్యూస్ వింటారు. వ్యాపారం బాగానే సాగుతుంది. ఉద్యోగులు పనిపై పూర్తిస్థాయిలో శ్రద్ధ వహించాలి. 


కుంభ రాశి (Aquarius Horoscope in Telugu)
మీ మాటలను కొందరు తప్పుగా అర్థం చేసుకోకుండా జాగ్రత్త వహించండి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అనవసర ఖర్చులకు దూరంగా ఉండాలి. కళారంగంతో అనుబంధం ఉన్న వ్యక్తులు పెద్ద అవకాశాలను పొందవచ్చు.


మీన రాశి (Pisces Horoscope in Telugu)
ఆరోగ్య సమస్యలు పరిష్కారమవుతాయి. వ్యాపార పరిస్థితులు మెరుగుపడతాయి. భాగస్వామ్య వ్యాపారంలో మంచి లాభాలు ఉంటాయి. ఉద్యోగులు పని విషయంలో ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుంటారు. మీ ప్రత్యర్థులపై మీరు విజయం సాధిస్తారు. విద్యార్థులకు చదువుపై శ్రద్ధ పెరుగుతుంది.