ఉత్తరాఖండ్‌ సొరంగం రెస్క్యూ ఆపరేషన్ (Uttarakhand Tunnel Rescue) లో చివరి దశకు చేరుకుంది. 11రోజులుగా ఉత్తరకాశీలోని సిల్‌క్యారా సొరంగంలో (Silkyara Tunnel) చిక్కుకున్న 41 మంది కార్మికులను గురువారం ఉదయానికల్లా బయటకు తీసుకురానున్నారు.  11రోజులుగా ప్రాణభయంతో కొట్టుమిట్టాడుతున్న కార్మికులను ఎట్టకేలకు బయటకు తీసుకొస్తున్నారు. ఇప్పటికే 15మంది సభ్యుల NDRF బృందం సొరంగంలోకి చేరుకుంది.  దాదాపు 45 మీటర్ల డ్రిల్లింగ్ పూర్తి చేశారు. మరో 12 మీటర్ల శిథిలాల గుండా భారీ పైపులను పంపుతున్నారు. వీటి ద్వారా లోపల చిక్కుకున్న కార్మికులను బయటకు తీసుకొస్తారు. పొద్దున 8కల్లా ఆపరేషన్ పూర్తయ్యే అవకాశం ఉందని.. ప్రాజెక్టు హెడ్‌ హర్పాల్ సింగ్ చెప్పారు. 


 


ఏం జరిగిందంటే... 


సిల్‌క్యారా- బారాకోట్ జాతీయ రహదారి పనుల్లో భాగంగా Silkyara వద్ద Tunnel నిర్మాణం చేపట్టారు. నవంబర్ 12 వ తేదీన కొండ చరియలు విరిగి పడి సొరంగం మూసుకుపోయింది. 41మంది కార్మికులు అందులో చిక్కుకుపోయారు. శిిథిలాలు ఎక్కువుగా ఉండటం వాళ్లని బయటకు తెప్పించడానికి వేరే మార్గం లేకపోవడంతో పలు మార్గాల్లో వారిని చేరేందుకు 11 రోజులుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. పలు జాతీయ -అంతర్జాతీయ విపత్తు నిర్వహణ సంస్థలు ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నాయి. అమెరికా నుంచి ప్రత్యేకంగా Augur  మెషిన్ తెప్పించి తవ్వకాలు చేపట్టారు. రోజులు గడుస్తున్నా ఫలితం లేకపోవడంతో అందరిలో ఆందోళన వ్యక్తమైంది. ప్రధానమంత్రి కార్యాలయ అధికారులు, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తదితరులు దగ్గరుండి మరీ ఆపరేషన్‌ ను పర్యవేక్షించారు. సొరంగంలో చిక్కుకున్న వారిని బయటకు తీసుకురాలేకపోయినా.. లోపల ఉన్నవారితో సంభాషించగలగడం, ఆక్సిజన్, ఆహారం అందించడం చేయగలిగారు. మంగళవారం ఎండోస్కోపిక్ కెమెరా ద్వారా లోపల ఉన్న వాళ్ల ఫోటోలు కూడా చిత్రీకరించగలిగారు. డ్రిల్లింగ్ చివరిదశకు రావడంతో ఎన్డీఆర్‌ఎఫ్ -NDRF బృందాలు వారిని బయటకు తెచ్చేందుకు వెళ్లాయి. 


 


బయటకు తెచ్చేది ఇలా


ఈ ఆపరేషన్ చాలా సంక్లిష్టమైంది. సొరంగం తవ్వకాల్లో అనుభవం ఉన్న వాళ్లకి కూడా చాలా రోజులు పట్టింది. షుమారు 60 మీటర్ల మేరకు శిథిలాలు కప్పేసినట్లు అంచనా వేశారు. బుధవారం రాత్రికి 45 మీటర్లు డ్రిల్లింగ్ చేశారు. మరో 12 కిలోమీటర్ల దూరంలో కార్మికులు ఉంటారన్న అంచనాతో ఈ శిథిలాల గుండా స్టీల్ పైపులను చొప్పిస్తున్నారు. టెలిస్కోపిక్ విధానంలో దీనిని పంపిస్తున్నారు. చుట్టూ ఉన్న మట్టి జారిపోయి సొరంగం పూడిపోకుండా మొదట 900 మిల్లీమీటర్ల వ్యాసం ఉన్న పైపలను పంపిస్తారు. ఆ తర్వాత టెలిస్కోప్ తరహాలో దాని లోపల మరోపైపును అమర్చి ముందుకు పంపుతారు.800MM వ్యాసం ఉన్న లోపలి పైపుగుండా కార్మికులను బయటకు తెస్తారు. ఇప్పటికే NDRF దీనిపై ట్రయల్ రన్ కూడా పూర్తిచేసింది. పొద్దున కల్లా అందరినీ బయటు తెచ్చేస్తామని చెప్పింది. 


 


ఆసుపత్రులు- హెలికాప్టర్లు


11 రోజులుగా బయట ప్రపంచాన్ని చూడకండా సొరంగంలోనే మగ్గిన కార్మికులలను  బయటకు వచ్చిన వెంటనే సరైన వైద్య సదుపాయాలు కల్పించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. సొరంగం బయట 8 పడకల ఆసుపత్రిని 30 అంబులెన్సులను సిద్ధంగా ఉంచారు. సమీప పట్టణంలో 41 బెడ్ల ఆసుపత్రిని సిద్దం చేశారు. సొరంగంలో చిక్కుకున్న వారిలో జార్ఖండ్ వాళ్లున్నారు. ఆ రాష్ట్రానికి చెందిన 15మందిని ఎయిర్ లిఫ్టింగ్ ద్వారా తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేసింది ఆ ప్రభుత్వం.  అన్నీ అనుకూలిస్తే.. పొద్దున కల్లా అందరం శుభవార్త వినే అవకాశం ఉంది. 


 









 


సొరంగంలో చిక్కుకున్న కార్మికులు ప్రస్తుతానికి సురక్షితంగానే ఉన్నారు. ఎప్పటికప్పుడు వాళ్లకు అవసరమైన ఆహారం అందిస్తున్నారు. నిన్న రాత్రి (నవంబర్ 21) కార్మికులకు వెజ్ పులావ్, చపాతీలు అందించారు. అందరినీ మెడికల్ సూపర్‌విజన్‌లో ఉంచారు. పది రోజుల్లో తొలిసారి కార్మికుల ఫొటోలను విడుదల చేశారు అధికారులు. endoscopic flexi camera ని పైప్‌లైన్‌లో ఇన్‌సర్ట్ చేర్చారు. వాళ్లు ఆరోగ్యంగానే ఉన్నారని కన్‌ఫమ్ చేసుకున్నారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామితో ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ మూడు సార్లు కాల్ చేసి మాట్లాడారు. సహాయక చర్యలపై ఆరా తీశారు. కార్మికులకు అవసరమైన వెలుతురు, ఆక్సిజన్ ఉండేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు అధికారులు.