Zodiac Signs Get Easily Angry at Anything: కొందరు కొంపలంటుకుపోతున్నా కూల్ గా కనిపిస్తారు..హడావుడి పడాల్సిన టైమ్ లో కూడా రిలాక్స్ గా కనిపిస్తారు. ఎంత పెద్ద సమస్య వచ్చినా ప్రశాంతంగా ఎదుర్కొంటారు.  ఇంకొందరు మాత్రం కూల్ గా ఉండాల్సిన టైమ్ లోనూ తెగ హడావుడి పడిపోతారు. అనవసరంగా అరుస్తుంటారు..కోపం ప్రదర్శిస్తుంటారు. చిన్న చిన్న విషయాలకే ఫ్రస్ట్రేట్ అయిపోతుంటారు. అయితే ఎవరు ఎలా ఉంటారో వారి రాశి ఆధారంగా చెప్పొచ్చంటున్నారు జ్యోతిష్య శాస్త్ర పండితులు. ఆ ఐదు రాశులవారిలో మీరున్నారా...


మేష రాశి (Aries) (అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం)


మేష రాశిని పాలించే గ్రహం కుజుడు. ఈ రాశి వారికి కోపం, మొండి స్వభావం ఎక్కువ. చిన్న చిన్న విషయాలకే తొందరగా కోపం వచ్చేస్తుంది. చిన్న అవమానాన్ని కూడా అస్సలు భరించలేరు. తొందరగా ఫ్రస్ట్రేట్ అయిపోతారు. అయితే ఆ కోపం కొద్దిసేపే ఉంటుంది. 


Also Read: శ్రీ మహావిష్ణువు దశావతారాలకు క్షీరాబ్ధి ద్వాదశికి ఏంటి సంబంధం, తులసి ఉసిరికి ఎందుకు పెళ్లిచేస్తారు!


వృషభ రాశి (Taurus ) (కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2 పాదాలు)


వృషభ రాశిని పాలించే గ్రహం శుక్రుడు. ఈ రాశివారు సౌకర్యం , భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఈ రాశివారు సాధారణంగా  ప్రశాంతంగా  మర్యాదగా ఉంటారు కానీ ఎవరైనా వారిని మోసం చేయడానికి ప్రయత్నించారని తెలిస్తే మాత్రం విశ్వరూపం చూపిస్తారు. ఆ సమయంలో వీరి కోపాన్ని నియంత్రించలేరెవ్వరు. ఈ రాశివారికి ఎవ్వరిపైన అయినా వెంటనే కోపం వచ్చేయదు మెల్లమెల్లగా పెరుగుతుంది..చాలా కాలం ఉంటుంది.


Also Read: కార్తీకమాసంలో పాటించే ఈ నియమం శారీరక, మానసిక ఔషధం!


సింహ రాశి (Leo)(మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం)


సింహరాశిని పాలించే గ్రహం సూర్యుడు. ఈ రాశివారికి ఆత్మవిశ్వాసం ఎక్కువ. మంచి అభిరుచి ఉంటుంది. ఆత్మగౌరవానికి అధిక ప్రాధాన్యత ఇస్తారు. కానీ వీరి ఈగోని హక్ట్ చేస్తే మాత్రం అస్సలు తగ్గరు.ఆగ్రహంతో ఊగిపోతారు. తమలో ఉన్న అసంతృప్తిని కూడా చాలా నాటకీయంగా ప్రదర్శిస్తారు. ఎంత కోపం వచ్చినా కానీ వారిని తొందరగా క్షమిస్తారు..పాత విషయాలను మర్చిపోయి ఉండేందుకు ప్రయత్నిస్తారు. 


వృశ్చిక రాశి (Scorpio) (విశాఖ 4 వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ)


వృశ్చిక రాశిని పాలించే గ్రహం ప్లూటో. అందుకే వీరిలో భావోద్వేగాలు అధికం. ఈ రాశివారు ఎప్పుడూ ప్రశాంతంగా కనిపిస్తారు కానీ ఎవరైనా రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తే మాత్రం కంట్రోల్ తప్పిపోతారు. కోపంతో రగిలిపోతారు..ఊగిపోతారు. వృశ్చిక రాశి ఏ విషయాలనూ అంత త్వరగా మరిచిపోలేరు. ఎవ్వరైనా కానీ జీవితంలో ప్రశాంతత కోరుకుంటే వృశ్చికరాశివారితో పెట్టుకోపోవడమే మంచిది. 


Also Read: అయ్యప్ప మండల దీక్ష తర్వాత మాలధారుల్లో రావాల్సిన మార్పులివే!


మకర రాశి (Capricorn) (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు)


మకర రాశి వారిని శాసించే గ్రహం శని. ఇది క్రమశిక్షణ, బాధ్యతకు కేరాఫ్. ఈ రాశివారు విజయం సాధించేందుకు చాలా కష్టపడతారు. విజయం దక్కితే సరే కానీ అపజయం ఎదురైతే మాత్రం భరించలేరు. అనుకోకుండా కోపం వచ్చేస్తుంది. ఆ కోపాన్ని ప్రదర్శించేందుకు కూడా అస్సలు ఆలోచించరు. ఆ ఫ్రస్ట్రేషన్లో ఎదుటివారిపై విమర్శలు గుప్పిస్తారు. అయితే మిమ్మల్ని మీరు మెరుగుపర్చుకోవాలంటే చిన్న అపజయానికే నిరాశ చెందకుండా ఉండాలి.