Trinayani November 22 Episode : ఈరోజు ఎపిసోడ్ లో మంచం మీద ఉన్న ఉలూచిని పెద్దబొట్టమ్మ ఎత్తుకుంటుంది.
విక్రాంత్: సుమనని ఎందుకు కట్టేసావ్ పెద్ద బొట్టమ్మ?
పెద్ద బొట్టమ్మ: కూతుర్ని కాపాడుకోవడానికి శత్రువుగా ఉన్నది తనకన్నా పెద్ద గ్రద్ధ అయినా సరే పోరాడే ప్రయత్నం చేస్తుంది ఆ తల్లి. ఇప్పుడు సుమన కట్లను నేను తప్ప ఎవరూ విప్పలేరు. ముందు జాగ్రత్తతో ఎక్కడ అడ్డవుతుందేమో అని కట్టేసాను
విక్రాంత్: నేను కూడా ఆ గదిలో ఉలూచి ఉంటే నీకు తీసుకోవడానికి కష్టమవుతుందని ఇక్కడకు తెచ్చేసాను. ఇంక నువ్వు పట్టుకుని బయలుదేరు అని అనగా ఇంతలో నయని డమ్మక్కలిద్దరూ ఆ గదిలోకి వస్తారు. వాళ్లని చూసి కంగారు పడతాడు విక్రాంత్.
పెద్ద బొట్టమ్మ: కంగారు పడొద్దు బాబు, నీ చేతిలో ఆ గవ్వలు నేను కట్టిన చేతి తాడు ఉన్నంతవరకు నేను నీకు తప్ప ఇంకెవరికి కనిపించను. ఇంక నేను పుట్ట దగ్గరకు వెళ్తాను అని చెప్పి గది బయటకు వెళ్ళిపోతుంది పెద్ద బొట్టమ్మ.
డమ్మక్క: ఎవరికి కనిపించకపోయినా నాకు కనిపిస్తావని మర్చిపోయావా నాగమ్మ అని మనసులో అనుకుంటుంది.
నయని: విక్రమ్ బాబు ఎందుకు కంగారు పడుతున్నారు? చేతిలో ఫోన్ ఏంటి?
విక్రాంత్: ఏం లేదు వదిన, సుమనకి అలా అయింది కదా డాక్టర్ కి ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను.
నయని: డాక్టర్ తో పోయే జబ్బు కాదు ఇది
విక్రాంత్: గురువుగారికి ఫోన్ చేస్తాను అని చెప్పి ఆ గదిలో నుంచి కంగారుగా బయటకు వచ్చేస్తాడు విక్రాంత్.
నయని: ఎందుకు విక్రాంత్ బాబు ఇంత కంగారు పడుతున్నారు?
డమ్మక్క: కిటికీలో నుంచి బయటకి తొంగి చూస్తే నీకే తెలుస్తుంది అని అనగా నయని డమ్మక్కతో పాటు బయటకు చూస్తుంది. అక్కడ విక్రాంత్ పెద్ద బొట్టమ్మతో మాట్లాడుతున్నా సరే నయనికి కనిపించదు.
విక్రాంత్: ఇంక టైం అవుతుంది ఆలస్యం చేయకుండా పుట్ట దగ్గరకు వెళ్ళు పెద్దబొట్టమ్మ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.
నయని: విక్రాంత్ బాబు పెద్ద బొట్టమ్మ అంటున్నాడు ఏంటి? మరి నాకు కనిపించడం లేదు పెద్ద బొట్టమ్మ?
డమ్మక్క: ఎలా కనిపించలేదా చేయాలో నువ్వే చూసుకో నయని అని అంటుంది
మరో వైపు సుమను ఉలూచి గదిలో ఉందా అని కుటుంబ సభ్యులను నిలదీస్తుంది.
హాసిని: ఉలూచి లోపలే ఉంది.
సుమన: లేదు నేను విశాల్ బావ గారు చెప్తేనే నమ్ముతాను. ఆయన తప్పు చెప్పరు. చెప్పండి బావగారు ఉలూచి గదిలో ఉందా?
విశాల్: లేదు
సుమన: నాకు తెలుసు పెద్ద బొట్టమ్మే ఇది అంతా చేసింది.
విశాల్: అయినా పెద్ద బొట్టమ్మ ఎవరికి కనిపించకుండా తీసుకెళ్లడం ఏంటో ఆశ్చర్యంగా ఉంది అనగా నయని అప్పుడే అక్కడికి వస్తుంది.
నయని: ఇందులో ఆశ్చర్యపోవడానికి ఏముంది?
సుమన: నీ బిడ్డ కాదు కాబట్టి నీకు కంగారు ఉండదు అక్కడ పోయింది నా బిడ్డ కదా
వల్లభ: అయినా ఇద్దరు పిల్లల్లో ఒక పిల్ల పోయినప్పుడే ఇంకో పిల్ల ఉంది అని ధైర్యంతో ఉన్నారు ఇప్పుడు పోయింది నీ పిల్ల కదా ఇంకెందుకు బాధ వాళ్ళకి
హాసిని: నేను చెప్తున్నాను అని తప్పుగా అనుకోవద్దు మనం ఇన్ని మంది ఇన్ని మాట్లాడుకుంటున్నా సరే ఈయన అమ్మగారు ఇంకా ఇక్కడికి రాలేదు. నాకు తెలిసి ఉలూచీ ఇక్కడ ఉండకపోవడానికి కారణం అత్తయ్య ఏమో
నయని: ఉలూచిని పెద్ద బొట్టమ్మకి ఇవ్వడంలో ఇక్కడ ఎవరో ఒకరు సహాయం చేస్తే కానీ ఈ పని కుదరదు
హాసిని: చెప్పాను కదా అత్తయ్య ఇదంతా చేసి ఉంటారు వెళ్లి ఆవిడని తీసుకొని వచ్చి నిలదీద్దాం
విక్రాంత్: అవును నిలదీద్దాం
విశాల్: ఏమని నిలదీస్తావ్?
విక్రాంత్: ఎందుకు పెద్ద బొట్టమ్మకి ఉలూచిని ఇచ్చావని నిలదీస్తాను అని అనగా విశాల్ విక్రాంత్ చెంప చెళ్లుమనిపిస్తాడు
విశాల్: ఒకలు అబద్ధం చెప్తున్నారంటే అది ఎదుటోళ్లని నొప్పించ లేకపోవడం వల్ల లేకపోతే ఏమైనా మంచి కోసమో చేయాలి అంతేకాని అబద్ధం చెప్పి ఒకరి విలువ పోగొట్టుకోకూడదు
హాసిని: ఎప్పుడూ లేనిది నువ్వు సహనం పోగొట్టుకొని చేయి చేసుకోవడం ఏంటి విశాల్
నయని: ఈ విషయంలో పెద్ద బొట్టమ్మకు సహాయం చేసింది మరెవరో కాదు విక్రాంత్ బాబే. అయినా బిడ్డను తీసుకువెళ్లిన పెద్ద బొట్టమని ఎలా తిరిగి తీసుకురావాలో నాకు తెలుసు అని అంటుంది నయని. ఇంతలో మరువైపు పెద్దబోట్టమ్మ ఉలిచి తో పుట్టకి పాలు పోయిస్తుంది.
ఇంట్లో నయని, చేతిలో కిరోసిన్ ని, కట్లతో ఉక్కిరిబిక్కిరి ఆడుతున్న సుమనపై జల్లి ఇప్పుడు నీకు హారతి ఇస్తాను అని నిప్పు వెలిగిస్తుంది. అది సుమనుపై వేయబోతూ ఉండగా అందరూ ఆపమని అరుస్తారు.
సుమన: మా అక్క నన్ను చంపేద్దామనుకుంటుంది. నన్నెవరైనా కాపాడండి ఇక్కడ ఎన్ని మంది ఉన్నారు నా ప్రాణానికి ఎవరు హామీ ఇవ్వలేరా అనగా ఈ విషయాన్ని పుట్ట దగ్గర ఉన్న పెద్ద బొట్టమ్మ గ్రహిస్తుంది.
పెద్ద బొట్టమ్మ: అక్కడ సుమన ప్రాణాలు వీడితే ఉలూచి పెంపకం కష్టమైపోతుంది. ఉదయం తనని చూసుకునేది సుమన మాత్రమే అని వెంటనే పట్టుకొని పరిగెట్టుకొని ఇంటి దగ్గరికి వస్తుంది.
పెద్ద బొట్టమ్మ: ఆగు నయని సుమనని ఏం చేయొద్దు నా పాప భవిష్యత్తు తన మీద ఆధారపడి ఉంది. తన లాలన పాలన సుమనే చూడాలి
నయని: పెద్ద బొట్టమ్మ నీకోసమే ఇదంతా చేశాను ఉలూచిని తీసుకొని నువ్వు తిరిగి రావడం కోసమే అని అనగా వెంటనే పాపను హాల్లో పెట్టి సుమన కట్లు విప్పుతుంది పెద్దబొట్టమ్మ. కట్లు విప్పిన వెంటనే సుమన పెద్ద బొట్టమ్మ మెడను గట్టిగా పట్టుకుంటుంది. సుమనని ఆపడానికి కుటుంబ సభ్యులందరూ ప్రయత్నిస్తారు.
డమ్మక్క: ఇద్దరు తల్లుల మధ్య వివాదాన్ని నువ్వే ఆపగలవు విక్రాంత్ బాబు
విక్రాంత్: ఆడవాళ్ళ గొడవ మద్య నేనేం చేయగలను? ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది.