తెలంగాణలో గత మూడు రోజులుగా అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తుండగా అవి తగ్గుముఖం పట్టాయి. శుక్రవారం నాడు తెలంగాణలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు మాత్రమే కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం బలహీనపడడంతో వర్షాలు కురిసే అవకాశం తక్కువ అని అధికారులు వెల్లడించారు. తెలంగాణలో ఇవాళ (ఆగస్టు 20న) కొన్ని జిల్లాలో మాత్రం తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. 


ఈ జిల్లాల్లోనే అతిభారీ వర్షాలు
హైదరాబాద్ వాతావరణ విభాగం ట్వీట్ చేసిన వివరాల ప్రకారం.. ఆగస్టు 20న తెలంగాణలో మెదక్, సంగారెడ్డి, కామారెడ్డి, జనగామ, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్ గిరి, ఆదిలాబాద్, కుమురం భీం, నిర్మల్, మహబూబాబాద్ జిల్లాల్లో తేలికపాటి వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ అధికారులు అంచనా వేశారు. 


Also Read: Gold-Silver Price: పసిడి నేలచూపులు.. వెండి కూడా తగ్గుదల.. మీ నగరంలో నేటి ధరలివే..


Also Read: Gandhi Hospital Gang Rape: గాంధీ హాస్పిటల్ రేప్‌ కేసు మిస్టరీలో ట్విస్టు.. ఆ మహిళ ఆచూకీ గుర్తించారు కానీ.. 



ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం ఇలా..
మరోవైపు, ఆంధ్రప్రదేశ్‌లో ఆగస్టు 20న ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు ఒకటి లేదా రెండు ప్రదేశాల్లో కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం ట్వీట్ చేసింది. ఉత్తర కోస్తా ప్రాంతం, యానం, దక్షిణ కోస్తా ప్రాంతం వెంబడి వర్షాలు స్వల్పంగా పడే అవకాశం ఉందని వివరించారు. ప్రధానంగా పశ్చిమ దిశ నుంచి నైరుతి దిశ నుంచి గాలులు వీస్తుంటాయని వివరించారు.


వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం దిశను మార్చుకుని క్రమంగా మధ్యభారత దేశం వైపు ప్రయాణించింది. అల్పపీడన ప్రభావంతో పశ్చిమ, నైరుతి గాలులు రాష్ట్రం వైపుగా వీస్తున్నాయి. ఈ గాలుల ప్రభావం  ఉత్తర కోస్తా వైపు ఎక్కువగా ఉంటోంది. ఈ కారణంగా ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి స్థిరంగా కొనసాగుతోంది. ఇది ఈనెల 21 నాటికి అది మరింత బలపడనుంది. దీని ఫలితంగా 21, 22 తేదీల్లో ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి జిల్లాల్లో వర్షాలు విస్తారంగా కురిసే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్రం అధికారులు అంచనా వేశారు.


Also Read: Petrol-Diesel Price, 20 August: హైదరాబాద్‌లో స్థిరంగా పెట్రోల్ ధర.. మిగతా నగరాల్లో తాజా ధరలు ఇలా..


Also Read: Rahul Gandhi Tour: వరంగల్‌కు రాహుల్ గాంధీ.. అదే రోజు హుజూరాబాద్ అభ్యర్థిని ప్రకటిస్తారా ఏంటి? 


Also Read: Revanth Reddy: పీసీసీ చీఫ్‌ రేవంత్‌కు టీఆర్‌ఎస్‌ నేతల సీరియస్ వార్నింగ్.. ఇలా మాట్లాడితే గజ్వేల్ సభ అడ్డుకుంటామని హెచ్చరిక