Weather Latest News: ఈ రోజు కింది స్థాయిలోని గాలులు తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి తెలంగాణ రాష్ట్రం వైపుకి వీస్తున్నాయని హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో ఈ రోజు, రేపు, ఎల్లుండి రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. వాతావరణ హెచ్చరికలు ఏమీ జారీ చేయలేదు.


హైదరాబాద్‌లో వాతావరణం
హైదరాబాద్ లో ఆకాశం పాక్షికంగా మేఘావృతం అయి కనిపించనుంది. ఉదయం వేళల్లో హైదరాబాద్ నగరంలో పొగ మంచు ఏర్పడే అవకాశం ఉంటుంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 31 డిగ్రీలు, 20 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఉపరితల గాలులు గంటకు 4 నుంచి 8 కిలో మీటర్ల వేగంతో ఆగ్నేయ, తూర్పు దిశలో వీచే అవకాశం ఉంది. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 31.4 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 20.4 డిగ్రీలుగా నమోదైంది. గాలిలో తేమ 66 శాతంగా నమోదైంది.


ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్‌, యానాంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములు మెరుపులు రెండు మూడు చోట్ల కురిసే అవకాశం ఉంది.


దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్‌, యానాంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములు మెరుపులు రెండు మూడు చోట్ల కురిసే అవకాశం ఉంది.


రాయలసీమలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములు మెరుపులు రెండు మూడు చోట్ల కురిసే అవకాశం ఉంది.


‘‘వర్షాలు నవంబర్ మూడో వారంలో వర్షాలు పడే అవకాశం ఉంది. అరేబియా సముద్రంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం బలహీన పడి మధ్య అరేబియా సముద్రంలోనికి వెళ్లింది. దీని వలన నేడు సాయంకాలం - అర్ధరాత్రి మధ్యలో రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు ఉంటాయి. ముఖ్యంగా అనంతపురం, పశ్చిమ కర్నూలు జిల్లా, సత్యసాయి జిల్లాతో పాటుగా అన్నమయ్య జిల్లాలోని పశ్చిమ భాగాలు, చిత్తూరు జిల్లాలోని పశ్చిమ భాగాల్లో కొన్ని వర్షాలను చూడగలం. కోస్తాంధ్ర జిల్లాల్లో ఒకటి - రెండు చోట్లకు మాత్రమే నేడు వర్షాలు పరిమితం కానుంది’’ అని ఏపీ వెదర్ మ్యాన్ తెలిపారు.