Weather Latest News: సెప్టెంబరు 7న హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. మధ్య, పరిసర ఉత్తర బంగాళాఖాతంలో కొనసాగుతున్న  అల్పపీడన ప్రాంతం ఉత్తర దిశగా కదులుతూ ఈరోజు ఉదయం 0830 గం.లకు వాయువ్య మరియు పరిసర మధ్య బంగాళాఖాతంలో ప్రస్పుటమైన అల్పపీడన ప్రాంతంగా ఏర్పడింది. దీని అనుబంధ ఆవర్తనం సగటు సముద్ర మట్టం నుండి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఎత్తుకు వెళ్లే కొద్దీ నైరుతి దిశ వైపు వంగి వున్నది.  


ఇది ఉత్తర దిశగా కదులుతూ బలపడి  ఉత్తర ఒడిశా మరియు పశ్చిమ బెంగాల్ తీరంలోని వాయువ్య బంగాళాఖాతం వద్ద ఈనెల 8న వాయుగుండంగా మారే అవకాశం వుంది. తరువాత ఇది పశ్చిమ - వాయువ్య దిశగా కదులుతూ వచ్చే 3 రోజులలో గంగేటిక్ పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా, ఝార్ఖండ్ మరియు పరిసర ఉత్తర ఛత్తీస్‌గఢ్ మీదుగా కొనసాగే అవకాశం వున్నది.


ఋతుపవన ద్రోని ఈరోజు సగటు సముద్ర మట్టానికి బికానర్, కోట, పెండ్రా రోడ్, పరదీప్, వాయువ్య మరియు పరిసర మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన  ప్రస్పుటమైన అల్పపీడన ప్రాంతం యొక్క కేంద్రం గుండా  కొనసాగుతున్నది.


రాగల 3 రోజులకు వాతావరణ సూచన: (Weather Forecast):
ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అనేక చోట్ల, రేపు మరియు ఎల్లుండి చాలా చోట్ల  కురిసే అవకాశం ఉంది.


వాతావరణ హెచ్చరికలు (weather warnings):
ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కొన్ని జిల్లాలలో భారీ వర్షాలు అక్కడ అక్కడ కురిసే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి రాష్ట్రంలో భారీ నుండి అతి భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. 


ఈరోజు, రేపు, ఎల్లుండి తెలంగాణ రాష్ట్రంలో చాలా జిల్లాలలో ఉరుములు మరియు  ఈదురుగాలులు గంటకు 30 నుండి 40 కి. మీ. వేగంతో వీచే అవకాశం వుంది. నేడు భారీ నుంచి అతి భారీ వర్షాలు తెలంగాణలోని ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు ఆదిలాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, ఖమ్మం, వరంగల్, హన్మకొండ జిల్లాలలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.


Hyderabad Weather: హైదరాబాద్ వాతావరణం
హైదరాబాద్‌లో ఆకాశం మేఘావృతమై ఉంటుంది. నగరంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది. 30 నుంచి 23 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 28 డిగ్రీలు, 23 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఉపరితల గాలులు వాయువ్య దిశలో వీచే అవకాశం ఉంది. గాలి వేగం గంటకు 8 - 10 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 30.8 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 22.5 డిగ్రీలుగా నమోదైంది. 46 శాతంగా గాలిలో తేమ శాతం నమోదైంది.


ఏపీలో వాతావరణం ఇలా
Andhra Pradesh Weather News: ఉత్తర, దానిని ఆనుకొని ఉన్న మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన నిన్నటి అల్ప పీడనం సెప్టెంబరు 7న ఉదయం 8.30 గంటలకు వాయువ్య, దానిని ఆనుకొని ఉన్న మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్ప పీడనంగా ఏర్పడింది. దీని అనుబంధ ఉపరితల ఆవర్తనం సముద్రమట్టానికి 7.6 కిలో మీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఎత్తుకు వెళ్లే కొలదీ నైరుతి దిశగా వంగి ఉంటుంది. ఇది నెమ్మదిగా ఉత్తర దిశగా కదులుతూ వాయువ్య బంగాళాఖాతం, దానిని ఆనుకొని ఉన్న పశ్చిమ బెంగాల్, గంగా పరివాహక పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా, బంగ్లాదేశ్ తీరాల్లో సెప్టెంబరు 9న వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది. ఆ తర్వాత 3 రోజుల్లో పశ్చిమ వాయువ్య దిశగా గంగా పరివాహక పశ్చిమ బంగాల్, దానిని ఆనుకొని ఉన్న ఉత్తర ఒడిశా, జార్ఖండ్, దానిని ఆనుకొని ఉన్న ఉత్తర ఛత్తీస్ గఢ్ మీదుగా ప్రయాణించే అవకాశం ఉందని అమరావతి వాతావరణ అధికారులు తెలిపారు.


ఈ ప్రభావంతో ఉత్తర కోస్తాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం ఒకటి లేదా రెండుచోట్ల కురిసే అవకాశం ఉంది.  భారీ నుంచి అతి భారీ వర్షాలు, కొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు బలమైన గాలులు గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది.


దక్షిణ కోస్తాలోనూ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ నుంచి అతి భారీ వర్షాలు, కొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈదురు గాలులు కొన్ని చోట్ల 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో కూడా వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.


రాయలసీమలోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. భారీ నుంచి అతి భారీ వర్షాలు, కొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. బలమైన ఈదురు గాలులు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపారు.