Leopard in Rajahmundry: రాజమండ్రి దివాన్‌చెరువు సమీపంలో చిరుతపులి పాదముద్రలు గుర్తించిన అటవీశాఖ అధికారులు లాలాచెరువు, దివాన్‌చెరువు సమీప ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.. తూర్పుగోదావరి జిల్లా ఇంఛార్జి డీఎఫ్‌వో ఎస్‌.భరణి మీడియా సమావేశం నిర్వహించి దివాన్‌చెరువు సమీప ప్రాంతంలో లభ్యమైన పాదముద్రలను బట్టి ఇక్కడ సంచరించింది చిరుతపులిగా నిర్ధారణచేసినట్లు డీఎఫ్‌వో భరని దృవీకరించారు. 


సాయంత్రం ఆరు దాటితే ఒంటరిగా బయకు రాకండి..


రాజమండ్రి దివాన్‌చెరువు, లాలాచెరువు సమీపప్రాంతాల్లోని ముఖ్యంగా స్వరూప్‌ నగర్‌, పద్మావతి నగర్‌, రూప నగర్‌, శ్రీరామ్‌నగర్‌, తారకరామానగర్‌, ఏపీ హౌసింగ్‌ బోర్డు కాలనీ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈప్రదేశాల్లో చిరుత తప్పకుండా సంచరిస్తుందన్నారు. ఎవ్వరూ ఆరు బయట కూర్చొవద్దని, బయటకు రావాల్సి వస్తే వెంట టార్చ్‌లైట్‌ తప్పనిసరిగా తీసుకువెళ్లాలన్నారు. ముఖ్యంగా ఆరుబయట ఉండే బాత్‌రూమ్‌ తలుపులుకు గడియ పెట్టుకోవాలని, చిన్నపిల్లల్ని ట్యూషన్లుకు చీకటి పడిన తరువాత పంపవద్దని, పిల్లలు బయట ఆడుకోనివ్వ వద్దని హెచ్చరించారు.


 ఇప్పటివరకు మనుషులపై ఎటువంటి దాడి జరగలేదని, త్వరలోనే చిరుతను పట్టుకుంటామన్నారు. అందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు. అయితే చిరుత బిహేవియర్‌ను బట్టి ఎన్ని రోజుల్లో పట్టుకోగలము అనేది ఆధారపడి ఉంటుందని, అనుమానం ఉన్నచోట్ల ట్రాప్‌కెమెరాలను, బోన్లు ఏర్పాటు చేస్తున్నామని డీఎఫ్‌వో తెలిపారు. చిరుతకు సంబందించిన సమాచారం ఏమున్నా వెంటనే తెలపాలని సూచించారు. 


భయం భయంగా రాజమండ్రి శివారు ప్రాంత ప్రజలు.. 
రాత్రి అయితే చాలు రాజమండ్రి శివారు ప్రాంత ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. దివాన్‌చెరువు సమీప ప్రాంతంలో చిరుతపులి సంచారంతో భయం భయంగా గడుపుతున్నారు. పులి సంచారం చేస్తున్న ప్రాంతాలుగా భావిస్తున్న చోట దండోరా వేయించి ప్రజలను అప్రమత్తం చేశారు. పలు చోట్ల ఫెక్సీ బ్యానర్లును ఏర్పాటు చేశారు. 


అడ్డతీగల నుంచి దారితప్పి.. 
రాజమండ్రి శివారు ప్రాంతాలకు ముఖ్యంగా చిరుత పులులు దారితప్పి వచ్చిన సందర్భాలు చాలానే ఉన్నాయి.. రాజమండ్రి శివారు ప్రాంతంలోని దివాన్‌చెరవు ను ఆనుకుని దూరంలో అడ్డతీగల రిజర్వుఫారెస్ట్‌ ఉండగా అక్కడి నుంచే తరచూ చిరుత పులులు దారితప్పి ఇటువైపుగా వస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. ఏదైనా జంతువును వేటాడే క్రమంలో దారితప్పి ఇలా జనావాసాల్లోకి చొరబడతాయని అటవీశాఖ అధికారులు తెలిపారు. 


Also Read: మనం చేద్దాం జగనన్న అంటూ బ్రహ్మాజీ ట్వీట్, పళ్లు రాలతాయంటూ వైసీపీ నేత వార్నింగ్