Weather Latest News: జూలై 9న హైదరాబాద్ వాతావరణ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. నిన్న 18 డిగ్రీల ఉత్తర అక్షంశం గుండా కొనసాగిన గాలి విచ్చిన్నతి ఈరోజు అదే ప్రాంతంలో సగటు సముద్ర మట్టానికి 3.1 నుండి 7.6 కి. మీ. మధ్యలో కొనసాగుతుంది. నిన్న ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరం వద్ద పశ్చిమ-మధ్య బంగాళాఖాతం దానిని ఆనుకొని వున్న వాయువ్య బంగాళాఖాతం ప్రాంతాలలో కేంద్రీకృతమై ఉన్న ఆవర్తనం ఈరోజు బలహీనపడింది.
రాగల 3 రోజులకు వాతావరణ సూచన: (Weather Forecast):
ఈ రోజు, రేపు, ఎల్లుండి తెలంగాణ రాష్ట్రంలో కొన్ని జిల్లాలలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది.
వాతావరణ హెచ్చరికలు (weather warnings)
ఈరోజు మరియు రేపు తెలంగాణ రాష్ట్రంలో కొన్ని జిల్లాలలో భారీ వర్షాలు అక్కడ అక్కడ కురిసే అవకాశం వుంది.
ఈరోజు, రేపు మరియు ఎల్లుండి రాష్ట్రంలో ఉరుములు, మెరుపులుతో పాటు గంటకు 30 నుండి 40 కి. మీ. వేగంతో వీచే ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడ అక్కడ కురిసే వర్షాలు అవకాశం వుంది.
Hyderabad Weather: హైదరాబాద్ వాతావరణం
హైదరాబాద్ లో ఆకాశం మేఘావృతమై ఉంటుంది. సాయంత్రం లేదా రాత్రి సమయంలో తేలికపాటి వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 31 డిగ్రీలు, 23 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఉపరితల గాలులు నైరుతి దిశలో వీచే అవకాశం ఉంది. గాలి వేగం గంటకు 6 - 10 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 30.1 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 24.5 డిగ్రీలుగా నమోదైంది. 82 శాతంగా గాలిలో తేమ శాతం నమోదైంది.
ఏపీలో వాతావరణం ఇలా
Andhra Pradesh Weather News: సగటు సముద్రమట్టం వద్ద రుతుపవన ద్రోణి జైసల్మేర్, భిల్వారా, రైసెన్, రాజ్ నంద్ గావ్, పూరీ, ఆగ్నేయ ప్రాంతాల గుండా మధ్య బంగాళాఖాతం వరకు వెళ్తోంది. ఇది సగటు సముద్ర మట్టానికి 1.5 కిలో మీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
నిన్నటి పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దక్షిణ ఏపీ తీరం మీదుగా ఏర్పడ్డ ఉపరితల ఆవర్తనం వాయువ్య బంగాళాఖాతానికి ఆనుకొని సగటు సముద్ర మట్టానికి 3.1 కిలో మీటర్ల నుంచి 7.6 కిలో మీటర్ల మధ్య ఎత్తుతో నైరుతి దిశగా వంగి ఈరోజు తక్కువగా గుర్తించబడిందని తెలిపారు.
అమరావతి వాతావరణ విభాగం అధికారులు జూలై 9న విడుదల చేసిన ఓ ప్రకటనలోని వివరాల ప్రకారం.. ఉత్తర కోస్తాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం, లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ నుంచి అతి భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు బలమైన గాలులు గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది.
దక్షిణ కోస్తాలోనూ ఓ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈదురు గాలులు కొన్ని చోట్ల 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో కూడా వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
రాయలసీమలోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురు గాలులు కూడా వీచే అవకాశం ఉందని తెలిపారు.