Warangal News: రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకున్న హస్తం పార్టీ హవా కొనసాగుతుందా? పోరాటాల పుటి గడ్డ వరంగల్ లో బ్రేకులు పడ్డ కారు ముందుకు కదులుతుందా అనే సందేహాలు ఎన్నో ఉన్నాయి. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు కలిసొస్తుందా? అనేది ఆసక్తిగా మారింది. తెలంగాణలో వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గానికి ప్రత్యేక స్థానం ఉంది. టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి పార్టీకి పెట్టని కోటగా ఉంది. 2009లో ఎస్సీ రిజర్వ్‌డ్ అయిన వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గానికి 3 సార్లు ఎన్నికలు జరిగాయి. 2009 కాంగ్రెస్, 2014, 2019లో టీఆర్ఎస్ భారీ మెజారిటీతో విజయం సాధించాయి. 2024 లో మరో మూడు నెలలో జరగబోతున్న పార్లమెంట్ ఎన్నికల్లో త్రిముఖ పోటీ తప్పేలా లేదు. 


రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకున్న కాంగ్రెస్ గెలుపు ధీమాతో ఉండగా.. బీఆర్ఎస్ అసెంబ్లీ ఎన్నికల ఓటమితో దిద్దుబాటు చర్యలతో సత్తా చాటడం కోసం ప్రయత్నాలు చేస్తుంది. ఇక కాషాయదళం ఈసారి వరంగల్ పార్లమెంట్ లో బాగా వేయాలని యోచిస్తుంది. అయితే పార్లమెంటు ఎన్నికల్లో మూడు పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఇంచార్జి లను సైతం నియమించింది. కాంగ్రెస్ పార్టీ వరంగల్ పార్లమెంటు నియోజక ఇన్చార్జిగా మంత్రి కొండా సురేఖను, బీజేపీ వరంగల్ పార్లమెంటరీ నియోజకవర్గం ఇంఛార్జిగా గరికపాటి మోహన్ రావును నియమించగా.. టీఆర్ఎస్ పార్టీ వెయిటింగ్ లో ఉంది. ఏదేమైనా ఈసారి మూడు పార్టీలు ఢీ అంటే ఢీ అననున్నాయి.


వరంగల్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోకి ఏడు అసెంబ్లీ నియోజకవర్గం వస్తాయి. వాటిలో భూపాలపల్లి, పరకాల, పాలకుర్తి, స్టేషన్ ఘన్పూర్, వరంగల్ పశ్చిమ, వరంగల్ తూర్పు, వర్ధన్నపేట నియోజకవర్గం అయితే ఇందులో స్టేషన్గన్పూర్ మినహా మిగతా ఆరు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మూడు పార్టీల నుంచి ఎంపీ సీటు కోసం ముగ్గురు నుంచి నలుగురు పోటీ పడుతున్నారు. బీజేపి 2019 ఎన్నిక్షల్లో అభ్యర్థులు లేక స్థానికేతర్లను తీసుకువచ్చింది. ఈ సారి అభ్యర్టులు ఉన్న బలమైన వ్యక్తి కోణంలో స్థానికేతరున్ని తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తుంది. అయితే కాంగ్రెస్ పార్టీలోకి టీఆర్ఎస్ పార్టీ స్థానిక సంస్థల ప్రతినిధుల వలస లు ఎక్కువ కావడంతో పాటు పాటు వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గం లోని భూపాల్ పల్లి పాలకుర్తి నియోజకవర్గం గెలువగా వరంగల్ తూర్పు వరంగల్ పశ్చిమ నియోజకవర్గాల్లో కూడా అత్యధిక మెజార్టీ రావడం కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చే అంశాలుగా చెప్పవచ్చు. 


ఇక ఉద్యపార్టీగా టీఆర్ఎస్ స్థాపించిన నాట్ నుండి వరంగల్ ఎంపీ స్థానాన్ని గులాబీ పార్టీ కైవసం చేసుకుంటూ వస్తుంది అయితే ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో టిఆర్ఎస్ అధికారానికి దూరం అవడంతో పాటు పార్లమెంట్ నియోజకవర్గం లోని ఒక్క నియోజకవర్గ అమ్మినహ మిగతా నియోజకవర్గాలన్నీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు గెలవడంతో ఆ పార్టీకి కష్ట కాలంగానే చెప్పవచ్చు. అయితే ఉద్యమ కాలం నుండి ఉద్యమకారులతో పాటు ప్రజలు తమకు అండగాలి సార్ అని ఈసారి కూడా ఎంపీ సీటు గులాబీ పార్టీదే అనే ధీమాలో ఆ పార్టీ నేతలు ఉన్నారు. బిజెపి అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటలేకపోయింది. అయితే జాతీయ రాజకీయాల్లో బిజెపి ఉండడమే శ్రేయస్కరమని ప్రజలు కోరుకుంటున్నారని ఎంపీ ఎన్నికల్లో బిజెపికి కలిసివచ్చే అంశంగా చెప్పుకుంటున్నారు. 


ఈ నియోజకవర్గంలో ఉద్యమం కాలం నుంచి టీఆర్ఎస్ పార్టీ వరంగల్ ఎంపీ స్థానాన్ని గెలుచుకుంది. నియోజకవర్గ చరిత్రను చూసినట్లయితే ఎక్కువసార్లు కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఆ తర్వాత టీడీపీ అత్యధిక స్థానాలు గెలిచింది. 1957 నుంచి 2009 వరకు హనుమకొండ పార్లమెంట్ జనరల్ స్థానంగా ఉంది. 2009 తరువాత వరంగల్ నియోజకవర్గంగా మారి ఎస్సీ రిజర్వుడ్ అయింది. 


1957 లో సాదిక్ అలీ, కాంగ్రెస్
1962 లో బకర అలీ మీర్జా, కాంగ్రెస్.
1967 లో రామ సహాయం సురేందర్ రెడ్డి, కాంగ్రెస్
1971 లో ఎస్ బి గిరి, తెలంగాణ ప్రజా సమితి
1977 లో మల్లికార్జున రావు, కాంగ్రెస్.
1980 లో కమాలుద్దీన్ అహ్మద్, కాంగ్రెస్
1984 లో డాక్టర్ కల్పనా దేవి, టీడీపీ.
1989 లో రామ సహాయం సురేందర్ రెడ్డి, కాంగ్రెస్
1991 లో రామ సహాయం సురేందర్ రెడ్డి, కాంగ్రెస్
1996 లో అజ్మీర చందూలాల్, టీడీపీ.
1998 లో అజ్మీరా చందులాల్, టీడీపీ.
1999 లో బోడకుంటి వెంకటేశ్వర్లు, టీడీపీ.
2004 లో రవీందర్ నాయక్ ,టీఆరెస్
2008–2009 ఉప ఎన్నిక లో ఎర్రబెల్లి దయాకర్ రావు, టీడీపీ
2009 లో సిరిసిల్ల రాజయ్య , కాంగ్రెస్.
2014 లో కరియం శ్రీహరి, టీఆర్ ఎస్.
2015 లో ఉపఎన్నిక పసునూరి దయాకర్, టీఆర్ ఎస్.
2019 లో పసునూరి దయాకర్, టీఆర్ ఎస్.
2019 లో పసునూరి దయాకర్, టీఆర్ ఎస్.