దండకారణ్యం మావోయిస్టు కేంద్రకమిటి సభ్యులు పట్టణాలలో పట్టుబడటం కలకలం రేపుతుంది. ఏడాదిలో రెండు దఫాలుగా పట్టుబడిన సంఘటనలు చోటుచేసుకున్నాయి. గత ఏడాది వేసవిలో డెంగ్యూ జ్వరాలు సోకి వైద్యం కోసం వచ్చి వాహనాల తనిఖీలో ఇద్దరు పట్టుబడగా, మరొక ఇద్దరు హన్మకొండ హస్పిటల్లో వైద్యం చేయించు కుంటుండగా పట్టబడ్డారు. నలుగురు హైకేడర్ కు చెందిన వారు పోలీసులకు చిక్కడం వెనుక అనేక సందేహలు వ్యక్తమయ్యాయి.


పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో 1. మూల దేవేందర రెడ్డి అలియాస్ మాధవ్ అలియాస్ కరప అలియాస్ నందు, వయస్సు 63, తండ్రి పేరు వామన రెడ్డి, గ్రామం బబ్బేరు చెలుక, మంచిర్యాల జిల్లా, ప్రస్తుతం ఇతను మావోయిస్టు పార్టీ దండకారుణ్య స్పెషల్ జోనల్ సభ్యుడితో హోదాలో సెంట్రల్ టెక్నికల్ విభాగంలో టీం సభ్యుడిగా పనిచేస్తున్నాడు. 2. గుర్రం తిరుపతి రెడ్డి, వయస్సు 53, తండ్రి పేరు లక్ష్మా రెడ్డి, రియల్ ఎస్టేట్ వ్యాపారి, వికాస్నగర్, హనుమకొండ జిల్లాకు చెందినవాడు. ఇతను ప్రస్తుతం కేంద్ర కమిటీ సభ్యుల సానుభూతి పరుడిగా పనిచేస్తున్నాడు.


ఉద్యమంలో చేరి అంచెలంచెలుగా ఎదిగి
మూల దేవేందర్ రెడ్డి నేపథ్యం: తన స్వగ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో 7వ తరగతి వరకు చదువుకున్న దేవేందర్ రెడ్డి 1978 సంవత్సరంలో అప్పటి పీపుల్స్ వార్ రాడికల్ విభాగం సిటీ ఆర్గనైజర్ గపోరెడ్డి వెంకటరెడ్డి ప్రసంగాలు, పీపుల్స్ వార్ సిద్దాంతాలకు ఆకర్షితుడయ్యాడు. కొద్ది కాలంపాటు పీపుల్స్ వార్ పార్టీ సానుభూతిపరుడిగా పనిచేసి సి.ఓ వెంకటరెడ్డి ప్రోత్సహంతో 1982 సంవత్సరంలో సిరిపూర్ దళ సభ్యుడిగా చేరాడు. అ సమయంలో ప్రస్తుత కేంద్ర కమిటీ సభ్యుడు పుల్లూరి ప్రసాద్ రావు అలియాస్ చంద్రన్న సిరిపూర్ దళ కమాండర్ వ్యవహరించారు. మూడు సంవత్సరాల పాటు సిరిపూర్ దళం పనిచేసిన దేవేందర్ రెడ్డి పలు విధ్వంస, చట్టవ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గోన్నాడు. అనంతరం 1985 సంవత్సరంలో అప్పటి డి.సి.యం కటకం సుదర్శన్ ఆలియాస్ అనంద్ ఉత్తర్వుల మేరకు దేవేందరను ఆహేరి దళంకు బదిలీ చేసారు. 1987 సంవత్సరంలో దళ సభ్యురాలు ఆత్రం బయ్యక్క అలియాస్ జ్యోతిని వివాహం చేసుకున్నాడు. 1988 సంవత్సరంలో పార్టీ ఆదేశాల మేరకు అహేరి దళం డిప్యూటీ కమాండర్ ను, 1989 సంవత్సరంలో మహారాష్ట్ర ఏరియా దళానికి డిప్యూటీ కమాండర్ పనిచేసాడు. 1994 సంవత్సరంలో పీపుల్స్ వార్ మరియు పోలీసులకు మద్య జరిగిన ఎదురుకాల్పుల్లో దేవేందర్ రెడ్డి భార్య జ్యోతి మరణించింది. ఆ సమయంలోనే మహరాష్ట ఏరియానుంచి దండకారణ్యం కు బదిలీ అయ్యాడు. 1995 సంవత్సరంలో మాడ్ ఏరియా కిస్కోడా దళ కమాండర్ గ పనిచేసే సమయంలో దేవేందర్ రెడ్డికి సెంట్రల్ టెక్నికల్ కమిటీ సభ్యుడైన రమణతో పరిచయం అయింది.                      


కేంద్రకమిటిలొ టెక్నికల్ సభ్యుడిగా..
ఈ పరిచయంతో పార్టీ నాయకత్వం 1996 సంవత్సరంలో దేవేందర్రెడ్డిని డి.సి.యం సభ్యుడి హోదాలో దండకారుణ్య ప్రాంతంలో టెక్నికల్ డిపార్ట్మెంట్ కమాండర్ 2003 సంవత్సరం వరకు పనిచేశాడు. టెక్నికల్ డిపార్ట్మెంట్ కమాండర్ గా పనిచేసిన సమయంలో దేవేందర్ రెడ్డి సూమారు 850 పైగా తుపాకులను తయారు చేసి పీపుల్స్ వార్ పార్టీ అందజేశాడు. ఇదే సంవత్సరంలో మహిళ దళ సభ్యురాలైన దేవియా హుస్సేండి అలియాస్ రూపిని దేవేందర్ రెడ్డి రెండో వివాహం చేసుకున్నాడు. 2007 సంవత్సరంలో దేవేందర్ రెడ్డి, తన భార్య, మరికొద్దిమంది దంకారుణ్య కమిటీ సభ్యులతో కలిసి తయారు చేసిన తుపాకులను చర్ల మీదుగా దండకారుణ్యానికి వెళ్ళుతుండగా పట్టుబడ్డాడు. 


జైలు నుండి విడుదల అనంతరం దేవేందర్ రెడ్డి తన భార్య రూపితో కల్సి తిరిగి అజ్ఞాతంలోకి వెళ్ళాడు. 2010 సంవత్సరంలో సెంట్రల్ కమిటీ అదేశాల మేరకు పీపుల్స్వర్ దళాలకు కావాల్సిన 12బోర్, పాయింట్ 303 తుపాకులను తయారుచేసి పార్టీకి అందజేసాడు. 2011 సంవత్సరంలో పార్టీ ఆదేశాల మేరకు దేవేందర్ రెడ్డి దంపతులను సౌత్ మరియు వెస్ట్ బస్టర్ ప్రాంతాలకు బాధ్యులుగా చేస్తూ బదిలీ అయి 2017 సంవత్సరం ఫిబ్రవరి మాసం వరకు పనిచేసారు. ఇదే సమయంలో దేవేందర్ రెడ్డి వివిధ రకాల తుపాకులు, మందుపాతరలు, రాకెట్ లాంచర్లు తయారు చేసి దళాలకు అందించడంలో కీలకంగా నిలవడంతో ఇతనిని పార్టీ అధిష్టానం దండకారుణ్య స్పెషల్ జోన్ కమిటీ సభ్యుడిగా నియమించింది. ఇప్పటి వరకు దేవేందర్ రెడ్డి ప్రస్తుతం కేంద్ర విభాగానికి చెందిన సభ్యులతో పాటు, దండకారుణ్య, నార్ట్ జోన్ కు చెందిన కీలక మావోయిస్టు నాయకులతో పనిచేసాడు.      


వైద్యం కోసం వెళ్లి పట్టుబడి..


గత కొద్దికాలంగా దేవేందర్ రెడ్డికి కంటిచూపు సమస్య రావడంతో తెలంగాణ రాష్ట్ర కమిటీ అదేశాల మేరకు కంటి చికిత్స కోసం హైదరాబాద్ వెళ్ళుతున్న క్రమంలో దేవేందర్ రెడ్డి సానుభూతిపరుడు తిరుపతి రెడ్డితో కల్సి సుబేదారి బస్ స్టాప్ వద్ద పోలీసులకు చిక్కారు.


దండకారణ్యంలో హిట్ లిస్టు హిడ్మాతో కలిశారు. పేల్చివేతల్లో కొరకరాని కొయ్యగా మారాడు. చంతగుప్పవద్ద పోలీసు గుంపుపై మాటు వేసి వలవిసిరాడు. అందులొచిక్కిన పోలీసుల తుపాకులను ఎత్తుకేళ్లాడు. 


సానుభూతిపరుడు తిరుపతి రెడ్డి ప్రస్థానం
పోలీసులు అరెస్టుచేసిన సానుభూతిపరుడు తిరుపతి రెడ్డి 1989లో ఉద్యోగరీత్యా దుబాయికి వెళ్ళి వచ్చి తన గ్రామంలో కెనాల్ కాంట్రాక్ట్ పనులు చేయించే తిరుపతిరెడ్డికి దడబోయిన స్వామి ఆలియాస్ మధు పరిచయం కావడంతో జనగాం ఏరియా పీపుల్స్ వార్ దళాలకు నిత్యవసర వస్తువులను అందజేసేవాడు. ఇదే సమయంలో తిరుపతి రెడ్డికి కంకణాల రాజిరెడ్డి అలియాస్ వెంకటేష్ తో పరిచయం అయింది. ఈ పరిచయం తిరుపతి రెడ్డి మావోయిస్టు నాయకులకు కావల్సిన వస్తువులను అందజేయడంతో పాటు, దళసభ్యులకు రహస్యంగా చికిత్స అందించేవాడు. ఇదే రీతిలో కంటి చికిత్స కోసం దేవేందర్ రెడ్డి తిరుపతిని మావోయిస్టు పార్టీ నాయకులకు సూచించడంతో నిన్న సాయంత్రం తిరుపతి రెడ్డి, మావోయిస్టుతో దేవేందర్ రెడ్డి కలిసి హైదరాబాద్ కు వెళ్ళే క్రమంలో సుబేదారి పోలీసులకు చిక్కారు.