విద్యార్థులకు పాఠశాల దశ నుంచే సృజనాత్మక పై పదును పెట్టడానికి విద్య వైజ్ఞానిక ప్రదర్శనలు ఎంతగానో ఉపయోగపడతాయి. హనుమకొండ జిల్లా మడికొండలోని సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో మూడు రోజుల సైన్స్ ఫెయిర్ ప్రదర్శనలు కొనసాగుతున్నాయి.


తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల కళాశాల మడికొండలో జోనల్ స్థాయిలో విద్యా వైజ్ఞానిక ప్రదర్శన కొనసాగుతుంది. డిసెంబర్ 11వ తేదీ నుంచి 13 తేదీ వరకు మూడు రోజుల పాటు జరుతుంది. సైన్స్ ఫెయిర్ లో కమ్యూనిటీ హెల్త్ అండ్ ఎన్విరాన్‌మెంట్, పర్యావరణ అంశాలు, జాతీయ వనరులు, మానవాళి మనుగడ, ఆరోగ్యం, ప్రజల శ్రేయస్సు, స్వచ్ఛమైన నీరు, శానిటేషన్ అంశాలపై విద్యార్థులు సరికొత్త ఆవిష్కరణలు చేశారు. 240 మంది విద్యార్థులు విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలో 120 ఎగ్జిట్స్ ను ప్రదర్శించారు.


రెండో జోన్ కి సంబంధించిన కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, మెదక్, సంగారెడ్డి, వరంగల్, హనుమకొండ జిల్లాలోని 60 తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. నైపుణ్యాన్ని చాటుకున్నారు. ఈ ప్రదర్శనలో ప్రతిభ కనబరిచిన వారు రాష్ట్రస్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలో పాల్గొన్నారని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాల ప్రిన్సిపల్ ఉమామహేశ్వరి తెలియజేశారు. రేపటి తరాన్ని తయారు చేయడం కోసం ఈ సైన్స్ ఫెయిర్ ఎంతో దోహదపడుతుందని ఆమె అభిప్రాయపడ్డారు.