కొత్త సంవత్సరం 2024కి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం సెల‌వుల లిస్టును ప్ర‌క‌టించింది. 2024 ఏడాదిలో సాధార‌ణ సెల‌వులు 27 కాగా, ఆప్షనల్ హాలిడేస్ 25 ఉండ‌నున్నట్లు ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ మేర‌కు ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శాంతి కుమారి ఉత్త‌ర్వులు జారీ చేశారు. ఇందులో భాగంగా జ‌న‌వ‌రి 15న సంక్రాంతి సెల‌వు, మార్చి 8న మ‌హా శివ‌రాత్రి, మార్చి 25న హోలీ, ఏప్రిల్ 9న ఉగాది, ఏప్రిల్ 17న శ్రీరామ‌న‌వమి, జూన్ 17న బ‌క్రీద్, సెప్టెంబ‌ర్ 7న వినాయక చ‌వితి, అక్టోబ‌ర్ 10న ద‌స‌రా, అక్టోబ‌ర్ 31న దీపావ‌ళికి సెల‌వులు ప్రక‌టిస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కొత్త ఏడాది సందర్భంగా జనవరి ఒకటో తారీఖున ప్రభుత్వం సెలవు ప్రకటించింది. అందుకు బదులుగా ఫిబ్రవరి నెలలో 10వ తేదీన రెండో శనివారాన్ని పనిదినంగా ప్రకటించింది.