Warangal Crime News: వరంగల్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. 32 ఏళ్ల ఓ మహిళపై ఐదుగురు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి రాగా నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 


అసలేం జరిగిందంటే?


వరంగల్ జిల్లా పైడిపల్లికి చెందిన 32 ఏళ్ల ఓ వివాహిత హన్మకొండ బీమారంలోని ఓ కర్రీ పాయింట్ లో పని చేస్తోంది. అయితే ఏప్రిల్ 20వ తేదీన స్నేహితురాలు ఫోన్ చేసి పని ఉందని, ఆరెపల్లెకు రావాలని సూచించింది. అయితే ఆమె బాధిత మహిళ భర్త ఆమెను బైక్ పై తీసుకొచ్చి, ఆరెపల్లిలో వదిలి వెళ్లిపోయాడు. అప్పటికే స్నేహితురాలు వేచి చూస్తోంది. కాసేపటికి అక్కడికి ఓ కారులో రవి, డి.నాగరాజు వచ్చి వీరిద్దరినీ అందులో ఎక్కించుకున్నారు. కారు ములుగు జిల్లా సరిహద్దుకు వెళ్లాక స్నేహితురాలు దిగిపోయారు. అక్కడ రమేష్, లక్ష్మణ్, సుధాకర్ అనే ముగ్గురు వ్యక్తులు కారులో ఎక్కారు. అయితే ఈ క్రమంలోనే బాధిత మహిళకు మత్తు మందు ఇచ్చారు. ఆపై రవి, నాగరాజు, లక్ష్మణ్ సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఒకరి తర్వాత ఒకరు మహిళను అత్యాచారం చేశారు. అయితే దీన్ని ఆపాల్సింది పోయి రమేష్, సుధాకర్ లు వీరికి సహకరించారు.


మహిళకు మెలుకువ వచ్చే సరికి ఆమెపై బట్టలు లేవు. దీంతో ఆమెను పాడు చేసినట్లు మహిళ గుర్తించింది. ఈ క్రమంలోనే వాళ్లతో గొడవ పడింది. దీంతో విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని సదరు నిందితులు బెదిరించారు. ఆపై మహిళను ములుగులో బస్సు ఎక్కించారు. ఆరెపల్లే వద్ద బస్సు దిగి భర్తకు ఫోన్ చేయగా, ఎందుకు ఆలస్యం అయిందని మందలించారు. దీంతో ఆమె కరీంనగర్ లోని రామడుగులో ఉండే తల్లి వద్దకు వెళ్లింది. రెండు, మూడు రోజులైనా భార్య ఇంటికి రాకపోవడంతో ఆమె పుట్టింటికి ఫోన్ చేశాడు. ఆమె అక్కడకు కూడా రాలేదని చెప్పడంతో ఏప్రిల్ 25వ తేదీన ఎనుమాముల ఠాణాలో ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలోనే బాధితురాలు ఓ కుల పెద్ద సాయంతో భర్త వద్దకు వచ్చింది. జరిగిన విషయమంతా వెల్లడించింది. దీంతో ఏప్రిల్ 29వ తేదీన అత్యాచారానికి పాల్పడిన ముగ్గురు నిందితులతో పాటు వారికి సహకరించిన ఇద్దరిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి.. అత్యాచారం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. ప్రస్తుతం బాధితురాలి స్నేహితురాలు పరారీలో ఉంది. 


మూడ్రోజుల క్రితం హన్మకొండలో వివాహితపై ముగ్గురు ఆటో డ్రైవర్ల అత్యాచారం


హన్మకొండ నయీంనగర్ సమీపంలో నివసిస్తున్న ఓ వివాహిత ఏప్రిల్  2వ తేదీన పని మీద బయటకు వెళ్లి రాత్రి 12 గంటల సమయంలో ఇంటిరి తిరిగి వస్తున్నారు. అర్ధరాత్రి కావడంతో కేయూ క్రాస్ వద్ద రోడ్డుపై వెళ్తున్న ఆటోను ఆపి తనను రంగ్ బార్ వద్ద దింపాలని డ్రైవర్ ను కోరారు. మహిళను ఆటో ఎక్కించుకు్నన డ్రైవర్ రాకేశ్.. తన స్నేహితులైన ఆటో డ్రైవర్లు సనత్, సతీష్ కు ఫోన్ చేయగానే కొద్ది సేపటికే వాళ్లు కూడా వచ్చి ఆటో ఎక్కారు. ఆటోను మహిళ చెప్పిన చోటుకు కాకుండా మరో చోటుకు తీసుకెళ్లడం గమనించిన మహిళ అరవడం ప్రారంభించింది. అయితే అరిస్తే ప్రాణాలు తీస్తామంటూ రాకేశ్ స్నేహితులు బెదిరించారు. దీంతో నోరు మెదపకుండా ఆమె ఆటోలో కూర్చుండగా.. ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. భీమారం గ్రామ శివారు వద్ద ఎవరూ లేని చోట ఆటో ఆపారు. ఆమెను కిందకు దంపి ఆటో సౌండ్ బాక్స్ శబ్దాన్ని బాగా పెంచారు. అనంతరం ఒకరి తర్వాత మరొకరు సదరు మహిళపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత ఆమెను రంగ్ బార్ వద్ద వదిలేసి వెళ్లిపోయారు. ఇంటికి వెళ్లిన మహిళ బంధువులకు విషయం తెలపడంతో... హన్మకొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి మహిలళకు వైద్య పరీక్షలు చేయించారు. నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు హన్మకొండ ఇన్ స్పెక్టర్ శ్రీనివాస్ జీ తెలిపారు.