నిమ్స్ దవాఖాన విస్తరణలో భాగంగా నిర్మించబోతున్న 2వేల పడకల నూతన భవనానికి త్వరలో సీఎం కేసీఆర్ భూమిపూజ చేస్తారని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్ రావు వెల్లడించారు. ఈ మేరకు త్వరగా అన్ని ఏర్పాట్లు చేయాలని, అవసరమైన అన్ని విభాగాల అనుమతులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మంత్రి హరీశ్ రావు మంగళవారం డాక్టర్ బీఆర్ అంబేదర్ సచివాలయంలో వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులతో తొలిసారి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన భవనంలో ఓపీ, ఐపీ, ఎమర్జెన్సీ సేవలకు ప్రత్యేకంగా బ్లాకులు ఉంటాయన్నారు.
భవనం మొత్తం ఎనిమిది అంతస్తులుగా ఉంటుందని చెప్పారు. ప్రస్తుతం నిమ్స్‌లో 1500 పడకలు ఉన్నాయని, నూతన భవనం పూర్తయితే పడకల సంఖ్య 3,500కు చేరుతుందన్నారు. ఇటీవల భూమిపూజ చేసుకున్న సూపర్ స్పెషాలిటీ ఎంసీహెచ్ కూడా పూర్తయితే మరో 200 పడకలు అదనంగా అందుబాటులోకి వస్తాయని చెప్పారు. తద్వారా ఒక నిమ్స్‌లోనే 3,700 పడకలు ఉంటాయని చెప్పారు. నిమ్స్ ఎంసీహెచ్ పనులు వేగవంతం చేయాలన్నారు. పెరుగుతున్న జనాభా, అవసరాలకు అనుగుణంగా హైదరాబాద్ నలువైపులా ఒక్కొక్కటి వెయ్యి పడకలు కలిగి ఉండే టిమ్స్ దవాఖానలతోపాటు నిమ్స్ విస్తరణకు సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టినట్లు గుర్తు చేశారు.
దేశంలోనే తొలి సూపర్ స్పెషాలిటీ ఎంసీహెచ్
గాంధీ దవాఖానలో నిర్మిస్తున్న 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఎంసీహెచ్ పనులు ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. ఇది ప్రారంభిస్తే దేశంలోనే తొలి సూపర్ స్పెషాలిటీ ఎంసీహెచ్‌గా రికార్డు సృష్టిస్తామని చెప్పారు. గాంధీలో ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వ సంతాన సాఫల్య కేంద్రాన్ని, స్టేట్ ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంట్ సెంటర్ పనులను వేగవంతం చేయాలన్నారు.
నిమ్స్‌లో మాదిరిగా గాంధీలోనూ అవయవ మార్పిడి సర్జరీలు జరిగేలా చర్యలు తీసుకోవాలని సూపరింటెండెంట్‌ను మంత్రి ఆదేశించారు. బ్రెయిన్ డెడ్ డిక్లరేషన్లు జరిపి, అవసరమైన వారికి అవయవాలు అందించి పునర్జన్మ ప్రసాదించాలన్నారు. ఎంఎన్‌జే దవాఖానలో నూతనంగా ప్రారంభించిన ఆంకాలజీ బ్లాక్‌లో వైద్య సేవలు పూర్తి స్థాయిలో అందాలన్నారు. శానిటేషన్, సెక్యూరిటీ, పేషెంట్ కేర్ విభాగాల్లో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలన్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి మానిటరింగ్ చేస్తూ ఉండాలన్నారు.
Also Read:
ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల బదిలీలకు మార్గదర్శకాలు విడుదల!
తెలంగాణలో డీఎంఈ పరిధిలోని ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల బదిలీలకు సంబంధించిన మార్గదర్శకాలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మే 2న విడుదల చేసింది. కొత్త మార్గదర్శకాల ప్రకారం ప్రస్తుతం పనిచేస్తున్న చోట కనీసం రెండేళ్ల సర్వీస్ పూర్తయినవారు మాత్రమే బదిలీలకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన 17 మెడికల్ కళాశాలల్లోని ఖాళీలను మాత్రమే బదిలీల ద్వారా భర్తీ చేస్తారు. ఒకవేళ బదిలీ కోసం పెట్టుకున్న దరఖాస్తులు 17 కాలేజీల్లోని ఖాళీల కంటే ఎక్కువ ఉంటే నల్గొండ, సూర్యాపేట, సిద్దిపేట, మహబూబ్‌నగర్, ఆదిలాబాద్ రిమ్స్‌లో ఖాళీల్లో భర్తీ చేస్తారు.
మరింత సమాచారం కోసం క్లిక్ చేయండి..
టీఎస్‌పీఎస్సీకి మే 'పరీక్షా'కాలం, పేపర్ లీక్ తర్వాత పరీక్షల నిర్వహణ! మే నెలలో 7 పరీక్షలు!
తెలంగాణలో పేపర్ లీకేజీ వ్యవహారం తీవ్ర దుమారం లేపిన సంగతి తెలిసిందే. ఈ దెబ్బకు నియామక పరీక్షలన్నీ వాయిదాపడ్డాయి. అప్పటికే నిర్వహించిన పరీక్షలతోపాటు, భవిష్యత్‌లో నిర్వహించే పరీక్షలను కూడా కమిషన్ వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో మే నెలలో వివిధ నియామక పరీక్షల నిర్వహణకు టీఎస్‌పీఎస్సీ కసరత్తులు ప్రారంభించింది. మే 8 నుంచి 22 వరకు పరీక్షల నిర్వహణకు టీఎస్‌పీఎస్సీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెలలో 2,024 ఉద్యోగాల భర్తీకి వరుసగా 7 పరీక్షలు నిర్వహించనుంది. వీటిలో అత్యధికంగా 1,540 ఏఈఈ ఉద్యోగాల భర్తీకి రాతపరీక్ష నిర్వహించనుంది.
మరింత సమాచారం కోసం క్లిక్ చేయండి..