LSG vs CSK Preview: గాయపడ్డ రాహుల్‌ సేన! ధోనీ టీమ్‌ను ఓడించగలదా?

LSG vs CSK Preview: ఐపీఎల్‌ 2023లో బుధవారం డబుల్‌ హెడర్‌ మ్యాచులు జరుగుతున్నాయి. మొదటి పోరులో లక్నో సూపర్‌ జెయింట్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ (LSG vs CSK) తలపడుతున్నాయి.

Continues below advertisement

LSG vs CSK Preview: 

Continues below advertisement

ఐపీఎల్‌ 2023లో బుధవారం డబుల్‌ హెడర్‌ మ్యాచులు జరుగుతున్నాయి. మొదటి పోరులో లక్నో సూపర్‌ జెయింట్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ (LSG vs CSK) తలపడుతున్నాయి. ఈ రెండు టీమ్స్‌ తలపడ్డ మొదటి పోరులో ధోనీసేన గెలిచింది. మరి లక్నో ప్రతీకారం తీర్చుకోగలదా?

రాహుల్‌ ఆడగలడా!

లక్నో సూపర్ జెయింట్స్‌కు (Lucknow Super Giants) భారీ షాక్‌ తగిలింది. కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ (KL Rahul) గాయపడ్డాడు. అతడి పరిస్థితి ఏంటో తెలియదు! బహశా ఈ మ్యాచులో ఆడకపోవచ్చు! మరి అతడి ప్లేస్‌ను రిప్లేస్‌ చేసిది ఎవరో చూడాలి. పంజాబ్‌పై 250+ చేసిన రాహుల్‌ సేన బెంగళూరుపై 120+ టార్గెట్ ఛేదించలేకపోయింది. అందుకే ఈ పోరు అత్యంత కీలకం! ఏకనా స్టేడియం పిచ్‌లు అంచనాలకు అందడం లేదు. దాంతో బ్యాటర్లు ఇబ్బంది పడుతున్నారు. ఆయుష్‌ బదోనీ, కృనాల్‌ పాండ్య పెద్ద ఇన్నింగ్సులు ఆడాలి. మిడిలార్డర్ భారం స్టాయినిస్‌, నికోలస్‌ పూరన్‌పై ఉంది. కైల్‌ మేయర్స్‌ పవర్‌ ప్లే మొత్తం ఆడేలా జాగ్రత్తపడాలి. బౌలింగ్‌ పరంగా ఇబ్బందులేమీ లేవు. ఇండియన్‌, ఫారిన్‌ ఫాస్ట్‌ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్‌ చేస్తున్నారు. రవి బిష్ణోయ్‌, గౌతమ్‌, పాండ్య, మిశ్రా స్పిన్‌ బాగుంది.

గెలిస్తే సెకండ్‌ ప్లేస్‌!

చైన్నై సూపర్‌ కింగ్స్ (Chennai Superkings) సైతం చివరి మ్యాచులో ఓటమి పాలైంది. పంజాబ్‌ కింగ్స్‌ చెపాక్‌లో 200+ టార్గెట్‌ను ఆఖరి ఓవర్లో ఛేజ్‌ చేసింది. అయితే బ్యాటింగ్‌ డిపార్ట్‌మెంట్‌ బలంగా ఉంది. డేవాన్‌ కాన్వే, రుతురాజ్‌ గైక్వాడ్‌లో (Ruturaj Gaikwad) ఒకరు కాకుంటే మరొకరు దూకుడుగా ఆడుతున్నారు. భారీ భాగస్వామ్యాలు అందిస్తున్నారు. అజింక్య రహానె సైతం ఫామ్‌లోనే ఉండటం ఫ్లెక్సిబిలిటీ పెంచింది. మిడిలార్డర్లో శివమ్‌ దూబె, రవీంద్ర జడేజా దంచికొడుతున్నారు. అంబటి రాయుడు ఇంకా సెట్టవ్వలేదు. మొయిన్ అలీ ఫర్వాలేదు. ఎంఎస్ ధోనీ (MS Dhoni) దొరికినప్పుడు బాదేస్తున్నాడు కానీ మిగతా మ్యాచులో అలా ఉండటం లేదు. బౌలింగ్‌ పరంగా సీఎస్కే ఇబ్బంది పడుతోంది. అనుభవం లేని కుర్ర పేసర్లు ఒత్తిడికి గురవుతున్నారు. దేశ్‌పాండే వికెట్లు అందిస్తున్నా ప్రెజర్‌ ఫీలవుతున్నాడు. పతిరన బౌలింగ్‌ యాక్షన్‌ బాగుంది. స్పిన్‌ పరంగా సీఎస్కే ఫర్వాలేదు. పేస్‌ బౌలింగ్‌ విభాగంలోనే క్లిక్‌ అవ్వడం లేదు. రెండు జట్లు 10 పాయింట్లతో ఉండటంతో గెలిచిన వాళ్లు 12 పాయింట్లతో రెండో ప్లేస్‌కు చేరుకుంటారు.

చెన్నై సూపర్ కింగ్స్ జట్టు: మహేంద్ర సింగ్ ధోనీ (కెప్టెన్), రవీంద్ర జడేజా, డెవాన్ కాన్వే, మొయిన్ అలీ, రుతురాజ్ గైక్వాడ్, శివమ్ దూబే, అంబటి రాయుడు, డ్వేన్ ప్రిటోరియస్, మహిష్ తీక్షణ ప్రశాంత్ సోలంకి, దీపక్ చాహర్, ముఖేష్ చౌదరి, సిమర్‌జిత్ సింగగే , మిచెల్ సాంట్నర్, మతిషా పతిరనా, సుభ్రాంగ్షు సేనాపతి, తుషార్ దేశ్‌పాండే, బెన్ స్టోక్స్, భగత్ వర్మ, అజయ్ జాదవ్ మోండల్, కైల్ జేమీసన్, మొహమ్మద్.

లక్నో సూపర్ జెయింట్స్ జట్టు: కేఎల్ రాహుల్, నికోలస్ పూరన్, మార్కస్ స్టోయినిస్, అవేశ్ ఖాన్, కృనాల్ పాండ్యా, మార్క్ వుడ్, క్వింటన్ డి కాక్, దీపక్ హుడా, రవి బిష్ణోయ్, కృష్ణప్ప గౌతమ్, డేనియల్ సామ్స్, అమిత్ మిశ్రా, కైల్ మేయర్స్, జయదేవ్ ఉనద్కత్, రొమారియో షెపర్డ్, నవీన్-ఉల్-హక్, యష్ ఠాకూర్, మొహ్సిన్ ఖాన్, ఆయుష్ బడోని, యుధ్వీర్ సింగ్ చరక్, కరణ్ శర్మ, మయాంక్ యాదవ్.

Continues below advertisement