తెలంగాణలో ఇంజినీరింగ్ రెండో సంవత్సరం కోర్సుల్లో ప్రవేశాల‌కు డిప్లొమా విద్యార్థులకు నిర్వహించే టీఎస్ ఈసెట్‌-2023 దరఖాస్తు గడువును అధికారులు పొడిగించారు. మే 2తో దరఖాస్తు గడువు ముగిసినప్పటికీ మే 8 వ‌ర‌కు ఎలాంటి ఆలస్య రుసుములేకుండా దరఖాస్తుకు అవకాశం కల్పించారు. అయితే రూ.500 ఆల‌స్యం రుసుంతో మే 11 వ‌ర‌కు, రూ.1000 ఆల‌స్యం రుసుంతో మే 13 వ‌ర‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. ద‌ర‌ఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ ద‌ర‌ఖాస్తుల‌ను మే 8 నుంచి మే 13 వ‌ర‌కు ఎడిట్ చేసుకునేందుకు అవ‌కాశం క‌ల్పించారు. మే 16 నుంచి అభ్యర్థులు సంబంధిత వెబ్‌సైట్ నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు. మే 20న ఈసెట్ ప్రవేశ ప‌రీక్ష నిర్వహించ‌నున్నారు. ఈసెట్ ద్వారా బీఈ, బీటెక్, బీఫార్మసీ కోర్సు్లో లేటరల్ ఎంట్రీ ద్వారా సెకండియర్‌లో ప్రవేశాలు కల్పిస్తారు. 



వివరాలు...


➥ టీఎస్ఈసెట్- 2023


ప్రవేశ కోర్సులు: బీఈ/బీటెక్/బీఫార్మసీ.


అర్హత‌: స‌ంబంధిత స‌బ్జెక్టుల్లో ఇంజినీరింగ్ డిప్లొమా, బీఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలి.


ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.


ఎంపిక‌ విధానం: కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (ఈసెట్‌-2023) ర్యాంకు ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.


ద‌ర‌ఖాస్తు ఫీజు: రూ.900. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.500 చెల్లిస్తే సరిపోతుంది.


పరీక్ష విధానం:



ముఖ్యమైన తేదీలు..


➥ నోటిఫికేషన్ వెల్లడి: 01.03.2023.


➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 02-03-2023. 


➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 02-05-2023. (08-05-2023 వరకు పొడిగించారు)


➥ రూ.500 ఆలస్య రుసుముతో దరఖాస్తుకు చివరితేది: 11-05-2023.


➥ రూ.2,500 ఆలస్య రుసుముతో దరఖాస్తుకు చివరితేది: 13-05-2023.


➥ దరఖాస్తుల సవరణకు అవకాశం: 08-05-2023 నుంచి 13-05-2023 వరకు.


➥ హాల్‌టికెట్ డౌన్‌లోడ్: 16-05-2023.


➥ ఈసెట్ పరీక్ష తేది: 20-05-2023.


పరీక్ష సమయం: ఉ. 09:00 - మ.12:00 (ECE, EIE, CSE, EEE, CIV, MEC, CHE, MIN, MET, PHM, BSM)


Notification


Online Application


                                      


Also Read:


ఎంసెట్‌ నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు, 137 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు!
తెలంగాణ ఎంసెట్‌ సహా అన్ని ప్రవేశ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ లింబాద్రి తెలిపారు. ఎంసెట్‌ను పకడ్బందీగా నిర్వహించేందుకు ప్రతి పరీక్షా కేంద్రానికి ఒక సిట్టింగ్‌ పరిశీలకుడిని నియమిస్తున్నామని లింబాద్రి వెల్లడించారు. మే 10 నుంచి ఎంసెట్‌ ప్రారంభం కానుండటం, ఆ తర్వాత నెలంతా ప్రవేశ పరీక్షలు జరగనున్న నేపథ్యంలో జేఎన్‌టీయూహెచ్‌ ఉపకులపతి ఆచార్య కట్టా నర్సింహారెడ్డి, ఎంసెట్, ఇతర సెట్‌ల కన్వీనర్లతో కలిసి మే 2న మండలి కార్యాలయంలో ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. 
పరీక్ష పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


టీఎస్ ఎంసెట్-2023 హాల్‌టికెట్లు వచ్చేశాయ్! డైరెక్ట్ లింక్ ఇదే!
తెలంగాణ ఎంసెట్ హాల్‌టికెట్లను ఉన్నత విద్యామండలి ఏప్రిల్ 30న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచింది. ఎంసెట్‌కు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబరు, ఇంటర్ (క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్) హాల్‌టికెట్ నెంబరు వివరాలు నమోదుచేసి హాల్‌టికెట్ల డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మే 10, 11 తేదీల్లో అగ్రికల్చర్ & మెడికల్ పరీక్ష నిర్వహించనున్నారు. ఇక మే 12-14 మధ్య ఇంజినీరింగ్ పరీక్షలు జరగనున్నాయి. 
ఎంసెట్ హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి.. 


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..