వరంగల్ లో దారి దోపిడీలకు పాల్పడుతున్న.. ఎండీ ఇమ్రాన్, ఎండీ హర్బాస్సన్ అనే వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ అరెస్టుకు సంబంధించి వివరాలను వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి వెల్లడించారు. నిందితుల్లో ఒకడైన ఇమ్రాన్ మెకానిక్ పనిచేస్తూ వచ్చిన ఆదాయంతో మద్యం సేవిస్తూ, జల్సాలు చేసేవాడు. తన జల్సాల కోసం అవసరమైన డబ్బు కోసం నిందితుడు 2016 సంవత్సరంలో గీసుగొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక ఇంటిలో ఒక చోరీకి పాల్పడ్డాడు. నిందితుడిని గీసుగొండ పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఆ తర్వాత బయటకు వచ్చాడు.
2019 సంవత్సరంలో గీసుగొండ, ఇంతేజా గంజ్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఇమ్రాన్ మళ్లీ దోపిడీలు, దొంగతనాలకు పాల్పడటంతో మరోమారు పోలీసులు అరెస్టు చేసిన జైలు తరలించారు. జైలు నుంచి విడుదలైన నిందితుడు కొద్ది రోజులు భద్రాచలం ప్రాంతంలో మెకానిక్ గా పని చేశాడు. కరోనా కారణంగా లాక్ డౌన్ తో వరంగల్ కు తిరిగివచ్చాడు. ఇదే సమయంలో నిందితుడికి మహారాష్ట్రకు చెందిన హర్బాస్సన్ తో పరిచయమైంది. అతడు టైల్స్ పని చేస్తుండేవాడు. ఇద్దరు కలిసి మద్యం సేవిస్తూ జల్సాలు చేసేవారు. డబ్బులు లేకపోవడంతో కొన్నిసార్లు నిర్మానుష్య ప్రదేశాల్లో ఒంటరిగా వెళ్ళే వ్యక్తుల మీద దాడి చేసి దోపిడీ చేసేవారు.
వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో చోరీ చేసిన ద్విచక్ర వాహనంతో ఈ పనులు చేసేవారు. ఇంతేజా గంజ్ పరిధిలో ఒక దారి దోపిడీ, రెండు చోరీలు చేశారు. హన్మకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక చోరీ చేశారు. గత నెల అక్టోబర్ మాసంలో కరీంనగర్ బస్టాండ్లో ఒక ద్విచక్రవాహనాన్ని ఎత్తుకెళ్లారు. ఇలా అనేక రకాల చోరీలకు పాల్పడ్డారు.
ఈ చోరీలపై పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. సీసీ కెమెరాల పుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించారు. నిందితులు అండర్ బ్రిడ్జ్ ప్రాంతంలో సంచరిస్తున్నట్లుగా సమాచారం రావడంతో వాహన తనిఖీలు చేపట్టారు. ఈ సమయంలో నిందితులు కరీంనగర్ లో చోరీ చేసిన వాహనంపై వస్తుండగా పోలీసులు అనుమానంతో ఆపే ప్రయత్నం చేశారు. నిందితులు ఇద్దరూ తప్పించుకోనేందుకుగా ప్రయత్నిస్తుండగా వారిని పట్టుకున్నారు. విచారణ చేయగా అసలు విషయాలన్నీ బయటకు వచ్చాయి.
Also Read: Hyd Ganja : పైన ఎరువులు.. కింద గంజాయి ! కానీ పోలీసులకు దొరికిపోయారు..
Also Read: Viveka Case : దేవిరెడ్డి శంకర్ రెడ్డికి వారం రోజుల సీబీఐ కస్టడీ.. సంచలన విషయాలు బయటకు వస్తాయా ?
Also Read: Warangal: బోర్డు తిప్పేసిన చిట్ ఫండ్ కంపెనీ.. బాధితులు లబోదిబో.. డబ్బులడిగితే బెదిరింపులు
Also Read: Sujana CEO : సుజనా ఫౌండేషన్ సీఈవో హత్య ? బెంగళూరు రైల్వే ట్రాక్‌పై మృతదేహం !