Breaking News Live: బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం లేకపోవడంపై తమిళిసై ఆగ్రహం 

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

ABP Desam Last Updated: 05 Mar 2022 09:09 PM
బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం లేకపోవడంపై తమిళిసై ఆగ్రహం 

బడ్జెట్ సమావేశాల్లో తన ప్రసంగం లేకపోవడంపై తెలంగాణ గవర్నర్ తమిళి సై స్పందించారు. ప్రభుత్వం రాజ్యాంగ హక్కులను ఉల్లంఘిస్తుందని ఆరోపించారు. ప్రజలు ప్రభుత్వ చర్యలను గమినిస్తున్నారన్నారు. గవర్నర్ ప్రసంగం లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొనసాగింపులో భాగంగానే సమావేశాల ఉంటాయన్న ప్రభుత్వ వైఖరి సరికాదని తమిళి సై అన్నారు. 

కెనాల్ లో పడి ఇంజినీరింగ్ విద్యార్థి మృతి, విద్యార్థి సంఘాలు ఆందోళన 

హనుమకొండ జిల్లా కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఇంజినీరింగ్ విద్యార్థి మృతి చెందాడు. ఇంజినీరింగ్ కళాశాల సమీపంలో ఉన్నటువంటి కెనాల్ లో పడి లక్కా చందు(20) మృతి చెందాడు. ఈ ఘటనతో యూనివర్సిటీ రిజిస్టర్ ముందు ఏబీవీపీ విద్యార్థుల నిరసన చేశారు. విద్యార్థి మృతికి హాస్టల్ వార్డెన్ పర్యవేక్షణ లోపమే కారణమని విద్యార్థి సంఘాలు  ఆరోపిస్తున్నాయి. హాస్టల్ కేర్ టేకేర్ ని  విధుల నుంచి తొలగించి విద్యార్థికి ఇన్సూరెన్స్ డబ్బులు ఇప్పించాలని విద్యార్థి సంఘ నేతలు డిమాండ్ చేశారు. 

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో రూ.61 లక్షల బంగారం పట్టివేత 

హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికుడి వద్ద 1144 గ్రాముల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ 61.72 లక్షలు ఉంటుందని కస్టమ్స్ అధికారులు తెలిపారు.  లోదుస్తుల్లో పాకెట్ అమర్చి బంగారాన్ని తరలిస్తుండగా అనుమనంతో తనిఖీ చేస్తే బంగారం ఉందన్నారు. బంగారం స్వాధీనం చేసుకోని  కస్టమ్స్ అధికారులు  కేసు నమోదు చేశారు. 

మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నాం : మంత్రి బొత్స సత్యనారాయణ 

'ఒకటికి పది సార్లు చెబుతున్నాం. మేం మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నాం' అని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. టీడీపీ నేతలు తమకు ప్రామాణికం కాదన్నారు. రానున్న అసెంబ్లీలో బిల్లు పెట్టే అంశంపై కూడా ప్రభుత్వం ఆలోచిస్తుందన్నారు.  మూడు రాజధానుల నిర్మాణం వైసీపీ విధానమన్నారు.  జిల్లా పునర్విభజనపై వచ్చిన వినతులను కమిటీ పరిశీలిస్తోందన్నారు. ఉగాదికి కొత్త జిల్లాల నుంచి పాలన ప్రారంభమవుతుందన్నారు. 

పాలసముద్రంలో నాసిన్ అకాడమీకి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భూమిపూజ

అనంతపురం జిల్లా గోరంట్ల మండలం పాలసముద్రం సమీపంలో నాసిన్  (నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇండైరెక్ట్ టాక్సెస్ అండ్ నార్కోటిక్స్) అకాడమీ భవనాలకు 500 ఎకరాలు భూమిని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఇప్పటికే 500 ఎకరాల చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మించారు. నాసిన్ అకాడమీ భవనాలకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, మంత్రి శంకర్ నారాయణ ఇతర ప్రజా ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రెండు గంటలపాటు జరిగిన కార్యక్రమంలో ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్  పాల్గొన్నారు. 

Warangal: కూతురు ప్రేమ వివాహం చేసుకుందని తల్లిదండ్రుల ఆత్మహత్యాయత్నం

కూతురు ప్రేమ వివాహం చేసుకుందని తల్లిదండ్రులు ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. వర్ధన్నపేట మండలం చెన్నారం గ్రామంలో కూతురు ప్రేమ వివాహం చేసుకుని పరువు తీసిందని తల్లిదండ్రులు మంద కుమారస్వామి, కవిత పురుగుల మందు తాగి చనిపోయేందుకు సిద్ధమయ్యారు. దీంతో స్థానికులు వారిద్దరినీ చికిత్స కోసం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. తండ్రి కుమారస్వామి పరిస్థితి విషమంగా ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు.

ఉక్రెయిన్‌పై దాడులకు బ్రేక్.. రష్యా మంత్రిత్వశాఖ కీలక ప్రకటన

ఉక్రెయిన్‌పై బాంబు దాడులు కొనసాగుతున్న వేళ రష్యా తాత్కాలికంగా కాల్పులను నిలిపివేసింది. ఈ మేరకు మాస్కో కాలమానం ప్రకారం ఉదయం 6 గంటలకు కాల్పులను విరమించినట్లుగా రష్యా ప్రకటించింది. మానవతా దృక్పథంతో ఏర్పాటుచేసిన కారిడార్ల ద్వారా ఉక్రెయిన్‌లో చిక్కుకున్న పౌరులను తరలించేందుకు కాల్పులను విరమించినట్లుగా రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

Hyderabad లో ఐపీఎస్‌లకు ఆకస్మిక బదిలీలు

హైదరాబాద్ కొంత మంది ఐపీఎస్ అధికారులకు ఆకస్మికంగా బదిలీలు అయ్యాయి. సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ ఆకస్మిక బదిలీ అయ్యారు. డీసీపీ విజయ్ కుమార్‌ను డీజీపీ ఆఫీస్‌కు అటాచ్ చేశారు. సెంట్రల్ జోన్ డీసీపీగా రాజేష్ చంద్రకు బాధ్యతలు అప్పగించారు. సౌత్ జోన్ డీసీపీగా సాయి చైతన్య నియామకం అయ్యారు. ఈస్ట్ జోన్ డీసీపీగా సతీష్‌కు పోస్టింగ్ ఇచ్చారు. 

శ్రీలంకతో తొలి టెస్టులో రవీంద్ర జడేజా సెంచరీ

శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో రవీంద్ర జడేజా శతకం సాధించాడు. కెరీర్‌లో రెండో టెస్టు సెంచరీ నమోదు చేశాడు ఆల్ రౌండర్ జడేజా. భారత్ స్కోర్ 112 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 468 పరుగులు చేసింది. 





Kurnool: విరసం నేత పినాకాపాణి ఇంట్లో ఎన్ఐఏ సోదాలు

* కర్నూలు నగరంలో NIA సోదాలు


* విరసం నేత పినాకాపాణి ఇంట్లో సోదాలు చేపట్టిన NIA అధికారులు


* పినాకాపాణిని అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం


* గతంలో కూడా పినాకాపాణి ఇంట్లో సోదాలు చేసి పలు రికార్డులను స్వాధీనం చేసుకున్న NIA అధికారులు


* ఇపుడు మళ్ళీ సోదాలు చేయడంతో కర్నూలులో కలకలం


* ఎందుకు సోదాలు చేస్తున్నారో క్లారిటీ ఇవ్వని అధికారులు

Manipur Election 2022: మణిపూర్‌లో ప్రారంభమైన తుది విడత పోలింగ్

మణిపూర్‌లో ఆఖరి విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. శనివారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల దాకా కొనసాగనుంది. మణిపూర్‌లో 60 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. మొదటి విడతలో 38 స్థానాల్లో ఎన్నికలు జరిగాయి. తుది విడతలో 22 స్థానాల్లో ఇప్పుడు పోలింగ్ జరుగుతోంది. 22 సీట్లలో 92 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 8,38,730 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. కోవిడ్ పాజిటివ్ లేదా క్వారంటైన్‌లో ఉన్న ఓటర్లు మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల మధ్య ఓటు వేయడానికి అవకాశం కల్పించారు.

Sujana Chowdary: శ్రీవారి సేవలో సుజనా చౌదరి

తిరుమల శ్రీవారిని బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం విఐపి విరామ సమయంలో కుటుంబ సభ్యులతో స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు..దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా.. ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల సుజనా చౌదరి మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ కు ఉన్న కష్టాలు తీరాలని కోరుకున్నట్లు తెలిపారు. టీటీడీలో చక్కటి పరిపాలన సాగుతోంది.. ఇలా రాష్ట్ర ప్రభుత్వం చేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు.. దైవ అనుగ్రహంతో హైకోర్టు మంచి తీర్పు ఇచ్చిందని చెప్పారు

Mulugu Accident: ములుగు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

అన్నారం దర్గాకు వెళ్లి మొక్కులు చెల్లించుకొని తిరిగి వస్తున్న క్రమంలో ములుగు మండలం ఇంచేర్ల వద్ద ఆటోను డీసీఎం ఢీ కొనడంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మొత్తం ఆటోలో 8 మంది ప్రయాణం చేస్తున్నారు. మిగతా నలుగురికి తీవ్ర గాయాలు కావడంతో వారిని వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. వీరందరూ మంగపేట మండలం కోమటిపల్లి కేసీఆర్ కాలనికి చెందినవారు. నాలుగు కుటుంబాలకు చెందిన వీరికి తెలంగాణ ప్రభుత్వం డబుల్ బెడ్ రూం ఇళ్లు కేటాయించడంతో అన్నారం దర్గాకు మొక్కులు చెల్లించుకోవడానికి వెళ్లారు. తిరిగి వస్తున్న క్రమంలో ఈ సంఘటన చోటుచేసుకుంది.

Background

దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారింది. ప్రస్తుతం వాయుగుండం తమిళనాడు తీరం వైపుగా కదులుతుందని, దీని ప్రభావం తమిళనాడుతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. తీరం వెంట 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. నైరుతి నుంచి 70 కిలోమీటర్ల వేగంతో తీరం వెంట గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఏపీ, తమిళనాడులో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండగా, తెలంగాణలో అక్కడక్కడా తేలికపాటి జల్లులు కురవనున్నాయి.


యానాం, ఉత్తర కోస్తాంధ్రలో వెదర్ అప్‌డేట్స్ 
శ్రీలంకలోని ట్రింకానమలీకి 180 కి.మీ తూర్పుగా, తమిళనాడు నాగపట్నానికి 470 కి.మీ దూరంలో, పుదుచ్చేరికి 470 కి.మీ దూరంలో, చెన్నైకి 530 కి.మీ దూరంలో వాయుగుండం కేంద్రీకృతమై ఉందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావం ఏపీలో మార్చి 4 అర్ధరాత్రి నుంచి మొదలవుతుంది. అల్పపీడనం ఎఫెక్ట్, ఆగ్నేయ గాలుల ప్రభావం ఉత్తర కోస్తాంధ్ర, యానాంలలో ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు తగ్గనున్నాయి. తీరం వెంట బలమైన గాలులు దక్షిణ దిశ నుంచి 50 నుంచి 60 కి. మీ వేగంతో వీస్తాయని హెచ్చరించారు. అయితే ఉత్తర కోస్తాంధ్రంలో ఆకాశం మేఘావృతమై ఉంటుంది. జంగమేశ్వరపురం, బాపట్లలో, నందిగామలో, అమరావతిలో, తునిలో, విశాఖపట్నంలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.   


దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో వర్షాలు.. 
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారడంతో దక్షిణ కోస్త్రాంధ్ర, రాయలసీమలో వర్షాలు కురవనున్నాయి. నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాలో నేటి నుంచి మూడు రోజులపాటు తేలికపాటి జల్లుల నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయి. మరో 36 గంటల్లో వాయువ్య దిశగా పయనిస్తూ తూర్పు శ్రీలంక తీరం వెంట ఉత్తర తమిళనాడు వద్ద తీవ్ర వాయుగుండంగా మారి తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. మార్చి 6, 7 మరియు 8 న వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేశారు. గుంటూరు, కృష్ణా, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరిలో ఉష్ణోగ్రత కొంత తగ్గడంతో వాతావరణం చల్లగా ఉంటుంది.


తెలంగాణ వెదర్ అప్‌డేట్..
అల్పపీడనం ప్రభావం తమిళనాడు, శ్రీలంకతో పాటు తెలంగాణపై సైతం ఉంటుంది. రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు కాస్త తగ్గుతాయి. కొన్ని చోట్ల వాతావరణం పొడిగా మారుతుంది. వాయుగుండం ప్రభావంతో ఆగ్నేయ దిశ నుంచి గంటలకు 8 నుంచి 10 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. అల్పపీడనం తమిళనాడు తీరాన్ని రాత్రి తాకే అవకాశం ఉంది. మొదట తమిళనాడు, లంక తీరంలో వర్షాలు కురుస్తాయి. ఏపీలో ఓ మోస్తరు వానలు పడే అవకాశం ఉండగా, తెలంగాణలో చిరు జల్లులు పడతాయి. 

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.