TSRTC Ladies Special: మహిళా ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. అందించింది. హైదరాబాద్ నగరంలోని సీబఐటీ మార్గంలో లేడీస్ స్పెషల్ బస్సును టీఎస్ ఆర్టీసీ ఏర్పాటు చేసింది. 120 రూట్ నెంబర్ గల ఈ సర్వీస్.. ప్రతి రోజు ఉదయం 08:30 గంటలకు మెహిదిపట్నం నుండి ప్రారంభం అవుతుందని టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. తిరిగి సాయంత్రం 04:00 గంటలకు సీబీఐటీ నుంచి బయలు దేరుతుంది. ఆ మార్గంలో వెళ్లే ఇంజినీరింగ్ విద్యార్థినులు, మహిళలు ఈ స్పెషల్ బస్సు సదుపాయాన్ని వినియోగించుకోవాలని అన్నారు.
ఇటీవలే ఆ రూట్లలో కూడా లేడీస్ కు ప్రత్యేక బస్సులు
మహిళా ప్రయాణికులకు టీఎస్ ఆర్టీసీ శుభవార్త అందించింది. హైదరాబాద్ నగరంలో కోఠి- కొండాపూర్ మార్గంలో లేడీస్ స్పెషల్ బస్సును టీఎస్ ఆర్టీసీ (TSRTC) ఏర్పాటు చేసింది. 127K నంబర్ ప్రత్యేక బస్సు ఆగస్టు 21 (సోమవారం) నుంచి ప్రారంభం కానుందని టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. ప్రతి రోజు ఉదయం 8.50 గంటలకు కోఠి బస్టాప్ నుంచి ఈ బస్సు బయలుదేరుతుంది. అక్కడి నుంచి లక్దికాపుల్, మసాబ్ ట్యాంక్, ఎమ్మెల్యే కాలనీ, ఉషా కిరణ్, గుట్టల బేగం పేట, శిల్పారామం, కొత్తగూడ ఎక్స్ రోడ్స్ మీదుగా కొండాపూర్ కి వెళ్తుంది. తిరిగి సాయంత్రం 5:45 గంటలకు కొండాపూర్ నుంచి అదే మార్గంలో బస్సు కోఠికి తిరిగి వస్తుందని తెలిపారు. మహిళా ప్రయాణికులు ఈ సదుపాయాన్ని వినియోగించుకుని క్షేమంగా, సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని టీఎస్ ఆర్టీసీ సూచించింది.
ఆర్టీసీ ప్రయాణికులకు గమనిక - ఆ రూట్ లో బస్సుల పునరుద్ధరణ
కుషాయిగూడ - అఫ్జల్ గంజ్ మార్గంలో వెళ్లే 3వ నెంబర్ రూట్ సిటీ బస్సులను మౌలాలి కమాన్ మీదుగా ఆగస్టు 16 నుంచి ఆర్టీసీ పునరిద్దరించింది. గత పది సంవత్సరాలుగా మౌలాలీ కమాన్ రూట్ బంద్ ఉండగా... ప్రత్యామ్నాయంగా మౌలాలీ హౌజింగ్ బోర్డు కాలనీ గుండా బస్సులను నడిపింది. తాజాగా ఆ రూట్ లో రాకపోకలు సాగుతుండటంతో మౌలాలీ కమాన్ మీదుగా గతంలో మాదిరిగా బస్సులను నడపాలని సంస్థ నిర్ణయించింది. ఈ 3వ నెంబర్ రూట్ బస్సు కుషాయిగూడ నుంచి ఈసీఐఎల్ క్రాస్ రోడ్, ఎస్పీ నగర్, మౌలాలీ కమాన్, జెడ్టీఎస్, లాలాపేట్, తార్నాక, శంకర్ మట్, కోటి, సీబీఎస్ మీదుగా అఫ్జల్ గంజ్ వెళ్తుంది. ఆ రూట్ లో ప్రతి 20 నిమిషాలకో బస్సు ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది. ఈ సదుపాయాన్ని కుషాయిగూడ - అఫ్జల్ గంజ్ మార్గంలోని ప్రయాణికులు వినియోగించుకోవాలని సంస్థ కోరుతోంది.
Read Also: TSRTC News: తెలంగాణ ఆర్టీసీ అదిరిపోయే న్యూస్ - ఎలాంటి బస్సులో అయినా నగదు రహిత ప్రయాణం!