Kodandaram and Amir Ali Khan as Governor quota MLCs :  తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ప్రొఫెసర్ కోదండరాం, జర్నలిస్టు అమీర్ అలీఖాన్‌ల పేర్లను కేబినెట్‌ మరోసారి తీర్మానించింది. హైకోర్టు ఆదేశాలతో ఈ రెండు పేర్లను రాష్ట్ర ప్రభుత్వం మరోసారి గవర్నర్ తమిళిసై‌కి పంపించనుంది. ఇంతకు ముందు కూడా ఈ పేర్లను ఖరారు చేశారు. గవర్నర్ ఆమోదించారు. ఇక ప్రమాణ స్వీకారమే  తరువాయి అనుకున్న సమయంలో కోర్టు చిక్కులు పడ్డాయి. ఇప్పుడు మరోసారి వారి పేర్లనే రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కేబినెట్ సిఫారసు చేస్తోంది. 


తెలంగాణ  హైకోర్టు కీలక తీర్పు 


 తమ పేర్గలను గవర్నర్ తిరస్కరించడంపై దాసోజు శ్రవణ్ , కుర్రా సత్యనారాయణ హైకోర్టును ఆశ్రయించారు.  విచారణ జరిపిన హైకోర్టు గర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా దాసోజు శ్రవణ్‌కుమార్, కుర్ర సత్యనారాయణలను నియమించాలంటూ రాష్ట్ర కేబినెట్‌ చేసిన సిఫార్సు లపై గవర్నర్‌ వ్యవహరించిన తీరు సరికాదని రాష్ట్ర హైకోర్టు పేర్కొంది. సదరు సిఫార్సులను తిరస్క రిస్తూ 2023 సెప్టెంబర్‌ 19న గవర్నర్‌ ఇచ్చిన ఆదేశా లను రద్దు చేసింది. దీంతోపాటు గవర్నర్‌ ఆదేశాల మేరకు కోదండరామ్, ఆమెర్‌ అలీఖాన్‌లను ఎమ్మెల్సీలుగా నియమిస్తూ ఈ ఏడాది జనవరి 27న ప్రభుత్వం జారీ చేసిన గెజిట్‌ నోటిఫికేషన్‌ను కూడా రద్దు చేసింది. మళ్లీ కొత్తగా ఎమ్మెల్సీల నియామకం చేపట్టాలని.. మరోసారి ఎమ్మెల్సీల పేర్లను కేబినెట్‌ లో ప్రతిపాదించి గవర్నర్‌కు పంపాలని స్పష్టం చేసింది. 


హైకోర్టు  ఆదేశాల ప్రకారం మరోసారి పేర్ల సిఫారసు 


హైకోర్టు ఆదేశాల మేరకు కేబినెట్ మరోసారి పేర్లను సిఫారసు చేసింది. అయితే తమకు ఎమ్మెల్సీలు అయ్యే అర్హతలు ఉన్నాయని శ్రవణ్ , కుర్రా సత్యనారాయణ అంటున్నారు. గవర్నర్ తిరస్కరిచంినప్పుుడే .. తెలంగాణ కేబినెట్ మరోసారి వారి పేర్లనే సిఫారసు చేసి ఉంటే గవర్నర్ తప్పక ఆమోదించాల్సి ఉండేది. అయితే ఎన్నికలు రావడంతో కేసీఆర్ ఆ పని చేయలేకపోయారు. చివరికి ఆ  రెండు ఎమ్మెల్సీ లు కాంగ్రెస్ ఖాతాలో పడుతున్నాయి.  


సోమవారం రాజ్ భవన్ కు వెళ్లిన  కుర్రా సత్యనారాయణ. దాసోజు శ్రవణ్ 


 బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ నాయకులు దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ సోమవారం రాజ్​భవన్​కు వెళ్లారు. హైకోర్టు తీర్పునకు అనుగుణంగా.. గవర్నర్‌‌‌‌‌‌‌‌ కోటాలో ఎమ్మెల్సీలుగా తమను నామినేట్ చేస్తూ గత ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలకు ఆమోదం తెలపాలని గవర్నర్‌‌‌‌‌‌‌‌ తమిళిసైకి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు రాజ్‌‌‌‌భవన్‌‌‌‌లో వారు వినతి పత్రాలు అందజేశారు. హైకోర్టు తీర్పును అమలు చేయాలని పేర్కొన్నారు. అత్యంత పేద కులాలకు చెందిన తమను గత ముఖ్యమంత్రి కేసీఆర్‌‌‌‌‌‌‌‌ నేతృత్వంలో కేబినెట్ ఎమ్మెల్సీలుగా నామినేట్ చేస్తూ గవర్నర్‌‌‌‌‌‌‌‌కు ప్రతిపాదనలు పంపిందని, ఈ ప్రతిపాదనలను 55 రోజుల తర్వాత గవర్నర్ తిరస్కరించారని శ్రవణ్​  అన్గునారు.   ఈ విషయంలో తాము కోర్టును ఆశ్రయించగా, రాజ్యాంగ ఉల్లంఘన జరిగినట్టు కోర్టు అభిప్రాయపడిందన్నారు. కోర్టు తీర్పుతో తమ ప్రతిపాదనకు ప్రాణం వచ్చిందని, హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలుచేసి పేద కులాలకు చెందిన తమకు గవర్నర్ న్యాయం చేయాలని దాసోజు విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్సీలు కావడానికి కావాల్సిన అన్ని అర్హతలు తమకు ఉన్నాయని ఇరువురు నేతలు పేర్కొన్నారు.   


కేబినెట్ సిఫారసుపై  గవర్నర్ తీసుకునే నిర్ణయం కీలకం కానుంది.