Breaking News Live: తిరుమలలో రోడ్డు ప్రమాదం - భక్తులపైకి దూసుకెళ్లిన కారు

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

ABP Desam Last Updated: 11 Apr 2022 03:06 PM
Tirumala News: తిరుమలలో భక్తులపైకి దూసుకెళ్లిన కారు

తిరుమలలో భక్తులపైకి కారు దూసుకెళ్లింది.. శ్రీవారి ఆలయంకు సమీపంలోని రాంభగీచ్చా బస్టాండు వద్ద భక్తులు రోడ్డుపై నిలుచుని ఉండగా ఒక్కరిగా భక్తులపై కర్ణాటకకు చేందిన కారు భక్తులను ఢీ కొనడంతో ప్రమాదం చోటు చేసుకుంది.. ఈ ప్రమాదంలో ముంబైకి చెందిన ఇసైయమ్మళ్ కు రెండు కాళ్ళు విరగగా, తెలంగాణకు చేందిన వెంకటేశ్వర్లుకు తీవ్ర గాయాలు అయ్యాయి. వీరిని 108 ద్వారా ఆశ్వినీ ఆసుపత్రికి తరలించారు.. ఘటన స్ధలానికి చేరుకున్న తిరుమల టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కారు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ప్రమాదంలో గాయపడిన వారిని మెరుగైన వైద్య సేవల నిమిత్తం తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు.

Ap Cabinet: మంత్రిగా తొలిసారి ప్రమాణం చేసిన విడదల రజనీ

చిలకలూరిపేట నుంచి ఎన్నికైన విడదల రజనీ తొలిసారి మంత్రిగా ప్రమాణం చేశారు. 2019లో ప్రత్తిపాటి పుల్లారావు ఓడించి వైసీపీ తరఫున గెలుపొందారు. తెలుగుదేశం నుంచి రాజకీయ ప్రస్తానం ప్రారంభించారు. మంత్రిగా ప్రమాణం చేసిన తర్వాత సీఎం జగన్‌ కాళ్లకు నమస్కరించారు. 

Ap Cabinet: రెండోసారి ప్రమాణం చేసిన తానేటి వనిత

కొవ్వూరు నుంచి విజయం సాధించిన తానేటి వనిత రెండోసారి మంత్రిగా ప్రమాణం చేశారు. 2019 నుంచి స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నారు. 2009లో తొలిసారిగా గోపాలపురం నుంచి ఎన్నికయ్యారు. 2019లో కొవ్వూరు నుంచి వైసీపీ తరఫున గెలుపొందారు. 

Ap Cabinet: రెండోసారి మంత్రిగా ప్రమాణం చేసిన అప్పలరాజు

పలాస నియోజకవర్గం నుంచి తొలిసారి ఎన్నికన సీదిరి అప్పలరాజు రెండోసారి మంత్రిగా ప్రమాణం చేశారు. వైద్యుడిగా పలాసలో సేవలు అందించడంతో ఫేమస్ అయ్యారు. ప్రమాణ స్వీకారం అనంతరం ఆయన జగన్ కాళ్లకు నమస్కరించారు.  

Ap Cabinet: చేతికి ముద్దు- కాళ్లకు దండం- మంత్రిగా ప్రమాణ స్వీకారంలో రోజా స్టైలే వేరు

నగరి నుంచి వరుసుగా రెండుసార్లు విజయం సాధించిన రోజా తొలిసారిగా మంత్రిగా ప్రమాణం చేశారు. 2004లో రాజకీయాల్లోకి వచ్చారు. 2014, 19లో వైసీపీ తరఫున నగరి నుంచి విజయం సాధించారు. ప్రస్తుతం ఏపీఐఐసీ ఛైర్మన్‌గా ఉన్నారు. అనంతరం జగన్ కాళ్లకు నమస్కరించారు. చేతికి ముద్దు పెట్టారు. 

Ap Cabinet: పీడిక రాజన్న దొర తొలిసారి మంత్రిగా ప్రమాణం

సాలూరు నుంచి ఎన్నికైన రాజన్న దొర తొలిసారి మంత్రిగా ప్రమాణం చేశారు. 2014, 2019లో వైసీపీ తరఫున విజయం సాధించారు. 2009లో కూడా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన తొలిసారిగా మంత్రిగా ప్రమాణం చేశారు

Ap Cabinet: మరోసారి మంత్రిగా పినిపె విశ్వరూప్‌ ప్రమాణం

అమలాపురం నుంచి విజయం సాధించిన పినిపె విశ్వరూప్‌ రెండోసారి జగన్ టీంలో మంత్రిగా ఎంపికయ్యారు. 1989లో రాజకీయాల్లోకి వచ్చిన ఆయన మంత్రిపదవి చేపట్టడం ఇది మూడో సారి. 2019లో సాంఘీక సంక్షేమ మంత్రిగా ఉన్నారు. ఉమ్మడి ఏపీలో పశుసంవర్ధక శాక మంత్రిగా కూడా పని చేశారు. 

Ap Cabinet: మంత్రిగా ప్రమాణం చేసిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

పుంగనూరు నుంచి విజయం సాధించిన పెద్దిరెడ్డి రెండోసారి జగన్ టీెంలో మంత్రిగా ప్రమాణం చేశారు. 2019లో పంచాయతీరాజ్‌శాఖ, గనులశాఖ మంత్రిగా పని చేశారు. ఏడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన నేత.. రెండుసార్లు మంత్రిగా పని చేశారు. 1989లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 

Ap Cabinet: మంత్రిగా ప్రమాణం చేసిన మేరుగ నాగార్జున

వేమూరు నుంచి విజయం సాధించి మంత్రిగా ప్రమాణం చేసిన మేరుగ నాగార్జున. 2009లో రాజకీయల్లోకి అరగేట్రం చేశారు.  

Ap Cabinet: మంత్రిగా ఉషా శ్రీ చరణ్‌ ప్రమాణం

కళ్యాణదుర్గం నుంచి విజయం సాధించిన వైసీపీ ఎమ్మెల్యే ఉషా శ్రీ చరణ్‌.. తొలిసారి మంత్రిగా ప్రమాణం చేశారు. ఈమె ఇంగ్లీష్‌లో ప్రమాణ స్వీకారణం చేశారు. జగన్ కాళ్లపై పడి థాంక్స్ చెప్పిన ఉషా 

Ap Cabinet: రెండోసారి మంత్రిగా నారాయణ స్వామి ప్రమాణం- జగన్‌ కాళ్లకు మొక్కిన ఎమ్మెల్యే

గంగాధర నెల్లూరు నుంచి విజయం సాధించిన కే నారాయణ స్వామి రెండోసారి మంత్రిగా ప్రమాణం చేశారు.2004లో సత్యవేడు నుంచి విజయం సాధించారు. 2014, 2019లో వైసీపీ తరఫున విజయం. గత కేబినెట్‌లో ఎక్సైజ్‌ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నారాయణ స్వామి. ప్రమాణ స్వీకారం తర్వాత జగన్ కాళ్లకు మొక్కారు. 

AP Cabinet: కొట్టు సత్యనారాయణ మంత్రిగా ప్రమాణం

తాడేపల్లిగూడెం నుంచి విజయం సాధించిన కొట్టు సత్యనారాయణ మంత్రిగా ప్రమాణం చేశారు. 2004లో తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2019లో వైసీపీ తరుఫున విజయం సాధించారు. 

AP Cabinet: మంత్రిగా కారుమూరి నాగేశ్వరరావు ప్రమాణం

తణుకు నుంచి విజయం సాధించిన కారుమూరి నాగేశ్వరరావు తొలిసారి మంత్రిగా ప్రమాణం చేశారు. 2019లో వైసీపీ తరఫున విజయం సాధించారు.  2009లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. 

AP Cabinet: కాకాణి గోవర్ధన్‌రెడ్డి మంత్రిగా తొలిసారి ప్రమాణం

సర్వేపల్లి నుంచి విజయం సాధించిన కాకాణి గోవర్ధన్‌ రెడ్డి మంత్రిగా ప్రమాణం చేశారు. ఇప్పటి వరకు ఆయన ప్రివిలేజ్‌ కమిటీ ఛైర్మన్‌గా ఉన్నారు. 2009, 2019లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు.  

AP Cabinet: మంత్రిగా జోగి రమేష్‌ ప్రమాణం- సాష్టాంగ నమస్కారం చేస్తుంటే వద్దని చెప్పిన జగన్

పెడన నుంచి విజయం సాధించిన జోగి రమేష్‌ మంత్రిగా ప్రమాణం చేశారు. ఎమ్మెల్యేగా రెండుసార్లు విజయం సాధించారు. తొలిసారిగా మంత్రిపదవి ఈయన్ని వరించింది. ప్రమాణ స్వీకారం తర్వాత జగన్‌ కాళ్లపై పడుతుంటే వద్దని వారించారు సీఎం జగన్ 

AP Cabinet: గుమ్మనూరి జయరాం రెండోసారి మంత్రిగా ప్రమాణం

ఆలూరు నుంచి విజయం సాధించిన గుమ్మనూరి జయరాం 2019 నుంచి జగన్ కేబినెట్ లో మంత్రిగా ఉన్నారు. కార్మికశాఖ మంత్రిగా పని చేశారు. 2014, 2019లో వైసీపీ తరఫున విజయం సాధించారు. ఇప్పుడు రెండోసారి కూడా మంత్రి పదవి ఆయన్ని వరించింది. 

AP Cabinet: జగన్‌కు గుడివాడ అమర్‌నాథ్‌ సాష్టాంగ నమస్కారం

అనకాపల్లి నుంచి విజయం సాధించిన గుడివాడ అమర్‌నాథ్‌ తొలిసారి మంత్రిగా ప్రమాణ చేశారు. ఆయన 2014-19 వరకు వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. 2019లో అనకాపల్లి నుంచి వైసీపీ తరఫున విజయం సాధించారు. ఇప్పుడు మంత్రిగా ప్రమాణం చేశారు. 

AP Cabinet: మంత్రిగా ధర్మాన ప్రసాదరావు ప్రమాణ స్వీకారం

అపార రాజకీయ అనుభవం ఉన్న ధర్మాన ప్రసాద రావు మంత్రిగా ప్రమాణం చేశారు. ఆయన సోదరుడు ధర్మాన కృష్ణదాసును తప్పించి ఈయనకు అవకాశం కల్పించారు జగన్. ఈయన రాజకీయ జీవితం 1980లో ప్రారంభమైంది. వైఎస్‌ కేబినెట్‌లో రెవెన్యూ మంత్రిగా చేశారు. 20102-13వరకు ఆర్‌అండ్‌బీ మినిస్టర్‌గా కూడా పని చేశారు. 2019లో వైసీపీ తరఫున శ్రీకాకుళం నుంచి విజయం సాధించారు. 

AP Cabinet: దాడిశెట్టి రాజా మంత్రిగా ప్రమాణ స్వీకారం

తుని నుంచి రెండోసారి విజయం సాధించిన దాడిశెట్టి రాజా మంత్రిగా ప్రమాణం చేశారు. ఇప్పటి వరకు విప్‌గా ఆయన అసెంబ్లీలో సేవలు అందించారు. ఇకపై మంత్రిగా అసెంబ్లీలో ఈయన్ని చూడబోతున్నాం. 

AP Cabinet: మంత్రిగా చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ ప్రమాణ స్వీకారం

రెండోసారి మంత్రిగా ప్రమాణం చేశారు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల్ కృష్ణ. 2019లో తొలిసారిగా ఎమ్మెల్యేగా విజయం సాధించారు. జగన్ కేబినెట్‌లో మొన్నటి వరకు బీసీ వెల్ఫేర్‌ మంత్రిగా పని చేశారు. రామచంద్రాపురం నుంచి విజయం సాధించిన వైసీపీ ఎమ్మెల్యే. ఇప్పుడు రెండోసారి మంత్రిపదవి అవకాశం వచ్చింది. 

AP Cabinet: మంత్రిగా బుగ్గనరాజేంద్రనాథ్‌రెడ్డి ప్రమాణం

డోన్‌ నుంచి విజయం సాధించిన బుగ్గన రెండోసారి మంత్రిగా ప్రమాణం చేశారు. రెండుసార్లు వైసీపీ తరఫున విజయం సాధించారు. 2019 నుంచి మొన్నటి వరకు ఆర్థిక శాఖను నిర్వహించారు. 

AP Cabinet: మంత్రిగా మొదటిసారి ప్రమాణం చేసిన బూడి ముత్యాలనాయుడు

మాడుగల నుంచి ఎన్నికైన వైసీపీ ఎమ్మెల్యే ముత్యాలనాయుడు మంత్రిగా తొలిసారి ప్రమాణం చేశారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారాయన. 

AP Cabinet: జగన్ కేబినెట్‌లో రెండోసారి మంత్రిగా ప్రమాణం చేసిన బొత్స సత్యనారాయణ

విజయనగరానికి చెందిన సీనియర్ లీడర్ బొత్స.2019లో మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నారు. 2011-15 వరకు ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్‌గా పని చేశారు. చిపురుపల్లి నుంచి విజయం సాధించిన లీడర్. వైఎస్‌ హయాంలో కూడా పలు శాఖ నిర్వహించిన బొత్స. ఇప్పుడు ఆయన కుమారుడి కేబినెట్‌లో స్థానం దక్కించుకున్న నేత. 

AP Cabinet: ఆదిమూలపు సురేష్‌ రెండోసారి మంత్రిగా ప్రమాణం

ఎర్రగొండపాలెం నుంచి విజయం సాధించిన ఎమ్మెల్యే. 2019లో విద్యాశాఖ మంత్రిగా పని చేశారు. రెండోసారి కూడా మంత్రిగా ఛాన్స్ కొట్టేశారు. 2009 నుంచి వరుసగా మూడు సార్లు విజయం సాధించిన నేత. 

AP Cabinet: మంత్రిగా రెండోసారి ప్రమాణం చేసిన అంజాద్ బాషా

మంత్రిగా అంజాద్ బాషా ప్రమాణం చేశారు. 2019 నుంచి మంత్రిగా ఉన్నారు. ఇప్పుడు రెండోసారి మంత్రి పదవి ఆయన్ని వరించింది. కడప కార్పొరేటర్‌గా ఆయన తన రాజకీయ జీవితం ప్రారంభించారు. 2014, 2019లో కడప ఎమ్మెల్యేగా గెలుపొందారు. 

AP Cabinet: ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ ప్రమాణస్వీకార కార్యక్రమం మొదలైంది.

ఆంధ్రప్రదేశ్‌ మంత్రిగా  నియమితులైన అంబటి రాంబాబు మంత్రిగా ప్రమాణం చేశారు. ఆయనతో గవర్నర్ ప్రమాణం చేయించారు. ఆయన సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి విజయం సాధించారు.  పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఛైర్మన్‌గా అనుభవం ఉన్న నేత. రేపల్లి నుంచి తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2019లో సత్తెనపల్లి నుంచి మాజీ స్పీకర్ కోడెలను ఓడించారు.  

MLA Roja: ఇంద్రకీలాద్రి కనకదుర్గను దర్శించుకున్న రోజా

మంత్రి పదవి వరించిన వేళ కాబోయే మంత్రి ఆర్.కె.రోజా కుటుంబ సమేతంగా ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. రోజా కుటుంబ సభ్యులకు ఆలయ అధికారులు స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం అనంతరం వేద పండితులతో వేద ఆశీర్వచనం అందించారు. అనంతరం లడ్డు ప్రసాదాన్ని అమ్మవారి చిత్రపటాన్నిదుర్గ గుడి ఈఓ భ్రమరాంబ రోజాకు అందించారు.

TRS Delhi Protest: కేసీఆర్ దీక్షకు వ్యతిరేకంగా ఢిల్లీలో బీజేపీ ఫ్లెక్సీలు - చింపేసిన టీఆర్ఎస్ నేతలు

ఢిల్లీలోని తెలంగాణ భవన్​ పరిధిలో టీఆర్ఎస్ దీక్షకు వ్యతిరేకంగా బీజేపీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించారు. తెలుగు, హిందీ, ఇంగ్లీషు భాషల్లో కేసీఆర్‌కు వ్యతిరేకంగా బీజేపీ నేతలు ఫ్లెక్సీలు పెట్టగా.. టీఆర్ఎస్ శ్రేణులు వాటిని తొలగించారు. ‘తెలంగాణ రైతులను గాలికొదిలేసి దిల్లీలో డ్రామాలా’ అనే నినాదాలతో ఫ్లెక్సీలు పెట్టారు. చేతనైతే ధాన్యం కొనుగోలు చేయి, లేకపోతే గద్దె దిగు అనే నినాదాలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.

Background

దక్షిణాది రాష్ట్రాల్లో మరో మూడు, నాలుగు రోజులు వర్షాలు కురవనున్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. అదే సమయంలో కొన్ని రాష్ట్రాల్లో ఎండలతో వడగాల్పులు వీస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ముఖ్యంగా మధ్యాహ్నం వేళ అవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ప్రజలను అలర్ట్ చేశారు. దక్షిణ బంగాళాఖాతంలో మార్పుల ప్రభావంతో ప్రస్తుతం మధ్య ట్రోపో ఆవరణంలో బలమైన గాలులు వీస్తున్నాయి. దాంతో ఏపీ, యానాంలో మరో మూడు రోజులు వర్షాలు కురవనున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణ కర్ణాటకలో, తమిళనాడులోనూ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. తీరంలో బలమైన గాలులు వీస్తున్నందున మత్స్యకారులు వేటకు వెళ్లడం ప్రమాదకరమని హెచ్చరించారు. 


ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో.. (Temperature in Andhra Pradesh)
ఏపీలోని ఉత్తర కోస్తాంధ్ర, యానాంలలో వాతావరణం నేడు మరింత చల్లగా మారనుంది. దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడిన మార్పులు, చలిగాలుల ప్రభావం ఉత్తర కోస్తాంధ్ర, యానాంలలో మరో మూడు, నాలుగు రోజులపాటు వర్షాలు కురవనున్నాయి. విశాఖపట్నం, విజయనగరం ఉభయ గోదావరి జిల్లాల్లో ఆకాశం మేఘావృతమై ఉంటుంది. ఈ జిల్లాల్లో కొన్ని చోట్ల ఓ మోస్తరు వర్షాలు కురవనుండగా, మరికొన్ని చోట్ల తేలికపాటి జల్లులు పడతాయని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. రైతులు ధాన్యం ఆరుబయట నిల్వ ఉంచకూడదని అధికారులు సూచించారు. మరో మూడు రోజులపాటు ఉష్ణోగ్రతలు తక్కువగానే ఉంటాయని తెలిపారు.


దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ..
గత కొన్ని రోజులుగా భానుడి ప్రతాపంతో పెరిగిన ఉష్ణోగ్రతలు రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో దిగొచ్చాయి. రాయలసీమలోని ఉమ్మడి చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో కొన్ని చోట్ల చిరు జల్లులు పడే అవకాశం ఉన్నట్లు ఏపీ వెదర్ మ్యాన్ తెలిపారు. తేలికపాటి జల్లులతో రాయలసీమ ప్రజలకు ఎండల నుంచి కాస్త ఉపశమనం కలుగుతోంది. 40 దాటిన ఉష్ణోగ్రతలు గత రెండు రోజులుగా దిగొస్తున్నాయి. అత్యధికంగా అనంతపురంలో 38.9 డిగ్రీలు, ఆరోగ్యవరంలో 36 డిగ్రీలు, కర్నూలులో 38.6 డిగ్రీలు నమోదైనట్లు అమరావతి కేంద్రం పేర్కొంది. కోస్తాంధ్రతో పోల్చితే ఇక్కడ ఉష్ణోగ్రతలు కనీసం 3, 4 డిగ్రీలు అధికంగా ఉన్నాయి.


తెలంగాణ వెదర్ అప్‌డేట్స్.. (Telangana Temperature Today)
బంగాళాఖాతంలో ఏర్పడిన పరిస్థితుల ప్రభావం తెలంగాణలో కొన్ని జిల్లాలపై ఉంది. అయితే ఏపీలో లాగ ఉష్ణోగ్రతలు దిగిరాలేదు. హైదరాబాద్ వాసులకు మాత్రం ఎండల నుంచి ఊరట లభించింది. ఇటీవల ఇక్కడ 40 డిగ్రీలు టచ్ అయిన ఉష్ణోగ్రతలు తాజాగా 37.2 డిగ్రీలుగా నమోదైంది. కొన్ని జిల్లాల్లో ఆకాశం మేఘావృతమై ఉంటుంది. రాష్ట్రంలో అత్యధికంగా 40.1 డిగ్రీలు, ఆ తరువాత ఆదిలాబాద్ లో 40 డిగ్రీలు, నల్గొండలో 39.5 డిగ్రీలు, నిజామాబాద్‌లో 39.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.