Punjab police arrested a gay man who disguised himself as a girl and killed men: పంజాబ్‌లోని కర్తార్ పూర్ సాహిబ్ హైవేకు కాస్తంత దగ్గర ఓ శవాన్ని స్థానికులు కనిపెట్టారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి ఆ శవాన్ని మనిందర్ సింగ్ అనే వ్యక్తిదిగా గుర్తించారు. అతని వీపు మీద ధోకేబాజ్ అని రాసి ఉంది. అంటో మోసగాడు అని అర్థం. ఇది తప్ప పోలీసులుకు అంతకు మించి క్లూ కనిపించలేదు. అయితే పోలీసులు ఈ కేసును సీరియస్ గా తీసుకుని దర్యాప్తు చేశారు.
చిన్న చిన్న ఆధారాలను పట్టుకుని .. చిక్కు ముడులు విప్పుకుంటూ వెళ్తే కేసు హర్ ప్రీత్ సింగ్ అనే వ్యక్తి దగ్గరకు చేరింది. అతనిని పట్టుకోవడానికి వెళ్లేటప్పటికీ అతను కనిపించలేదు. హైవేలు, టోల్ గేట్ల దగ్గర అతను టీ, వాటర్ బాటిళ్లు అమ్ముతూంటాడని తెలుసుకున్నారు. ఆ రోజు అతను ఓ ప్రాంతంలో ఉంటాడని తెలిసి అక్కడికి వెళ్లారు. అక్కడెవరు కనిపించలేదు కానీ ఓ మహిళ మాత్రం వాహనాలను ఆపి మగవాళ్లతో మాట్లాడటం గమనించారు. అదేదో సెక్స్ వర్కర్ కేసు అనుకున్నారు. అమెను అడిగితే ఏమైనా సమాచారం తెలుస్తుందేమోనని దగ్గరకు వెళ్లారు.
బాలుడ్ని రేప్ చేసిందని కేరళలో 19 ఏళ్ల యువతి అరెస్టు - అతడికి 16 ఏళ్లు - న్యాయమేనా ?
అయితే పోలీసుల్ని చూసి ఆమె పరారయ్యే ప్రయత్‌నం చేసింది. వెంటనే ఏదో తేడా ఉందని పోలీసులు వెంటాడి పట్టుకున్నారు. అవారికి అసలు షాక్ అప్పుడే తగిలింది. అదేమిటంటే ఆ మహిళా డ్రెస్ లో ఉన్నది మహిళ కాదు. మగవాఢు. కాసేపటికి పోలీసులు తాము వెదుకుతున్న హర్ ప్రీత్ సింగ్ అని గుర్తించారు. అసలు ఈ మహిళ వేషం ఏమిటి..ఎందుకు మగవాళ్లను పిలుస్తున్నాడు అని ఆరా తీశారు. ఈ క్రమంలో హర్ ప్రీత్ సింగ్ చెప్పిన నిజాలతో ఆ పోలీసులకు మైండ్ బ్లాంక్ అయింది. ఇప్పటి వరకూ పదకొండు మందిని చంపానని అందరూ తనను మోసం చేశారని పోలీసులకు చెప్పారు. ఏం మోసం చేశారంటే.. తనతో శృంగానికి ఒప్పుకుని తర్వాత తన సెక్సువాలిటీని కించ పరిచారట.
అంటే.. అతను గే. కానీ అమ్మాయిల విషయంలో మగవాళ్లను హైవేల మీద ఆకర్షిస్తున్నారు. అసలు పని చేయబోయే సరికి అతను గే అని ఆ మగవాళ్లు గుర్తిస్తున్నారు. దీంతో చిరాకుపడి హర్ ప్రీత్ సింగ్ పై మండిపడి వెళ్లిపోతున్నారు. కొంత మంది మరీ తిట్టడంతో వాళ్లను హత మార్చడం ప్రారంభించాడు. ఇలా మొత్తం మీద పదకొండు మందిని చంపానని అందరూ తనను మోసం చేశారని ఆ గే సింగ్ చెబుతున్నాడు. పద్దెనిమిది నెలల్లో ఇప్పటికి పదొకండు మందిని చంపినట్లుగా అంగీకరించాడు. ఆ వివరాలన్నీ పోలీసులు బయచకు తీసి నిజమేనని నిర్దారించారు. పోలీసులు అరెస్టు చేసి కోర్టులో ప్రవేశ పెట్టారు. ఇలాంటి హత్యలు సినిమాల్లోనే చూస్తూంటారు.