19 year old woman arrested for sexually assaulting teen boy: ఈ సారి నాకు వాడు దొరకాని రేప్ చేసేస్తాను వాడిని అని ఓ సినిమాలో హీరోయిన్.. హీరో గురించి అంటుంది. చక్కగా చేయిచుకుంటాడు అదేమైనా రివెంజ్ తీర్చుకోవడమా అని పక్కన ఉన్న అమ్మాయి కౌంటర్ ఇస్తుంది. దానికి ఆ రౌడీ హీరోయిన్ కూడా ఆలోచనలో పడుతుంది. ఇది సినిమా నిజంగా ఇలాంటి రేపులు జరిగితే కేసులు పెట్టేస్తారు. అబ్బాయిలపై కాదు ఇప్పుడు అమ్మాయిలపై కూడా పెడుతున్నారు. కేరళలో జరిగిన ఈ ఘటనే సాక్ష్యం.


కేరళలోని కొల్లాంలో శ్రీకుట్టి అనే పందొమ్మిదేళ్ల మహిళ ఓ పదహారేళ్ల అబ్బాయిని తీసుకుని వెళ్లిపోయింది. పలు చోట్ల తిరిగిన తర్వాత వారిని గుర్తించి ఇంటికి తీసుకు వచ్చారు. ఆ తర్వాత అబ్బాయి తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు. మా పిల్లవాడు మైనర్ అని.. మేజర్ అయిన ఆ అమ్మాయి తమ వాడికి మాయ మాటలు చెప్పి తీసుకుపోయి శారీరక కోరికలు  తీర్చుకుందని ఫిర్యాదు చేశారు. తల్లిదండ్రులకు భయపడ్డాడో మరో కారణమో కానీ ఆ పదహారేల్ల బాలుడు కూడా తాము పలు చోట్ల తిరిగి శారీరకంగా కలిశామని చెప్పాడు. 



Also Read: Hyderabad Police Warning: సంధ్య థియేటర్ ఘటనపై దుష్ప్రచారం, కఠిన చర్యలు తప్పవన్న హైదరాబాద్ పోలీసులు




నిజానికి అమ్మాయి, అబ్బాయి ఇద్దరూ వయసుతో సంబంధం లేకుండా ప్రేమించుకున్నారని అంటున్నారు. అబ్బాయి ఇష్టపూర్వకంగానే వెళ్లారని తమ వద్ద డబ్బులు ఉన్నంత కాలం జల్సా చేశారని.. అవి అయిపోవడంతో తిరిగి వచ్చారని అంటున్నారు. ఇలా వెళ్లిపోవడంతో ఆ బాలుడి ఫోర్స్ ఎక్కువగా ఉన్నప్పటికీ అమ్మాయిపై మాత్రం కేసులు నమోదయ్యాయి. ఈ ఘటన కేరళలో కలకలం రేపింది. మైనార్టీ చట్టాలు అందరికీ ఒకే రకంగా ఉంటాయని.. బాలుడైనా.. బాలికైనా మైనార్టీ తీరక ముందు లైంగిక చర్యలో పాల్గొనేలా ప్రోత్సహిస్తే అది నేరం అవుతుందని అందుకే కేసులు పెట్టామని పోలీసులు అంటున్నారు.  



Also Read: Allu Arjun Bail Petition: అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా, తొక్కిసలాటపై జనవరి 10న విచారణ