ఆదిత్య ఓం (Aditya Om)... కథానాయకుడిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఉత్తరాది యువకుడు. 'లాహిరి లాహిరి లాహిరిలో' సినిమాతో వెండితెరపైకి వచ్చిన అతడిలో నటుడు మాత్రమే కాదు... ఓ మంచి మనిషి కూడా ఉన్నాడు. 'బిగ్ బాస్ 8' (Bigg Boss 8 Telugu) నుంచి బయటకు వచ్చిన తర్వాత మరోసారి తన మంచి మనసు చాటుకున్నాడు ఆదిత్య ఓం.


గిరిజన గ్రామాలకు స్వచ్ఛమైన నీరు అందించేందుకు...
ఆదిత్య ఓం నటనకు 2010లో బ్రేకులు పడ్డాయి. ఐదేళ్ల తర్వాత మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చి అప్పుడప్పుడూ ఓ సినిమా చేస్తూ వచ్చారు. అయితే... ఆయనకు ఆశించిన విజయాలు రాలేదు. అలాగని ఆదిత్య ఓం సేవా కార్యక్రమాలు ఆపలేదు. తన వంతుగా మంచి పనులు చేస్తూ వచ్చారు. ఇప్పుడు 'బిగ్ బాస్' డబ్బుతో గిరిజన గ్రామాలకు స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు కృషి చేస్తున్నారని తెలిసింది.


నటనతో కాకుండా తన సేవా కార్యక్రమాలతో తెలుగు ప్రజల మనస్సులో మంచి స్థానం సొంతం చేసుకుంటున్న హీరో ఆదిత్య ఓం. తాజాగా తెలంగాణలో ఓ గిరిజన గ్రామం చెరుపల్లిలో నీటి సమస్యను పరిష్కరించేందుకు ఆయన ముందడుగు వేశారు. తాజాగా ఆ గ్రామానికి వెళ్లిన ఆదిత్య ఓం... అక్కడి ప్రజలు అందరికీ స్వచ్ఛమైన తాగు నీటిని అందిస్తానని ప్రతిజ్ఞ చేసి వచ్చారు.


డబ్బుల కోసం తాను 'బిగ్ బాస్' ఇంట్లో అడుగు పెట్టలేదని, తెలుగు ప్రజలకు దగ్గర కావడం కోసమే షోలో పార్టిసిపేట్ చేస్తున్నానని సీజన్ 8లో పలుసార్లు ఆదిత్య ఓం చెప్పారు. సుమారు ఐదు  వారాలు (32 రోజులు) ఆయన షోలో ఉన్నారు. ఆ షో నుంచి వచ్చిన డబ్బును సేవా కార్యక్రమాలకు వినియోగించాలని ఆదిత్య ఓం డిసైడ్ అయ్యారని తెలిసింది. 


Also Read: వడ్డే నవీన్ ఎలా మారిపోయాడో... పెళ్లి హీరో నయా లుక్ చూశారా?


తెలంగాణలోని చెరుపల్లిలో ప్రజలు కలుషితమైన నీరు తాగడం వల్ల వ్యాధుల బారిన పడుతున్నారని ఆదిత్య ఓం దృష్టికి వచ్చింది. దాంతో ఆ ఇరుగు పొరుగు గ్రామాల అవసరాలు తీర్చేందుకు RO వాటర్ ప్లాంట్ నిర్మాణానికి ముందుకు వచ్చారు. సంక్రాంతి పండుగలోపు ఊరి ప్రజలకు ఆర్వో ప్లాంట్ నిర్మాణ పనులు పూర్తి చేసి అందించాలనేది ఆదిత్య ఓం ఆలోచన. అందుకని, త్వరితగతిన పనులు మొదలు పెట్టారు. దాంతో ఆదిత్యకు ఆ ఊరి ప్రజలు కృతజ్ఞతలు చెబుతున్నారు.


Also Read'మ్యాక్స్' రివ్యూ: మ్యాగ్జిమమ్ మాస్ యాక్షన్‌తో అదరగొట్టిన కిచ్చా సుదీప్ - మరి సినిమా హిట్టా? ఫట్టా?


ప్రస్తుతం ఆదిత్య ఓం 'బంధీ' అని ఓ సినిమా చేస్తున్నారు. అదొక ప్రయోగాత్మక సినిమా. పర్యావరణ సంరక్షణ ప్రాముఖ్యతను తెలియజేసే కథ, కథనాలతో రూపొందుతోంది.


Also Readజీసస్‌తో పాటు గణేశుడికీ పూజలు... సమంత ఇంట్లో హిందూ దేవుళ్లు