SCR Extended Special Trains: తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు ద.మ రైల్వే (South Central Railway) గుడ్ న్యూస్ చెప్పింది. రద్దీ దృష్ట్యా పలు రూట్లలో నడిచే ప్రత్యేక రైళ్లను (Special Trains) పొడిగించింది. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి మార్చి వరకూ ఈ సర్వీసులు ఆయా రూట్లలో సేవలందిస్తాయని అధికారులు తెలిపారు. ఏపీ, తెలంగాణ మీదుగా రాకపోకలు సాగించే మొత్తం 20 రైళ్లను పొడిగిస్తున్నట్లు చెప్పారు.
రైళ్ల వివరాలు..
సికింద్రాబాద్ - రామాంతపురం - సికింద్రాబాద్ (07695/07696), కాచిగూడ - మధురై - కాచిగూడ (07191/07192), నాందేడ్ - ఈరోడ్ - నాందేడ్ (07189/07190), కాచిగూడ - నాగర్‌కోయల్ - కాచిగూడ (07435/07436), తిరుపతి - అకోలా - తిరుపతి (07605/07606), తిరుపతి - సికింద్రాబాద్ - తిరుపతి (07481/07482), కాకినాడ టౌన్ - లింగంపల్లి - కాకినాడ టౌన్ (07445/07446), హైదరాబాద్ - కటక్ - హైదరాబాద్ (07165/07166), హైదరాబాద్ - రక్సేల్ - సికింద్రాబాద్ (07051/07052), నర్సాపూర్ - బెంగుళూరు - నర్సాపూర్ (07153/07154) రైళ్లు పొడిగించినట్లు రైల్వే అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.
ఈ రైళ్లు రద్దు..
అటు, ప్రయాణికుల డిమాండ్ తగ్గడంతో శబరిమలకు వెళ్లే 14 ప్రత్యేక రైళ్లను ద.మ రైల్వే రద్దు చేసింది. మౌలాలీ - కొట్టాయం - మాలాలీ (07167/07168), మౌలాలీ - కొల్లాం - మౌలాలీ, కాచిగూడ - కొట్టాయం - కాచిగూడ, నర్సాపూర్ - కొల్లాం, హైదరాబాద్ - కొట్టాయం, కాగజ్‌నగర్ - కొల్లాం, కొల్లాం - కాగజ్‌నగర్, కొట్టాయం - సికింద్రాబాద్ రైళ్లు రద్దు చేశారు. అయితే, ఈ రైళ్లల్లో ముందుగా రిజర్వేషన్ చేసుకున్న వారికి ఇతర ట్రైన్లలో అవకాశం కల్పిస్తారా.? లేక డబ్బులు రీఫండ్ చేస్తారా.? అనేది తెలియాల్సి ఉంది.
Also Read: Allu Arjun Bail Petition: అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా, తొక్కిసలాటపై జనవరి 10న విచారణ