టీవీ సీరియల్స్ విషయంలో 'స్టార్ మా'కు కాంపిటీషన్ ఇచ్చే ఛానల్ మరొకటి లేదని అనుకోవాలి. తెలుగు టీవీ సీరియల్స్ 51వ వారం టీఆర్పీ రేటింగ్స్ విషయంలో 'స్టార్ మా'లో టెలికాస్ట్ అవుతున్న 'కార్తీక దీపం 2' నెంబర్ వన్ స్థానంలో ఉంది. దాన్ని కొట్టేది మరొకటి లేదని చెప్పాలి. ఎప్పటిలా ఈ వారం టీఆర్పీ రేటింగ్స్‌లోనూ డాక్టర్ బాబు సీరియల్ టాప్ ప్లేస్‌లో నిలిచింది. దానికి స్ట్రాంగ్ కాంపిటీషన్ ఇస్తున్న మరొక స్టార్ మా సీరియల్ ఏది? వివిధ ఛానళ్లలో టాప్ ప్లేస్ లోనే నిలిచిన సీరియల్స్ ఏవి అనేది చూడండి.
స్టార్ మా... 'కార్తీక దీపం 2' తర్వాత ఏదో తెలుసా?
'కార్తీక దీపం 2' సీరియల్ 51వ వారంలో 9.70 టీఆర్పీ రేటింగ్ అందుకుంది. ఆ దరిదాపుల్లోకి వచ్చింది కొత్తగా ప్రారంభమైన 'ఇల్లు ఇల్లాలు పిల్లలు' సీరియల్. దానికి 9.01 టీఆర్పీ రేటింగ్ వచ్చింది. ఆ తర్వాత 8.91 టీఆర్పీ రేటింగ్‌తో 'గుండె నిండా గుడి గంటలు' నిలిచింది. ఆ తరువాత 8. 29 టీఆర్పీతో 'చిన్ని', 8.12 టీఆర్పీతో 'ఇంటింటి రామాయణం' నిలిచాయి.
స్టార్ మా ఛానల్ వైపు కొంత మంది వీక్షకులు చూడడానికి కారణమైన 'బ్రహ్మముడి' టీఆర్పీ రేటింగ్ దారుణంగా పడిపోయింది. ఇప్పుడు ఆ సీరియల్ టీఆర్పీ 5.65 మాత్రమే. దాని కంటే ముందు 7.40 టీఆర్పీతో 'మగువ ఓ మగువ', 6.18 టీఆర్పీతో 'నువ్వుంటే నా జతగా' నిలిచాయి. 'బ్రహ్మముడి' రేటింగ్ పడిపోవడానికి ఆ సీరియల్ టైమింగ్ మారడం కూడా ఒక కారణమని చెప్పవచ్చు. 'నువ్వుంటే నా జతగా' సీరియల్ ప్రారంభమై వారమే అయ్యింది. దానికి మంచి రేటింగ్ వచ్చిందని చెప్పవచ్చు.
జీ తెలుగు... ఇందులో టాప్ సీరియల్ ఏదో తెలుసా?
స్టార్ మా సీరియళ్లకు స్ట్రాంగ్ కాంపిటీషన్ ఇస్తున్నది జీ తెలుగు ఛానల్. ఇందులో వచ్చే సీరియల్ సైతం వీక్షకుల ఆదరణ సొంతం చేసుకుంటున్నాయి. 'కార్తీక దీపం 2'ను కొట్టే సీరియల్ ఇందులో లేదు కానీ... 8.45 టీఆర్పీతో 'మేఘ సందేశం' సీరియల్ ఈ వారం జీ తెలుగులో టాప్ స్థానంలో ఉంది. దాని తర్వాత 7.98 టీఆర్పీతో 'పడమటి సంధ్యారాగం, 7.68 టీఆర్పీతో 'నిండు నూరేళ్ల సావాసం', 7.65 టీఆర్పీతో 'జగధాత్రి', 6.85 టీఆర్పీతో 'త్రినయని', 6.24 టీఆర్పీతో 'మా అన్నయ్య' సీరియల్స్ వీక్షకుల ఆదరణ సొంతం చేసుకుంటున్నాయి.
ఈటీవీ... టీఆర్పీ మూడు దాటిన సీరియల్ ఒక్కటీ లేదుగా!
ఈటీవీకి లాయల్ ఫ్యాన్ బేస్ ఉంది. ప్రతి రోజు రాత్రి వచ్చే న్యూస్ బులిటెన్ టీఆర్పీ విషయంలో రికార్డులు క్రియేట్ చేస్తోంది. అయితే ఆ ఛానల్ సీరియల్స్ పరంగా ఎక్కువ టీఆర్పీలు రాబట్టడంలో ఫెయిల్ అవుతున్నాయి.
Also Read: 'మ్యాక్స్' రివ్యూ: మ్యాగ్జిమమ్ మాస్ యాక్షన్‌తో అదరగొట్టిన కిచ్చా సుదీప్ - మరి సినిమా హిట్టా? ఫట్టా?
ఈటీవీలో ఈ వారం హైయెస్ట్ టీఆర్పీ వచ్చిన సీరియల్ 'రంగుల రాట్నం'. దానికి 2.34 టీఆర్పీ వచ్చింది. ఆ తర్వాత స్థానంలో 2.01 టీఆర్పీతో 'మనసంతా నువ్వే' నిలిచింది. టీఆర్పీ రేటింగ్స్ రెండు దాటిన సీరియల్స్ ఈటీవీలో ఆ రెండే ఉన్నాయి. మిగతావి అంతకంటే తక్కువ రేటింగ్ రాబడుతున్నాయి.
జెమినీ టీవీ... సింగిల్ డిజిట్ దాటేది ఎప్పుడు?
జెమినీ టీవీ సీరియల్స్ మరీ దారుణమైన టీఆర్పీ రేటింగ్స్ సొంతం చేసుకుంటున్నాయి. సింగిల్ డిజిట్ టీఆర్పీ దాటిన సీరియల్ ఒక్కటంటే ఒక్కటి మాత్రమే జెమినీలో ఉండటం మరి దారుణం. 'భైరవి' సీరియల్ టీఆర్పీ 1. 38. మిగతా సీరియల్స్ రేటింగ్స్ ఒకటి కంటే తక్కువ ఉండడం గమనార్హం.
Also Read: బేబీ జాన్ రివ్యూ: కీర్తి సురేష్ ఫస్ట్ హిందీ సినిమా - దళపతి విజయ్ 'తెరి' బాలీవుడ్ రీమేక్ ఎలా ఉందంటే?